"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

(రూపపట చిత్రణ)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
మొఘల్ చిత్రకళలో ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న అంశం మొక్కలు, జంతువుల చిత్రణ. వీటిని మొఘల్ చిత్రకారులు అత్యంత ప్రతిభావంతంగా జీవకళ ఉట్టిపడేటట్లు వాస్తవికతతో చిత్రించారు. బాబర్ స్వీయ చరిత్ర 'బాబర్ నామా' లో పుష్పాల, మొక్కలు, జంతువులకు సంబంధించిన అనేక వర్ణనలు వున్నాయి. అక్బర్ కాలంలో ఈ గ్రంధానికి, దానిలోని వర్ణనల కనుగుణంగా అందమైన చిత్రాలు జతపరచబడ్డాయి. పక్షులు, జంతువుల చిత్రాలు గీయడంలో ఉస్తాద్ మన్సూర్ మంచి ప్రావీణ్యం కనపరిచాడు. మొఘల్ చిత్రకళా చరిత్రకారుడైన మిలో సి. బీచ్ ప్రకారం మొఘల్ చిత్రకళలో సహజత్వం ఉట్టిపడుతుండేది. మొఘల్ చిత్రకారులు చిత్రించిన తొలినాటి జంతు చిత్రాలను పరిశీలిస్తే, వారు తాము ఎన్నుకొన్న చిత్రవస్తువు (theme) ను కొత్తగా, వినూత్నంగా పరిశీలించడం కన్నా, ఆ వస్తువు లోనే వైవిధ్యత ఎక్కువగా ప్రదర్శించారని తెలుస్తుంది. మొఘల్ చిత్రకారులు చిత్రించిన జంతువుల బొమ్మలపై, చైనా దేశంలో కాగితంపై తయారైన సాదా సీదా జంతు చిత్రాల ప్రభావం కొంతమేరకు ఉందని గుర్తించడం జరిగింది.
 
===రూపపట చిత్రణ (portraiture)===
మొఘల్ యుగంలో చిత్రకారులు మొదటినించి రూపపట చిత్రణను వాస్తవికతను ఆధారంగా చేసుకొని రూపపట చిత్రాలను రూపొందించారు. నిజానికి వాస్తవిక చిత్రణ (realistic portraiture) అనేది పర్షియన్ లఘుచిత్రకళలో గాని లేదా అంతకు పూర్వం వున్న భారతీయ చిత్రకళలో గాని ఒక లక్షణంగా ఎన్నడూ లేదు. ఒక విధంగా మొఘల్ చిత్రకారులతోనే వాస్తవిక రూపపట చిత్రాలను గీయడం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ రూపపట చిత్రాలన్నీ టెంపెరా పద్దతిలో గీయబడ్డ నీటి వర్ణ చిత్రాలు. అక్బర్ పాలనా కాలం వరకూ మొఘల్ చిత్రకారులు రూపపటాలను పార్శ్వ దృష్టితో చిత్రించేవారు. ఈ పద్దతిలో వ్యక్తి ముఖం నేరుగా వీక్షకుడిని చూస్తుంటే, మిగిలిన శరీరంలో సగభాగం వీక్షకుడి వైపు తిరిగివుండేది. పాదాలు కూడా సమంగా కాకుండా ఒకదాని వెనుక వున్నట్లుగా చిత్రించేవారు. ఇటువంటి పర్షియన్ సంప్రదాయ చిత్రణ, జహంగీర్ కాలంలో ప్రక్కకు పెట్టబడింది. ముఖ్యంగా జహంగీర్ కాలంలో రూపపట చిత్రణలో సృజనాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మూడువంతుల ప్రొఫైల్ లో చిత్రాలను రూపొందించే పద్దతి ఆచరణలోకి వచ్చింది. పాదాలు, చేతుల చిత్రణలో కూడా సృజనాత్మకత మరింతగా పెరిగింది.
 
మొగలుల కాలంలో చాలా కాలంవరకు పోర్ట్రెయిట్‌లు పురుషులవే ఉండేవి. ఉన్నత వంశీయులు, రాచకుటుంబీకులైన పురుషులను వారి వారి సేవకురాళ్లు లేదా ఉంపుడుగత్తెలు సేవిస్తూ ఉండగా గీసిన చిత్రాలే ఎక్కువగా ఉండేవి మొఘల్ రూపపట చిత్రాలలో రాచకుటుంబాలకు చెందిన స్త్రీ మూర్తుల ప్రాతినిధ్యం గురించి పండితుల మధ్య చర్చ జరిగింది. కొంతమంది పండితులు జహానారా బేగం, ముంతాజ్ మహల్ వంటి ప్రసిద్ధ స్త్రీ మూర్తుల యొక్క పోలికలు ఏవీ లేవని పేర్కొన్నారు, మరికొందరు లఘు చిత్రాలలో గల స్త్రీ మూర్తుల చిత్రాలలో వారి ఉనికిని పేర్కొంటున్నారు. దీనికి రుజువుగా వీరు ఫ్రీయర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో భద్రపరిచబడిన మొఘల్ రాకుమారుడు 'దారా షికో' యొక్క ఆల్బమ్ లోని మిర్రర్ పోర్ట్రెయిట్ లో గల ప్రసిద్ధ స్త్రీ మూర్తులను ఉదహరిస్తున్నారు.
 
==మొఘల్ చిత్రకళా వికాసం==
7,316

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2915959" నుండి వెలికితీశారు