మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 48:
 
అక్బర్ చక్రవర్తిని చక్కగా చిత్రించిన రూపపటాలు చాలా ఉన్నాయి. అయితే అవి, అతని వారసులైన జహంగీర్ మరియు షాజహాన్ల కాలంలో చిత్రించబడ్డాయి. మొగలాయిల కాలంలోనే భారతీయ లఘు చిత్రలేఖనంలో పాలకుల రూపపటాలను చిత్రించడమనేది ఒక ప్రముఖ అంశంగా స్థిరపడింది. తరువాత కాలంలో ఇది భారతదేశమంతటా ముస్లిం, హిందూ ప్రాంతీయ రాజ్యాలకు వ్యాపించింది.
 
ఝరోఖా దర్శన్ అనేది మరో కొత్తరకమైన చిత్రం. దీనిలో చక్రవర్తి ప్రజలకు బహిరంగ దర్శనం ఇవ్వడం కనిపిస్తుంది. ఇది అక్బర్, జహంగీర్, షాజహాన్ల పాలనలో రోజువారీ వేడుకగా జరిగేది. ఈ దృశ్యాలలో, చక్రవర్తి బాల్కనీలో లేదా కిటికీలో పైభాగంలో దర్శనమిస్తుంటే, క్రింద సభికుల గుంపు ఉంటుంది. అయితే ఇది ఇస్లాం కు విరుద్ధమని ప్రకటించిన ఔరంగజేబు దీనిని రద్దు చేసాడు. చిత్రపటాలలో కనిపిస్తున్న తేజోవలయ (halo) ప్రభావానికి తగ్గట్టుగానే చక్రవర్తుల బొమ్మలు కూడా ప్రముఖంగా కనిపిస్థాయి. తమను తాము, భూమిపై కనిపించే అల్లా ప్రతినిధులుగా లేదా దివ్యస్వరూపులుగా ప్రదర్శించుకోవాలనే మొఘల్ చక్రవర్తుల ఆకాంక్షను ఇటువంటి చిత్రాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇతర రూపపట చిత్రాలలో చక్రవర్తి కొలువు తీరిన దృశ్యాలు, దర్బార్ లో సందర్శకులను ప్రవేశపెడుతున్న దృశ్యాలు, సింహాసనాధిరోహుడైన చక్రవర్తి దృశ్యాలు, దర్బారీ దృశ్యాలు ముఖ్యమైనవి. వేట దృశ్యాలతో కనిపించే రాచరిక రూపపట చిత్రాలు తరువాత కాలంలో రాజపుత్ర చిత్రకళా శైలిలోను, మొఘల్ అనంతర శైలులలో బాగా ప్రాచుర్యం పొందాయి. 17 వ శతాబ్దం నుండి పాశ్చాత్య ప్రభావంతో గీయబడిన అశ్వరూఢులైన పాలకుల రూపపట చిత్రాలు బాగా జనాదరణ పొందాయి.
 
==మొఘల్ చిత్రకళా వికాసం==
"https://te.wikipedia.org/wiki/మొఘల్_చిత్రకళ" నుండి వెలికితీశారు