"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
భారతదేశంలో రెండవ మొఘుల్ చక్రవర్తి అయిన హుమాయూన్ సాహిత్యంలోనూ, కళలలోను చక్కని ప్రజ్ఞాశీలి. చిత్రకళ పట్ల అతనికి ఆసక్తి ఎక్కువ. షేర్షా సూరి విజయంతో రాజ్యభ్రష్టుడైన హుమాయూన్, భారతదేశం విడిచి కాందిశీకుడుగా 1543 లో పర్షియాకు చేరుకొని అక్కడ సఫావిడ్ రాజవంశీయుడైన చక్రవర్తి షా తమస్ప్-I (Shah Tahmasp-I) యొక్క ఆశ్రయంలో తలదాచుకొన్నాడు. సహజంగానే చిత్రకళాభిమాని అయిన హుమాయూన్, గొప్ప కళాపోషకుడైన షా తమస్ప్ ను ఆశ్రయించడం, భవిష్యత్తులో భారతదేశంలో మొఘల్ చిత్రకళావిర్భావానికి గొప్ప వరప్రసాదమయ్యింది.
 
పర్షియా లోని తబ్రిజ్ లో ఆశ్రయం పొందుతున్నప్పుడు అక్కడ వర్ధిల్లుతున్న పర్షియన్ చిత్రకళా పద్దతి హుమాయూన్ ను బాగా ఆకర్షించింది. అక్కడ షా తమస్ప్ దర్బార్ లోని మేటి ఆస్థాన చిత్రకారులైన బిహజాద్ (Kamāl ud-Dīn Behzād), మీరాక్ (Aqa Mirak), మీర్ ముసావ్విర్ (Mir Musavvir) వంటి వారి సాంగత్యంతో, హుమాయూన్ పర్షియన్ లఘుచిత్ర శైలి పట్ల అమితంగా ప్రభావితమయ్యాడు. అబ్దుస్ సమద్, మీర్ ముసావ్విర్ అనే ఇద్దరు ప్రసిద్ధ చిత్రకళాకారులను తనతో పాటు భారతదేశానికి రావలిసినదిగా ఆహ్వానించడమే కాకుండా వారి ద్వారా తబ్రిజ్ భాండాగారాలలో వున్నటువంటి గొప్ప చిత్రకళా ఖండాలను భారతదేశంలో సైతం సృష్టించాలని ఆశించాడు. అయితే కారణాంతరాల వల్ల మీర్ ముసావ్వీర్‌కు బదులుగా అతని కుమారుడైన మీర్ సయ్యద్ ఆలీ హుమాయూన్ వెంట రావలిసివచ్చింది.
 
.
పర్షియా నుండి భారతదేశానికి తిరిగి వస్తున్న హుమాయూన్, మధ్య దారిలో కాబూల్ పాలకుడు, తిరుగుబాటు సోదరుడైన కమ్రాన్ ను ఓడించాడు. 1553 లో కాబుల్ ను ఆక్రమించినపుడు, అక్కడ కమ్రాన్ నిర్వహిస్తున్న చిత్రశాలను కూడా స్వాధీనం చేసుకొని ఉండవచ్చు. బహుశా ఇక్కడ వున్నప్పుడే హుమాయూన్, మీర్ సయ్యద్ ఆలీ చిత్రకారునితో తన వంశ పూర్వీకుడైన తైమూర్ కు సంబంధించిన "ప్రిన్సెస్ అఫ్ ది హౌస్ అఫ్ తైమూర్" (తైమూర్ ఇంటి రాజకుమారులు) అనే చిత్ర కళాఖండాన్ని సృష్టింపచేసి ఉండవచ్చు. 1553 నాటికి చెందిన ఈ చిత్రం 1.15 చదరపు మీటర్ల కొలతలు గల అతి పెద్ద వస్త్రంపై చిత్రించబడింది. ఇటువంటి పెద్ద చిత్రాలు పర్షియన్ చిత్రకళా సంప్రదాయంలో అసాధారణమైనప్పటికీ మంగోల్ చిత్రకళా సంప్రదాయంలో మాత్రం సాధారణం. ప్రస్తుతం ఇది లండన్ లోని బ్రిటిష్ మ్యూజియంలో వుంది.
 
===అక్బర్ (1556-1605)===
6,876

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2916080" నుండి వెలికితీశారు