మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
 
===అక్బర్ (1556-1605)===
అక్బర్ నిరక్షరాస్యుడు అయినప్పటికీ విద్యాసక్తి, ఉత్తమ కళాభిరుచి గలవాడు. తన యవ్వనంలో అబ్దుస్ సమద్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. స్వతహాగా చిత్రకారుడు కూడా కావడంతో అక్బర్ చిత్రకళను గొప్పగా ప్రోత్సాహించాడు. ఉన్నది ఉన్నట్లుగా గీయగలిగిన చిత్రకారుడు మాత్రమే సృష్టికర్త ఆధిక్యతను గ్రహించగలడు. చిత్రకారుని అంత వాస్తవికతతో గీయగలిగిన వస్తువులలో సృష్టికర్త ప్రాణం పోస్తాడు అనే అభిప్రాయం అక్బర్ కు ఉండేది. అక్బర్ హాయంలో అతని దర్బార్ విస్తారమైన మొఘల్ సామ్రాజ్య పరిపాలనాధికారానికి కేంద్రంగానే కాక సాంస్కృతిక కళా నైపుణ్య కేంద్రంగా ఉద్భవించింది. లలితకళలన్నిటిలోను చక్కని సాన్నిహిత్యం కలిగివున్న అతని కాలంలో మొఘల్ చిత్రకళ సార్వతోముఖంగా అభివృద్ధి చెందింది.
 
===జహంగీర్ (1605–25)===
"https://te.wikipedia.org/wiki/మొఘల్_చిత్రకళ" నుండి వెలికితీశారు