మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 64:
===అక్బర్ (1556-1605)===
అక్బర్ నిరక్షరాస్యుడు అయినప్పటికీ విద్యాసక్తి, ఉత్తమ కళాభిరుచి గలవాడు. తన యవ్వనంలో అబ్దుస్ సమద్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. స్వతహాగా చిత్రకారుడు కూడా కావడంతో అక్బర్ చిత్రకళను గొప్పగా ప్రోత్సాహించాడు. ఉన్నది ఉన్నట్లుగా గీయగలిగిన చిత్రకారుడు మాత్రమే సృష్టికర్త ఆధిక్యతను గ్రహించగలడు. చిత్రకారుని అంత వాస్తవికతతో గీయగలిగిన వస్తువులలో సృష్టికర్త ప్రాణం పోస్తాడు అనే అభిప్రాయం అక్బర్ కు ఉండేది. అక్బర్ హాయంలో అతని దర్బార్ విస్తారమైన మొఘల్ సామ్రాజ్య పరిపాలనాధికారానికి కేంద్రంగానే కాక సాంస్కృతిక కళా నైపుణ్య కేంద్రంగా ఉద్భవించింది. లలితకళలన్నిటిలోను చక్కని సాన్నిహిత్యం కలిగివున్న అతని కాలంలో మొఘల్ చిత్రకళ సార్వతోముఖంగా అభివృద్ధి చెందింది.
 
అక్బర్ తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన కళా భండాగారాన్ని (లైబ్రరీ) ని విస్తృతపరచడమే కాకుండా ఆస్థాన చిత్రకారుల బృందాన్ని మరింతగా విస్తరించాడు. చిత్రకళాభివృద్ధికై ఆగ్రాలో రాచరిక చిత్రశాలను నెలకొల్పడమే కాకుండా ఆ చిత్రశాల నుండి రూపొందుతున్న చిత్రాలపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టి మరీ పర్యవేక్షించేవాడని తెలుస్తుంది. అక్బర్ చిత్రకళా పోషణ గురించిన వివరాలు అబుల్ ఫజల్ కావ్యంలో పేర్కొనబడ్డాయి. వందమందికి పైగా చిత్రకారులు అతని ఆస్థానంలో ఉండేవారని, వారిలో పదమూడు మంది ప్రముఖ చిత్రకారులని తెలుస్తుంది. వీరిలో అతని తండ్రి హుమాయూన్ వెంట వచ్చిన మీర్ సయ్యద్ ఆలీ, క్వాజా అబ్దుస్ సమద్ లతో పాటు దశ్వంత్, ముకుంద, బసవన్, ఫరూక్ బేగ్, ఖుస్రూ ఖులీ, కేశవ లాల్, హరిబంద్, మధు, జగన్ మొదలైనవారు ప్రసిద్ధులని ఐనీ అక్బరీ గ్రంధం పేర్కొంది. ముఖ్యంగా అబ్దుస్ సమద్ ముందు అక్బర్ స్వయంగా వివిధ భంగిమలలో కూర్చొని తన చిత్రాలను వేయించుకొనేవాడని అబుల్ ఫజల్ పేర్కొన్నాడు.
 
===జహంగీర్ (1605–25)===
"https://te.wikipedia.org/wiki/మొఘల్_చిత్రకళ" నుండి వెలికితీశారు