"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
అక్బర్ దర్బార్ లో సుమారు 11 మంది ముస్లింలు 6 గురు హిందువులు ఆస్థాన చిత్రకారులుగా ఉండేవారు. వారు తమ ప్రతిభా సంపన్నతతో మొఘల్ చిత్రకళకు వన్నెలు తెచ్చారు.వీరందరిలో అబ్దుస్ సమద్ నిస్సందేహంగా సాటిలేని మేటి చిత్రకారుడు. అతనికి షిరిన్ కలం లేదా మధుర లేఖిని అనే బిరుదు ఉండేది. మొఘల్ చిత్రకళకు పునాది వేసినవాడు అబ్దుస్ సమద్. నిజానికి అతనితోనే మొఘల్ చిత్రకళ ఆరంభమైందని పేర్కొంటారు. అతని శిష్యులలో దశ్వంత్ ప్రసిద్ధుడు. పేద పల్లకీ బోయీ కొడుకైన దశ్వంత్ ను అక్బర్ కనిపెట్టి అతనిని ప్రోత్సాహించాడు. పర్షియన్ కళారీతిని ఆచరిస్తూ ఒక నూతన కళావైచిత్రిని సృష్టిస్తున్న హిందూ చిత్రకారులకు దశ్వంత్ ఒక ప్రతీకగా ఉండేవాడు. మరో చిత్రకారుడు గోవర్ధన్ అక్బర్, జహంగీర్, షాజహాన్-ముగ్గురు చక్రవర్తుల కాలంలోను ప్రసిద్ధుడు.
 
మొఘల్ సచిత్ర గ్రంధాలలో (ఇలస్ట్రేటెడ్ గ్రంధాలు) మొట్ట మొదటిది తుతినామా (టేల్స్ ఆఫ్ ఎ పారట్). దూరప్రయాణీకుడైన భర్త ఇంట లేని సమయంలో, ప్రేమికుడి నుంచి దూరంగా ఉంచడానికి ఒక స్త్రీకి, ప్రతీరోజు రాత్రి ఆమె పెంపుడు చిలుక చెప్పిన 70 శృంగారభరితమైన కథలు సంస్కృతంలో శుకసప్తతి (12వ శతాబ్దం) పేరుతొ ప్రసిద్దమయ్యాయి. దీనిలోని 52 కథలను నఖ్షాబి (14వ శతాబ్దం) తుతినామా పేరుతొ పర్షియన్ భాషలో అనువదించడం జరిగింది. 1560 మరియు 1566 మధ్య కాలంలో మీరు సయ్యద్ ఆలీ, అబ్దుస్ సమద్ లాంటి మేటి చిత్రకారులు తుతినామా పర్షియన్ గ్రందానికి ఆగ్రా రాచరిక చిత్రశాలలో చక్కని చిత్రాలు సమకూర్చారు. ఈ గ్రంధంలో 250 వరకు లఘుచిత్రాలు వున్నాయి. ఇందులోని ఒక లఘుచిత్రంలో గీయబడిన 'కథలోని రాజు' చిత్రమే, అక్బర్ యొక్క మొట్టమొదటి చిత్రం. చక్కని చిత్రాలతో తుతినామా రూపు దిద్దుకొన్నప్పటికీ అందలి చిత్రాలు మాత్రం చాలా సరళంగా వున్నాయి. ఇది తొలి దశలో వున్న మొఘల్ చిత్ర నిర్మాణ శైలిని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ సచిత్ర గ్రంధం అమెరికా లోని క్లీవ్‌ల్యాండ్ ఆర్ట్‌ మ్యూజియంలో ఉంది. 1580లో అక్బర్ కోసం తుతినామా యొక్క రెండవ సచిత్ర గ్రంథ ప్రతిని తయారుచేయడం జరిగింది. ఈ రెండవ ప్రతిలోని అధిక భాగం నేడు డబ్లిన్‌లోని చెస్టర్ బీటీ లైబ్రరీలో వుంది.
 
===జహంగీర్ (1605–25)===
6,865

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2916416" నుండి వెలికితీశారు