"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

అక్బర్
(అక్బర్)
 
===గ్రంథ చిత్రణ (Illustrations)===
మొఘల్ చిత్ర శైలిలో వెలువడిన సచిత్ర గ్రంధాలలో (ఇలస్ట్రేటెడ్ గ్రంధాలు) 1550 నాటి తుతినామ గ్రంధం బహుశా మొట్టమొదటిది కావచ్చు. ఆగ్రా రాచరిక చిత్రశాలలో రూపుదిద్దుకున్న ఈ గ్రంధం ప్రస్తుతం అమెరికా లోని క్లీవ్‌ల్యాండ్ ఆర్ట్‌ మ్యూజియంలో ఉంది. దీనిలో సుమారు 250 వరకు సరళమైన లఘుచిత్రాలు (miniatures) వున్నాయి. దీనితో పోలిస్తే అక్బర్ చే పురమాయించబడిన "హంజనామా" అనేసచిత్ర పర్షియన్గ్రంధ బృహత్గ్రంధంచిత్రణ (4800బృహత్తరమైనది పేజీలతో,మాత్రమే 46కాక సంపుటిలతో ఉండేది) చాలా విశిష్టమైనదిఅసాధారణమైంది. అసాధారణమైన పెద్దపర్షియన్ పేజీలతోకావ్యానికి (69సచిత్ర సెం.మీ.గ్రంథ xప్రతి 544800 సెం.మీ.)పేజీలతో, వున్న14 సంపుటిలతో గ్రంధంలోతయారైంది అందులోను సాధారణ కాగితం మీద కాకుండా ఒకగట్టిగా పెద్దనేసిన నూలు వస్త్రంపైవస్త్రంమీద దాదాపు 1,400 కు పైగా రమణీయమైన లఘుచిత్రాలు చిత్రించబడ్డాయి. అమీర్ హంజా అనే పారశీక వీరుని ప్రేమగాధావృత్తంతో కూడి వున్నగ్రంథంలోగ్రంధానికి బొమ్మలు శృంగారసమకూర్చే సన్నివేశాలు, బెదిరింపు సంఘటనలు, తృటిలో తప్పించుకోనే దృశ్యాలు, హింసాత్మక దృశ్యాలు-ఇత్యాది దృశ్యాలను వివరిస్తూ అనేక చిత్రాలు గీయబడ్డాయి. ఈ గ్రంధానికి బొమ్మలుప్రక్రియ సమకూర్చడం 1562 లో ప్రారంభమై 1577 వరకూ అంటే 14 సంవత్సరాల సుదీర్ఘపాటు కాలంసుదీర్గంగా కొనసాగింది. ఈ బృహత్కార్యానికిఅపూర్వ మొదటచిత్ర సయ్యద్రచనా ఆలీబృంద తబ్రీజికృషిలో తరువాతపర్షియన్ అబ్దుస్చిత్రకారులతో సమద్పాటు చిత్రకారులు నేతృత్వం వహించారు. ఈ అసాధారణ చిత్ర రచనా కృషిలో భారతదేశం నలుమూలల నుండి వచ్చిన సుమారు వంద మందికి పైగా భారతీయ చిత్రకారులు సమిష్టిగా పాలుపంచుకున్నారు. అక్బర్ యొక్క రాతప్రతి (manuscript) లో దాదాపు 1400 లఘుచిత్రాలు ఉన్నాయి. ఈ గ్రంధంలో ప్రతీ పేజీని తెరవగానే ఒక లఘుచిత్రం, ఆ చిత్రాన్ని చూసిన చక్రవర్తికి అర్థమయ్యేటట్లు ఆ పేజీ వెనుక భాగాన చిత్రానికి సంబంధిత వచనం వ్రాయబడిందిపాల్గొన్నారు. 1580 నాటికి మొఘల్ రాచరిక చిత్రశాల ఇటువంటి అనేక పర్షియన్, భారతీయ గ్రంధాలకు చిత్రరచనరమణీయమైన చిత్రాలను చేయించిందిరూపొందించింది.
 
మొఘల్ రాజవంశపు జీవిత చరిత్ర గ్రంధాలు కూడా లఘుచిత్రాలతో చిత్రించబడ్డాయి. ఈ సంప్రదాయం బాబర్ నామా గ్రంధంతో ప్రారంభమైనప్పటికీ, అక్బర్ కి ముందున్న కాలంలో రాచరిక జీవితచరిత్ర గ్రంధాలకు చిత్రాలు సమకూర్చబడలేదు. తుర్కీ భాషలో వున్న బాబర్ స్వీయ చరిత్ర 'తుజ్ కీ బాబరీ'ను అతని మనవడు అక్బర్ పర్షియన్ భాషలోకి బాబర్ నామా (1589) పేరుతొ అనువదింపచేసాడు. తరువాత దానిని నాలుగు సుందరమైన సచిత్ర రాతప్రతులలో చిత్రింపచేసాడు. ఒక్కొక్క ప్రతిలో 183 లఘుచిత్రాలు ఉన్నాయి. అక్బర్ 1590 లలో తన వంశ పూర్వీకుడైన తైమూర్ జీవిత చరిత్ర 'జాఫర్ నామా' (యాజ్డి విరచితం) గ్రంధానికి సచిత్ర రచన చేయించాడు. కాని అతని అత్త గుల్ బదన్ బేగం, తన తండ్రి హుమాయున్ జీవిత చరిత్రను వ్రాసినప్పటికీ, దానికి సంబందించిన సచిత్ర రాతప్రతి పూర్తిగా లభ్యం కాలేదు. అక్బర్ జీవిత చరిత్రను అబ్దుల్ ఫైజీ 'అక్బర్ నామా' పేరుతొ పర్షియన్ భాషలో వ్రాయడం జరిగింది. 1594 లో పూర్తయిన అక్బర్ నామా సచిత్ర గ్రంథ చిత్రరచనాకృషిలో బసవన్ వంటి ప్రఖ్యాత చిత్రకారునితో సహా మొత్తం 49 మంది చిత్రకారులు పాలుపంచుకున్నారు. 116 లఘుచిత్రాలతో వున్న అక్బర్ నామా సచిత్ర రాత ప్రతి ప్రస్తుతం లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో వుంది. అదేవిధంగా జహంగీర్ స్వీయ చరిత్ర జహంగీర్ నామా (తజక్-ఎ-జహంగీరి), షాజహాన్ జీవిత చరిత్ర 'పాద్ షా నామా' గ్రంధాలకు రమణీయమైన లఘుచిత్రాలు కూర్చడం జరిగింది. పాద్ షా నామా గ్రంధం (1650)తో రాచరిక స్వీయ చరిత్ర గ్రంధాలకు ఘనంగా సచిత్ర రచనలు చేయడం ఆగిపోయింది.
మొఘల్ సచిత్ర గ్రంధాలలో (ఇలస్ట్రేటెడ్ గ్రంధాలు) మొట్ట మొదటిది తుతినామా (టేల్స్ ఆఫ్ ఎ పారట్). దూరప్రయాణీకుడైన భర్త ఇంట లేని సమయంలో, ప్రేమికుడి నుంచి దూరంగా ఉంచడానికి ఒక స్త్రీకి, ప్రతీరోజు రాత్రి ఆమె పెంపుడు చిలుక చెప్పిన 70 శృంగారభరితమైన కథలు సంస్కృతంలో శుకసప్తతి (12వ శతాబ్దం) పేరుతొ ప్రసిద్దమయ్యాయి. దీనిలోని 52 కథలను నఖ్షాబి (14వ శతాబ్దం) తుతినామా పేరుతొ పర్షియన్ భాషలో అనువదించడం జరిగింది. 1560 మరియు 1566 మధ్య కాలంలో మీరు సయ్యద్ ఆలీ, అబ్దుస్ సమద్ లాంటి మేటి చిత్రకారులు తుతినామా పర్షియన్ గ్రందానికి ఆగ్రా రాచరిక చిత్రశాలలో చక్కని చిత్రాలు సమకూర్చారు. ఈ గ్రంధంలో 250 వరకు లఘుచిత్రాలు వున్నాయి. ఇందులోని ఒక లఘుచిత్రంలో గీయబడిన 'కథలోని రాజు' చిత్రమే, అక్బర్ యొక్క మొట్టమొదటి చిత్రం. చక్కని చిత్రాలతో తుతినామా రూపు దిద్దుకొన్నప్పటికీ అందలి చిత్రాలు మాత్రం చాలా సరళంగా వున్నాయి. ఇది తొలి దశలో వున్న మొఘల్ చిత్ర నిర్మాణ శైలిని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ సచిత్ర గ్రంధం అమెరికా లోని క్లీవ్‌ల్యాండ్ ఆర్ట్‌ మ్యూజియంలో ఉంది. 1580లో అక్బర్ కోసం తుతినామా యొక్క రెండవ సచిత్ర గ్రంథ ప్రతిని తయారుచేయడం జరిగింది. ఈ రెండవ ప్రతిలోని అధిక భాగం నేడు డబ్లిన్‌లోని చెస్టర్ బీటీ లైబ్రరీలో వుంది.
 
తుతినామా తరువాత అక్బర్ పురమాయించిన రెండవ భారీ ప్రాజెక్ట్ "హంజనామా". సచిత్ర గ్రంధాలలో హంజానామా రూపొందిన తీరు మొఘల్ చిత్రకళా జగత్తులోనే అసాధారణమైనది. అమీర్ హంజా అనే పారశీక వీరుని ప్రేమగాధావృత్తంతో కూడి వున్న ఈ పర్షియన్ గ్రంథంలోని కథలపై అక్బర్ కు చిన్ననాటి నుండి ఆసక్తి మెండుగా ఉండేది. చక్రవర్తి అయిన పిదప చక్కని చిత్రాలతో హంజనామాను పునఃసృష్టించవలసిందిగా చిత్రకారులను పురమాయించాడు. అక్బర్ అభీష్టానుసారం హంజానామా గ్రంధాన్ని అందమైన చిత్రాలతో పునఃసృష్టించే బృహత్తర కార్యక్రమం 1562 లో ఆగ్రా లోని రాచరిక చిత్రశాలలో మీర్ సయ్యద్ ఆలీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
 
హంజనామా గ్రంధానికి అసాధారణ సైజులో వున్న నూలు వస్త్రపు పేజీల మీద, దాదాపు 1,400 కు పైగా పూర్తి పేజీ (full page) లఘుచిత్రాలు చిత్రించబడ్డాయి. ఈ చిత్రాలు 69 సెం.మీ. x 54 సెం.మీ. (సుమారుగా 27 x 20 అంగుళాలు) సైజులో వున్న పెద్ద పేజీల మీద గీయబడ్డాయి. అందులోను సాధారణ కాగితం మీద కాకుండా నూలు వస్త్రంమీద చిత్రించబడ్డాయి. ఈ గ్రంథంలో శృంగార సన్నివేశాలు, బెదిరింపు సంఘటనలు, తృటిలో తప్పించుకోనే దృశ్యాలు, హింసాత్మక దృశ్యాలు-ఇత్యాది దృశ్యాలను వివరిస్తూ వందలాది చిత్రాలు గీయబడ్డాయి. మొత్తం మీద వందలాది రమణీయమైన చిత్రాలతో, 4,800 పేజీలతో, 14 సంపుటిలతో హంజనామాకు సచిత్ర గ్రంథ ప్రతి రూపొందింది. అక్బర్ యొక్క హంజనామా రాతప్రతి (manuscript) లో నూలు వస్త్రం మీద గీసిన 1400 లఘుచిత్రాలు ఉన్నాయి. ఈ గ్రంధంలో ప్రతీ పేజీని తెరవగానే ఒక లఘుచిత్రం, ఆ చిత్రాన్ని చూసిన చక్రవర్తికి సులభంగా అర్థమయ్యేటట్లు ఆ పేజీ వెనుక భాగాన చిత్రానికి సంబంధిత వచనం వ్రాయబడింది.
 
ఈ గ్రంధానికి బొమ్మలు సమకూర్చడం 1562 లో ప్రారంభమై 1577 వరకూ అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ఈ సచిత్ర గ్రంథ సృష్టిలో 30 మందికి పైగా ముఖ్య చిత్రకారులు ప్రధాన పాత్ర వహించారు. ఈ బృహత్కార్యానికి మొదట మీర్ సయ్యద్ ఆలీ తరువాత అబ్దుస్ సమద్ చిత్రకారులు నేతృత్వం వహించారు. ఈ అసాధారణ చిత్ర రచనా కృషిలో పర్షియన్ చిత్రకారులతో పాటు సుమారు వంద మందికి పైగా భారతీయ చిత్రకారులు సమిష్టిగా పాలుపంచుకున్నారు. పర్షియా నుండి, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చిత్ర కళాకారుల యొక్క విభిన్న శైలులను ఒకే ఏకీకృత శైలిలో రూపొందించడానికి హంజనామా గ్రంధం ఒక సాధనంగా ఉపయోగపడింది. 14 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ చిత్ర రచనా యజ్ఞం పూర్తయ్యేసరికి ఇండో, పర్షియన్ శైలి మేళవింపులతో కూడిన మొఘల్ చిత్రకళా శైలి పరిపక్వతకు చేరుకుంది. పర్షియన్ చిత్రకళలోని మంద్ర వర్ణాలు, అలంకృత మేళవింపులు (flat and decorative compositions) మొఘల్ చిత్రకళలో వచ్చేసరికి సువిశాలమైన స్థల సృష్టిలో నింపబడిన బొమ్మలుగా రూపాంతరం చెందాయి.
===జహంగీర్ (1605–25)===
 
6,865

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2916481" నుండి వెలికితీశారు