మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

అక్బర్
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 75:
హంజనామా గ్రంధానికి అసాధారణ సైజులో వున్న నూలు వస్త్రపు పేజీల మీద, దాదాపు 1,400 కు పైగా పూర్తి పేజీ (full page) లఘుచిత్రాలు చిత్రించబడ్డాయి. ఈ చిత్రాలు 69 సెం.మీ. x 54 సెం.మీ. (సుమారుగా 27 x 20 అంగుళాలు) సైజులో వున్న పెద్ద పేజీల మీద గీయబడ్డాయి. అందులోను సాధారణ కాగితం మీద కాకుండా నూలు వస్త్రంమీద చిత్రించబడ్డాయి. ఈ గ్రంథంలో శృంగార సన్నివేశాలు, బెదిరింపు సంఘటనలు, తృటిలో తప్పించుకోనే దృశ్యాలు, హింసాత్మక దృశ్యాలు-ఇత్యాది దృశ్యాలను వివరిస్తూ వందలాది చిత్రాలు గీయబడ్డాయి. మొత్తం మీద వందలాది రమణీయమైన చిత్రాలతో, 4,800 పేజీలతో, 14 సంపుటిలతో హంజనామాకు సచిత్ర గ్రంథ ప్రతి రూపొందింది. అక్బర్ యొక్క హంజనామా రాతప్రతి (manuscript) లో నూలు వస్త్రం మీద గీసిన 1400 లఘుచిత్రాలు ఉన్నాయి. ఈ గ్రంధంలో ప్రతీ పేజీని తెరవగానే ఒక లఘుచిత్రం, ఆ చిత్రాన్ని చూసిన చక్రవర్తికి సులభంగా అర్థమయ్యేటట్లు ఆ పేజీ వెనుక భాగాన చిత్రానికి సంబంధిత వచనం వ్రాయబడింది.
 
ఈ గ్రంధానికి బొమ్మలు సమకూర్చడం 1562 లో ప్రారంభమై 1577 వరకూ అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ఈ సచిత్ర గ్రంథ సృష్టిలో 30 మందికి పైగా ముఖ్య చిత్రకారులు ప్రధాన పాత్ర వహించారు. ఈ బృహత్కార్యానికి మొదట మీర్ సయ్యద్ ఆలీ తరువాత అబ్దుస్ సమద్ చిత్రకారులు నేతృత్వం వహించారు. ఈ అసాధారణ చిత్ర రచనా కృషిలో పర్షియన్ చిత్రకారులతో పాటు సుమారు వంద మందికి పైగా భారతీయ చిత్రకారులు సమిష్టిగా పాలుపంచుకున్నారు. పర్షియా నుండి, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చిత్ర కళాకారుల యొక్క విభిన్న శైలులను ఒకే ఏకీకృత శైలిలో రూపొందించడానికి హంజనామా గ్రంధం ఒక సాధనంగా ఉపయోగపడింది. 14 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ చిత్ర రచనా యజ్ఞం పూర్తయ్యేసరికి ఇండో, పర్షియన్ శైలి మేళవింపులతో కూడిన మొఘల్ చిత్రకళా శైలి పరిపక్వతకు చేరుకుంది. పర్షియన్ చిత్రకళలోని మంద్ర వర్ణాలు, అలంకృత మేళవింపులు (flat and decorative compositions) మొఘల్ చిత్రకళలో వచ్చేసరికి సువిశాలమైన స్థల సృష్టిలో నింపబడిన బొమ్మలుగా రూపాంతరం చెందాయి.
 
ఫతేపూర్ సిక్రీలోని రాచరిక చిత్రశాల అనేక పర్షియన్, భారతీయ కావ్యాలకు ఇలస్ట్రేషన్ చిత్రాలను (గ్రంధస్త విషయ వివరణ చిత్రాలు) రూపొందించింది. 1582 లో సాది షిరాజి యొక్క మహత్తర రచన గులిస్తాన్ (పూల తోట)కు చిత్రాలు సమకూర్చబడ్డాయి. పారశీక పౌరాణిక రాజు దరాబ్ సాహసకృత్యాలను వివరించే దరాబ్-నామా గ్రంధానికి 1585 లో చిత్రాలు చేర్చబడ్డాయి. 1585 నాటికి నిజామి ఖమ్సా గ్రంధానికి అనేక ప్రసిద్ధ చిత్రాలు గీయబడ్డాయి. 36 ప్రకాశవంతమైన పేజీలతో వున్న నిజామి ఖమ్సా లోని చిత్రాలలో వివిధ కళాకారుల యొక్క విభిన్న శైలులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ చిత్రాలు సాంప్రదాయక పర్షియన్ కళా ప్రభావం నుండి బయటపడినట్లు కనిపిస్తాయి. లాహోర్లో జామీ యొక్క రచన బహరిస్తాన్ (వసంత తోట) కు 1590 లలో చిత్రాలు జతపరచబడ్డాయి. బహరిస్తాన్ (9వ శతాబ్దం) గులిస్తాన్ శైలిలో రాయబడిన కావ్యం.
 
===జహంగీర్ (1605–25)===
"https://te.wikipedia.org/wiki/మొఘల్_చిత్రకళ" నుండి వెలికితీశారు