దున్నుట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వ్యవసాయ పద్ధతులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Farmer plowing.jpg|thumb|230px|గుర్రాల ద్వారా దుక్కి దున్నుతున్న [[రైతు]]]]
[[File:Fendt Tractor Ripping up Kulin.jpg|thumb|right|275px|నేలలో కొంత తేమ ఉంటే దున్నకం బాగా వస్తుంది, అందువలన [[తొలకరి]] వర్షాల తరువాత ట్రాక్టర్‌తో చేస్తున్న దున్నకం]]{{మూలాలు లేవు}}
'''దున్నుట''' అనగా మానవులు [[నాగలి]] ద్వారా నేలను తిరగవేసి లేదా కలదిప్పి లేదా విప్పారేలా చేసి నేల పైభాగాన్ని దృవువుగా చేసే ప్రక్రియ. నాగలి ద్వారా దున్నబడిన నేల పైభాగం విచ్ఛిన్నమై, తద్వారా గాలి మరియు సూర్యరశ్మి మట్టిలోకి ప్రవేశిస్తాయి. ఇది మట్టిని మరింత సారవంతం చేస్తుంది. పూర్వం మానవులు ఎక్కువగా నాగలిని ఎద్దులకు లేదా దున్నపోతులకు కట్టి లాగించి నేలను దున్నేవారు. నేడు దున్నటానికి ఎక్కువగా ట్రాక్టర్, ట్రిల్లర్ వంటి వాహనాలను ఉపయోగిస్తున్నారు. [[పంట]]లు [[సాగు]] చేయుటకు ముందుగా నేలను బాగా దున్నాలి. దీని వలన [[పొలం]]లో ఉన్న కలుపుమొక్కలు చనిపోతాయి, నేల విప్పారడం వలన సారవంతమవుతుంది, తద్వారా మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మొక్కలు ఎదగటానికి నేల వదులుగా ఉండటం అవసరం, నేలను దున్నినప్పుడు నేల వదులుగా తయారై మొక్కల వేర్లు [[నేల]]లోకి చొచ్చుకుపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నేల దున్నటం వలన నేలలోని పోషకాలు మొక్కలకు బాగా అందుతాయి. దున్నటం వలన నేల [[నీరు]]ను బాగా పీల్చుకొని మొక్కలకు, చెట్లకు నీటిని అందిస్తాయి. విత్తనం మొలకెత్తాలంటే నేల పైభాగం మృదువుగా వుండాలి, అందుకనే విత్తనాలు నాటేటప్పుడు నేలను ఎక్కువసార్లు దున్నుతారు. నేలను దున్నటం వలన నేలలో దాగివున్న చీడపీడలు, పురుగులు నశిస్తాయి. విత్తనాలు మొలకెత్తిన తరువాత కూడా కలుపును తొలగించుటకు, నేలను వదులుగా చేయుటకు సాళ్లలో నాటిన మొక్కలకు ఇరువైపులా దున్నుతారు. పంట నాటు మొదలు పంట కోత వరకు దున్నకం అనేది చాలా ప్రముఖమైనది. దున్నకం అనేది పంట దిగుబడిని పెంచుతుంది. భూమిలో భూసారం తగ్గినప్పుడు పశువుల ఎరువులను లేదా రసాయన ఎరువులను వేసి దున్నుతారు, తద్వారా భూసారం పెరుగుతుంది. పాత పంటను తొలగించి మళ్ళీ కొత్త పంటను పండించుటకు పాత పంటను నేలలో కలిసిపోయేలా దున్నుతారు, మరికొన్ని సార్లు బాగా దున్ని మళ్ళీ కొత్త పంటను ప్రారంభిస్తారు. నేలలో కొంత తేమ ఉంటే దున్నకం బాగా వస్తుంది, అందువలన [[తొలకరి]] వర్షాల తరువాత ట్రాక్టర్‌లతో దున్నకం చేస్తారు. నీటి సౌకర్యం ఉంటే నేల నెమ్ముబారేలా చేసి తడి మీద నేలను దున్నుతారు. వరి పంట కోసం నేలలో నీరును నిల్వ ఉంచి నీళ్లలో దున్నుతారు, బురదగా ఉన్న నేలలోనే వరి [[నారు]]ను నాటుతారు.
 
"https://te.wikipedia.org/wiki/దున్నుట" నుండి వెలికితీశారు