నూతన్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 25:
నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన '''నూతన్ ప్రసాద్''' ([[డిసెంబర్ 12]], [[1945]] - [[మార్చి 30]], [[2011]]) అసలు పేరు '''తడినాధ వరప్రసాద్'''. 1970వ, 80వ దశకములో [[తెలుగు చలనచిత్ర|తెలుగు సినిమా]] రంగములో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు, ప్రతినాయకుడు.
 
== జీవిత విషయాలు ==
== జననం ==
[[1945]], [[డిసెంబర్ 12]]న [[కృష్ణా జిల్లా]] [[కైకలూరు]]లో జన్మించాడు. [[హైదరాబాదు]]లో ప్రభుత్వోద్యోగం చేస్తున్న ఆయన 1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి [[అక్కినేని నాగేశ్వరరావు]] నటించిన [[అందాల రాముడు]] చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత [[నీడలేని ఆడది]] మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు [[ముత్యాల ముగ్గు]] చిత్రంలో [[రావుగోపాలరావు]]తో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చింది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నె లద్దారు. అనేక చిత్రాలలో అగ్ర నటులైన [[నందమూరి తారక రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఘట్టమనేని కృష్ణ]], [[చిరంజీవి]] సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక చిత్రంలో కథానాయకునిగా కూడా నటించాడు.
 
నూతన్ ప్రసాద్ [[సైతాన్]]గా నటించిన [[రాజాధిరాజు]] చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. 1984 లో ''సుందరి సుబ్బారావు'' చిత్రంలో నటనకు ఆయనకు [[నంది పురస్కారం]] లభించింది. 2005 లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. తన 365వ సినిమా 'బామ్మమాట బంగారుబాట' చిత్రీకరణ సమయంలో జరిగిన [[ప్రమాదం]]లో గాయపడి కొంతకాలం నటజీవితామనికి దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టారుమొదలెట్టి, 112 సినిమాలలో నటించాడు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగాడు. ‘దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది’ ‘నూటొక్క జిల్లాల అందగాడిని’ అనే డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయ. ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఏ ప్రాత పోషించినా ప్రాణం పోసేవాడు. ముఖ్యంగా ప్రసాద్‌లో ధారణశక్తి గొప్పది. ఎంత పెద్ద డైలాగ్‌ చెప్పినా ఒకే టేక్‌లో 1200 అడుగులు షాట్‌ ఒకే చేసి ఆ రోజుల్లో [[సంచలనం]] సృష్టించాడు. అప్పటికీ ప్రసాద్‌ కొత్త తరం నటుడే అయినా పాతతరం పోకడల్ని తూ.చ. తప్పకుండా అనుసరించేవాడు. దర్శకుల మనోభావాలను అర్ధం చేసుకొని ఎంతటి క్లిష్టమైనా సన్నివేశానికైనా జవసత్వాలు నింపి ఆ సన్నివేశాన్ని పండించేవాడు. అందరిలో కలుపుగోలు తనంగా వుంటూ ముఖ్యంగా సంభాషణల్లో తనలో ఉన్న నటుడ్ని ఆవిష్కరించేవాడు<ref>[http://www.visalaandhra.com/minitalkies/article-79060 'నూటొక్క జిల్లాల అందగాడు' నూతన్‌ ప్రసాద్‌]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ప్రసాద్ దాదాపు 365 సినిమాల్లో నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.<ref name="bhumi">{{Cite web |url=http://archives.andhrabhoomi.net/state/nutan-prasad-kannumuta-214 |title=నూతన్ ప్రసాద్ కన్నుమూత |website= |access-date=2013-12-28 |archive-url=https://web.archive.org/web/20140406145318/http://archives.andhrabhoomi.net/state/nutan-prasad-kannumuta-214 |archive-date=2014-04-06 |url-status=dead }}</ref>
 
కొద్ది రోజులు [[రవీంద్ర భారతి]]కి ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు. వ్యక్తిగతంగా [[తెలుగుదేశం పార్టీ]] అభిమాని.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/65377.html</ref>
"https://te.wikipedia.org/wiki/నూతన్_ప్రసాద్" నుండి వెలికితీశారు