అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లొ → లో, లో → లో (3), కు → కు (6), ఖచ్చితమై → కచ్చితమై, గ్రంధా → గ్రంథా, ప
పంక్తి 14:
* {{Unbulleted list|{{lang|grc|Μέγας Ἀλέξανδρος}}{{Cref2|d}}|{{transl|grc|Mégas Aléxandros}}|{{Literal translation|'Great Alexander'|lk=on}}}}
* {{Unbulleted list|{{lang|grc|Ἀλέξανδρος ὁ Μέγας}}|{{transl|grc|Aléxandros ho Mégas}}|{{Literal translation|'Alexander the Great'}}}}
}}|spouse={{Unbulleted list | బాక్ట్రియాకు చెందిన రోక్సానా | పర్షియాకు చెందిన స్టాటీరా II | పర్షియాకు చెందిన పారిసాటిస్ II}}|succession5=[[Lord of Asia]]|reign5=331–323 సా.పూ.|house-type=వంశం|father=మాసెడోన్ కు చెందిన ఫిలిప్ II|mother=ఒలింపియాస్|birth_date=సా.పూ. 356 జూలై 20 లేదా 21|birth_place=పెల్లా, మాసెడోన్, ప్రాచీన గ్రీసు|death_date=సా.పూ. 323 జూన్ 10 లేదా 11 (32 ఏళ్ళు)<!-- 32 సంవత్సరాల, 10 నెలల 20 రోజులు (సుమారు.) -->|death_place=బాబిలోన్, మెసొపొటోమియా|religion=గ్రీకు పాలీథీయిజమ్}}[[దస్త్రం:Alexander-Empire 323bc.jpg|thumb|300px|సా.పూ. 323లో అలెగ్జాండర్ మరణించేనాటికి ఇతడి సామ్రాజ్యం.]]అలెగ్జాండర్ ([[సామాన్య శకం|సా.పూ]]<ref group="నోట్స్">సామాన్యశక పూర్వం. క్రీస్తు శకాన్ని ప్రస్తుత కాలంలో సామాన్య శకం అంటున్నారు. ఇంగ్లీషులో కామన్ ఎరా అంటారు. ఇదివరలో క్రీస్తు పూర్వం అనే దాన్ని సామాన్యశక పూర్వం (సా.పూ) అనీ, క్రీస్తు శకం అనేదాన్ని సామన్య శకం (సా.శ) అనీ అంటారు. </ref> 356 జూలై 20/21 - సా.పూ 323 జూన్ 10/11) ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ {{Cref2|a}} కు రాజు (గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని ''బాసిలియస్ అంటారు''), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని '''''మాసిడోన్‌కు చెందిన అలెగ్జాండర్ III''''' అని, '''''అలెగ్జాండర్ ది గ్రేట్''''' (గ్రీకులో ''అలెగ్జాండ్రోస్ హో మెగాస్'') అనీ పిలుస్తారు. అతను సా.పూ 356 లో పెల్లాలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ II మరణం తరువాత, 20 ఏళ్ళ వయస్సులో గద్దె నెక్కాడు. తన పాలనాకాలంలో ఎక్కువ భాగం పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో మున్నెన్నడూ ఎరగని సైనిక దండయాత్ర లోనే గడిపాడు. ముప్పై సంవత్సరాల వయస్సు నాటికే, [[గ్రీస్]] నుండి వాయువ్య [[భారతదేశ చరిత్ర|భారతదేశం]] వరకు విస్తరించిన, పురాతన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు. <ref>Bloom, Jonathan M.; Blair, Sheila S. (2009) ''The Grove Encyclopedia of Islamic Art and Architecture: Mosul to Zirid, Volume 3''. (Oxford University Press Incorporated, 2009), 385; "[Khojand, Tajikistan]; As the easternmost outpost of the empire of Alexander the Great, the city was renamed Alexandria Eschate ("furthest Alexandria") in 329 BCE."</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> అతను యుద్ధంలో అజేయంగా నిలిచాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. {{Sfn|Yenne|2010|p=159}}
 
అలెగ్జాండర్‌ 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు [[అరిస్టాటిల్]] వద్ద విద్య అభ్యసించాడు. సా.పూ 336 లో ఫిలిప్ హత్య తరువాత, అతను సింహాసనం ఎక్కాడు. బలమైన రాజ్యాన్ని, అనుభవంగల సైన్యాన్నీ వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్‌కు గ్రీస్ సర్వసైన్యాధిపత్యం లభించింది. తన తండ్రి తలపెట్టి, మొదలుపెట్టలేక పోయిన పాన్-హెలెనిక్ ప్రాజెక్టును ప్రారంభించి, [[ఇరాన్|పర్షియాను]] ఆక్రమించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించాడు. <ref>{{Cite book|title=Alexander the Great: A New History|date=2009|publisher=Wiley-Blackwell|isbn=978-1-4051-3082-0|editor-last=Heckel|editor-first=Waldemar|page=99|chapter=The Corinthian League|editor-last2=Tritle|editor-first2=Lawrence A.}}</ref> <ref>{{Cite book|title=The Shaping of Western Civilization: From Antiquity to the Enlightenment|last=Burger|first=Michael|date=2008|publisher=University of Toronto Press|isbn=978-1-55111-432-3|page=76}}</ref> సా.పూ. 334 లో, అతను అకెమెనీడ్ సామ్రాజ్యం (పర్షియన్ సామ్రాజ్యం) పై దాడి చేశాడు. 10 సంవత్సరాల పాటు కొనసాగిన తన దండయాత్రలను మొదలుపెట్టాడు. అనటోలియా ఆక్రమణ తరువాత అలెగ్జాండర్, వరుసబెట్టి చేసిన నిర్ణయాత్మక యుద్ధాల్లో, ముఖ్యంగా ఇస్సస్, గ్వాగమేలా యుద్ధాల్లో పర్షియా నడుం విరగ్గొట్టాడు. తరువాత అతను పర్షియన్ రాజు డారియస్ III ను పడగొట్టి, అకెమెనీడ్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాడు. {{Cref2|b}} ఆ సమయంలో, అతని సామ్రాజ్యం అడ్రియాటిక్ సముద్రం నుండి [[బియాస్ నది]] వరకు విస్తరించింది.
పంక్తి 27:
[[దస్త్రం:Alejandro_Magno,_Alexander_The_Great_Bust_Alexander_BM_1857_(cropped).jpg|thumb|బ్రిటిష్ మ్యూజియం, హెలెనిస్టిక్ యుగం నుండి యువ అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క బస్ట్]]
[[దస్త్రం:Universal_manual_of_ready_reference_-_antiquities,_history,_geography,_biography,_government,_law,_politics,_industry,_invention,_science,_religion,_literature,_art,_education_and_miscellany_(1904)_(14590266027).jpg|thumb|''అలెగ్జాండర్ కు బోధిస్తున్న [[అరిస్టాటిల్]].'' జీన్ లియోన్ జెరోమ్ ఫెర్రిస్ చేత]]
అలెగ్జాండర్ మాసిడోన్ రాజ్య రాజధాని పెల్లాలో పురాతన గ్రీకు నెల హెకాటోంబాయిన్ లో ఆరవ రోజున జన్మించాడు. <ref>{{Citation}}</ref> ఈ తేదీ బహుశా సా.పూ. 356 జూలై 30 అవుతుంది. అయితే, ఖచ్చితమైనకచ్చితమైన తేదీ అనిశ్చితంగా ఉంది. <ref>Plutarch, ''Life of Alexander'' 3.5: {{వెబ్ మూలము|url=https://www.livius.org/aj-al/alexander/alexander_t32.html#7|title=The birth of Alexander the Great|work=Livius|accessdate=16 December 2011}}</ref> అతను మాసిడోన్ రాజు ఫిలిప్ II కు, అతని నాల్గవ భార్య ఒలింపియాస్ కు పుట్టాడు. ఒలింపియాస్, ఎపిరస్ రాజు నియోప్టోలెమస్ I కుమార్తె. <ref>{{harvnb|McCarty|2004|p=10}}, {{harvnb|Renault|2001|p=28}}, {{harvnb|Durant|1966|p=538}}</ref> ఫిలిప్‌కు ఏడెనిమిది మంది భార్యలు ఉన్నప్పటికీ, ఒలింపియాస్ కొంతకాలం అతనికి మహారాణిగా ఉండేది. బహుశా ఆమె అలెగ్జాండర్‌కు జన్మనిచ్చినందువలన కావచ్చు. {{Sfn|Roisman|Worthington|2010|p=171}}
 
అలెగ్జాండర్ పుట్టుక గురించీ బాల్యం గురించీ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. {{Sfn|Roisman|Worthington|2010|p=188}} పురాతన గ్రీకు జీవిత చరిత్ర రచయిత ప్లూటార్క్ ప్రకారం, ఫిలిప్‌తో వివాహ వేడుకలు ముగిసే ముందు రాత్రి ఒలింపియాస్ ఒక కల గంది. ఆ కలలో తన గర్భాన్ని ఒక పిడుగు ఛేదించగా, ఒక మంట వెలువడి చాలాదూరం వ్యాపించి చల్లారిపోయింది. పెళ్లిపెళ్ళి తర్వాత కొంతకాలానికి, సింహపు బొమ్మతో ఉన్న ముద్ర తన భార్య గర్భంపై ఉన్నట్లు ఫిలిప్ కలగన్నాడు. ప్లూటార్క్ ఈ కలల గురించి రకరకాల వ్యాఖ్యానాలను అందించాడు: ఒలింపియాస్ తన వివాహానికి ముందే గర్భవతి అని, ఆమె గర్భంపై ఉన్న ముద్ర ద్వారా సూచించబడింది; లేదా అలెగ్జాండర్ తండ్రి గ్రీకు దేవుడు జియస్ అయి ఉండవచ్చు. ఒలింపియాసే అలెగ్జాండర్ యొక్క దైవిక తల్లిదండ్రుల కథను ప్రచారం చేసిందా, ఆమె అలెగ్జాండర్‌తో చెప్పిందా వంటి విషయాలపై ప్రాచీన వ్యాఖ్యాతల్లో భిన్నభిప్రాయాలున్నాయి
 
అలెగ్జాండర్ జన్మించిన రోజున, ఫిలిప్ చాల్సిడైస్ ద్వీపకల్పంలోని పొటీడియా నగరంపై దాడికి సన్నద్ధమౌతున్నాడు. అదే రోజు, ఫిలిప్ తన సేనాధిపతి పార్మేనియన్, ఇల్లిరియన్ పేయోనియన్ ల సంయుక్త సైన్యాలను ఓడించాడనే వార్త అందుకున్నాడు. అతని గుర్రాలు ఒలింపిక్ క్రీడలలో గెలిచాయనే వార్త కూడా అదే రోజున అతడికి అందింది.ఇదే రోజున, ప్రపంచంలోని [[ఏడు పురాతన ప్రపంచ అద్భుతాలు|ఏడు అద్భుతాలలో]] ఒకటైన ఎఫెసస్ లోని ఆర్టెమిస్ ఆలయాన్ని తగలబెట్టారని కూడా చెబుతారు. ఆర్టెమిస్, అలెగ్జాండర్ పుట్టుకకు హాజరవడానికి వెళ్ళాడని, అందుకే అతడి ఆలయం కాలిపోయిందనీ మెగ్నీషియాకు చెందిన హెగెసియాస్ చెప్పాడు.. <ref>{{harvnb|Renault|2001|p=28}}, {{harvnb|Bose|2003|p=21}}</ref> అలెగ్జాండర్ రాజయ్యాక ఇటువంటి కథలు ఉద్భవించి ఉండవచ్చు. బహుశా అతని ప్రేరణతోనే ఈ కథలు ఉద్భవించి ఉండవచ్చు. అతను మానవాతీతుడనీ, పుట్టుక తోనే గొప్పవాడని చెప్పడం అయి ఉండవచ్చు. {{Sfn|Roisman|Worthington|2010|p=188}}
 
బాల్యంలో అలెగ్జాండర్‌ను లానికే ఆనే ఒక ఆయా పెంచింది. భవిష్యత్తులో అతడి దళపతి అయ్యే క్లైటస్ ది బ్లాక్ కు సోదరి ఆమె. తరువాత అతని బాల్యంలో, అలెగ్జాండర్‌ను అతని తల్లి బంధువు లియోనిడాస్, అకర్నానియాకు చెందిన లైసిమాకస్ లు చదువు చెప్పారు. {{Sfn|Renault|2001|pp=33–34}} అలెగ్జాండర్ గొప్ప మాసిడోనియన్ యువకుల పద్ధతిలో పెరిగాడు. చదవడం, లైర్ వాయిద్యాన్ని వాయించడం గుర్రపు స్వారీ, పోరాటం, వేటాడటం నేర్చుకున్నాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=186}}
[[దస్త్రం:Θεσσαλονίκη_2014_(The_Statue_of_Alexander_the_Great)_-_panoramio.jpg|ఎడమ|thumb|[[గ్రీస్|గ్రీస్‌లోని]] మాసిడోనియాలోని థెస్సలొనీకిలోనిథెస్సలోనీకిలోని అలెగ్జాండర్ ది గ్రేట్ విగ్రహం]]
అలెగ్జాండర్‌కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు, థెస్సాలీకి చెందిన ఒక వ్యాపారి ఫిలిప్‌ వద్దకు ఒక గుర్రాన్ని తీసుకువచ్చాడు, పదమూడు టాలెంట్లకు అమ్ముతానన్నాడు. గుర్రం ఎక్కబోతే, అది ఎదురు తిరిగింది, ఎక్కనివ్వలేదు. ఫిలిప్ అక్కర్లేదు తీసుకుపొమ్మన్నాడు. అయితే, ఆ గుర్రం దాని స్వంత నీడను చూసి భయపడుతోందని గమనించిన అలెగ్జాండర్, తాను ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకుంటానని అన్నాడు. చివరికి చేసుకున్నాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=188}} ప్లూటార్క్ దాని గురించి ఇలా అన్నాడు: ఫిలిప్, తన కొడుకు ప్రదర్శించిన ధైర్యాన్ని, పట్టుదలనూ చూసి ఆనందం పట్టలేకపోయాడు, నీళ్ళు నిండిన కళ్ళతో కొడుకును ముద్దాడి, "బాబూ, నీ ఆశయాలకు సరిపడేంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు స్థాపించాలి. నీ స్థాయికి మాసిడోన్ చాలా చిన్నది " అన్నాడు. అతని కోసం ఆ గుర్రాన్ని కొన్నాడు.
 
పంక్తి 60:
ఫిలిప్ దక్షిణ దిశగా వెళుతుండగా, అతని ప్రత్యర్థులు బోయోటియాలోని చైరోనియా సమీపంలో అతనిని అడ్డుకున్నారు. అప్పుడు జరిగిన చైరోనియా యుద్ధంలో, ఫిలిప్ కుడి పార్శ్వం లోను, అలెగ్జాండర్ కొందరు సేనాధిపతులతో కలిసి ఎడమ పార్శ్వం లోనూ శత్రువుతో తలపడ్డారు. ప్రాచీన వర్గాల సమాచారం ప్రకారం, ఇరువర్గాలు కొంతసేపు తీవ్రంగా పోరాడాయి. ఫిలిప్ ఉద్దేశపూర్వకంగా తన సైనికులను వెనక్కి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఎథీనియన్ హాప్లైట్లు వాళ్ళను వెంబడిస్తారని అతడు ఆశించాడు. అలాగే జరిగింది. ఆ విధంగా అతడు శత్రు పంక్తిని విచ్ఛిన్నం చేశాడు. థేబన్ పంక్తులను మొదట విచ్ఛిన్నం చేసింది అలెగ్జాండర్, ఆ తరువాత సేనాధిపతులు. శత్రువుల కలసికట్టును దెబ్బతీసిన ఫిలిప్ తన దళాలను ముందుకు దూకించి, శత్రు సైన్యాన్ని నాశనం చేసాడు. ఎథీనియన్లు ఓడిపోవడంతో, థేబన్లను చుట్టుముట్టారు. ఒంటరిగా పోరాడాల్సి వచ్చేసరికి, వారూ ఓడిపోయారు.
 
చైరోనియాలో విజయం తరువాత, ఫిలిప్, అలెగ్జాండర్ లు ఏ ప్రతిఘటన లేకుండా పెలోపొన్నీస్ లోకి ప్రవేశించారు. నగరాలన్నీ వారిని స్వాగతించాయి; అయితే, వారు స్పార్టాకు చేరుకున్నప్పుడు, వారికి వ్యతిరేకత ఎదురైంది, కాని వారితో యుద్ధం చెయ్యలేదు. <ref>{{వెబ్ మూలము|url=http://www.sikyon.com/sparta/history_eg.html|title=History of Ancient Sparta|work=Sikyon|accessdate=14 November 2009}}</ref> కొరింథ్‌లో, ఫిలిప్ "హెలెనిక్ అలయన్స్" ను స్థాపించాడు, ఇందులో స్పార్టా మినహా చాలా గ్రీకు నగర-రాజ్యాలు ఉన్నాయి. ఫిలిప్ ఈ లీగ్ యొక్క ''హెజెమోన్'' ("సర్వ సైన్యాధ్యక్షుడు" అని అనువాదం) అయ్యాడు. (ఆధునిక పండితులు దీన్ని లీగ్ ఆఫ్ కోరింత్ అని పిలుస్తారు.) పర్షియన్ సామ్రాజ్యంపై దాడి చేసే తన ప్రణాళికలను ప్రకటించాడు. {{Sfn|Renault|2001|p=54}} {{Sfn|McCarty|2004|p=26}}
 
=== ప్రవాసం, తిరిగి రాక ===
ఫిలిప్ పెల్లాకు తిరిగి వచ్చాక, అతను క్లియోపాత్రా యూరిడైస్‌ ప్రేమలో పడి సా.పూ. 338 లో ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, <ref>{{Cite journal|last=Green|first=Peter|date=1991|title=Alexander to Actium: The Historical Evolution of the Hellenistic Age (Hellenistic Culture and Society)|journal=The American Historical Review|location=Berkeley & Los Angeles|publisher=University of California Press|volume=1|pages=|doi=10.1086/ahr/96.5.1515|issn=1937-5239}}</ref> ఆమె అతని సేనాధిపతి అటాలస్‌కు మేనకోడలు. {{Sfn|Roisman|Worthington|2010|p=179}} ఈ పెళ్ళితో, అలెగ్జాండర్‌కు తాను వారసుడౌతాననే విషయంలో కొంత అభద్రతా భావం ఏర్పడింది. ఎందుకంటే క్లియోపాత్రా యూరిడైస్‌కు కుమారుడు పుడితే, అతడు సంపూర్ణ మాసిడోనియన్ వారసుడౌతాడు, అలెగ్జాండర్ సగం మాసిడోనియన్ మాత్రమే. {{Sfn|McCarty|2004|p=27}} పైగా, వివాహ విందులో, తాగిన మత్తులో అటాలస్, ఈ పెళ్ళితో చట్టబద్ధమైన వారసుడు పుట్టేలా చెయ్యమని బహిరంగంగానే దేవతలను ప్రార్థించాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=179}}
 
337 సా.పూ లోపూలో అలెగ్జాండర్, తన తల్లితో కలిసి మాసిడోన్‌ను వదలిపెట్టి పారిపోయాడు. ఆమెను డొడోనా లోడొడోనాలో ఆమె సోదరుడు ఎపిరస్‌కు చెందిన అలెగ్జాండర్ I వద్ద వదలి, {{Sfn|Roisman|Worthington|2010|p=180}} తాను ఇల్లైరియాకు వెళ్ళాడు {{Sfn|Roisman|Worthington|2010|p=180}} అక్కడ అతను బహుశా గ్లాకియాస్‌ వద్ద ఆశ్రయం పొంది ఉండవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ వారిని ఓడించినప్పటికీ, వారు అతన్ని అతిథిగా పరిగణించారు. <ref>A History of Macedonia: Volume III: 336–167 B.C. By N. G. L. Hammond, F. W. Walbank</ref> అయితే, ఫిలిప్ రాజకీయ, సైనిక శిక్షణ పొందిన తన కొడుకును నిరాకరించాలని ఎప్పుడూ అనుకోలేదు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} దాంతో, వారి కుటుంబ స్నేహితుడు డెమారటస్ మధ్యవర్తిత్వ ప్రయత్నాల కారణంగా అలెగ్జాండర్ ఆరు నెలల తరువాత మాసిడోన్‌కు తిరిగి వచ్చాడు. <ref>{{harvnb|Bose|2003|p=75}}, {{harvnb|Renault|2001|p=56}}</ref>
 
తరువాతి సంవత్సరంలో, కారియా లోని పర్షియన్ సామంతుడు, పిక్సోడారస్, తన పెద్ద కుమార్తెను అలెగ్జాండర్ యొక్క సవతి సోదరుడు ఫిలిప్ అర్హిడియస్‌కు ఇచ్చాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} అర్హిడియస్‌ను తన వారసునిగా చేసుకోవటానికి ఫిలిప్ ఉద్దేశించినట్లు ఉన్నాడని ఒలింపియాస్, అలెగ్జాండర్ స్నేహితులు చాలా మంది అన్నారు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} తన కుమార్తెను చట్టవిరుద్ధమైన కొడుకుకు ఇవ్వకూడదనీ, అలెగ్జాండర్‌కు ఇవ్వమనీ పిక్సోడారస్‌కు చెప్పడానికి అలెగ్జాండర్, కోరింథ్‌కు చెందిన థెస్సాలస్ అనే నటుడిని పంపించాడు. ఈ విషయం విన్న ఫిలిప్, చర్చలను ఆపించాడు. కారియన్ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్నందుకు అలెగ్జాండర్‌ను తిట్టాడు. అతనికి మరింత మంచి వధువును తేవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} ఫిలిప్ అలెగ్జాండర్ స్నేహితులు, నలుగురిని - హర్పాలస్, నియార్కస్, టోలెమీ, ఎరిజీయస్ - లను దేశం నుండి బహిష్కరించాడు. కోరింథీయుల చేత థెస్సాలస్‌ను గొలుసులతో బంధించి తెప్పించాడు. <ref>{{harvnb|McCarty|2004|p=27}}, {{harvnb|Renault|2001|p=59}}, {{harvnb|Lane Fox|1980|p=71}}</ref>
పంక్తి 73:
=== అధిరోహణం ===
[[దస్త్రం:Map_Macedonia_336_BC-en.svg|thumb|336 లో మాసిడోన్ రాజ్యం &nbsp; సా.పూ.]]
[[దస్త్రం:Deer_hunt_mosaic_from_Pella.jpg|thumb|స్టాగ్ హంట్ మొజాయిక్ యొక్క చిహ్నం, {{circa|300&nbsp;BC}} , పెల్లా నుండి; కుడి వైపున ఉన్న బొమ్మ బహుశా అలెగ్జాండర్ అయి ఉండవచ్చు. మొజాయిక్ తేదీని బట్టి, మధ్య పాపిడి తీసి పైకి దువ్విన జుట్టును బట్టీ చెప్పవచ్చు; చిత్రంలో రెండు అంచుల గొడ్డలి పట్టుకుని ఉన్న వ్యక్తి హెఫెస్టియోన్ అలెగ్జాండర్ యొక్క నమ్మకమైన సహచరుడు అయి ఉండవచ్చు ఒకటి. <ref name="bare_url_a">{{Cite book|url=https://books.google.com/books?id=S-cTfNjEhrcC&pg=PA78|title=Alexander's Lovers|last=Chugg|first=Andrew|year=2006|isbn=9781411699601|page=78–79}}</ref>]]
సా.పూ 326 వేసవిలో ఫిలిప్‌, ఒలింపియాస్ సోదరుడైన ఎపిరస్‌కు చెందిన అలెగ్జాండర్ I తో తన కుమార్తె క్లియోపాత్రా వివాహం జరిపిస్తూండగా, అతని అంగరక్షకుల నాయకుడు కెప్టెన్ పౌసానియాస్ ఫిలిప్‌ను హత్య చేశాడు. {{Cref2|e}} పౌసానియాస్ తప్పించుకోవడానికి ప్రయత్నించగా వెంబడించినవారు అతణ్ణి పట్టుకుని చంపారు. వీరిలో అలెగ్జాండర్ సహచరులు ఇద్దరు - పెర్డిక్కాస్, లియోనాటస్ లు కూడా ఉన్నారు. అలెగ్జాండర్‌ను 20 సంవత్సరాల వయస్సులో ప్రభువులు, సైన్యమూ అక్కడికక్కడే రాజుగా ప్రకటించారు. {{Sfn|McCarty|2004|pp=30–31}} <ref>{{harvnb|Renault|2001|pp=61–62}}</ref> <ref name="Fox 1980 72">{{harvnb|Lane Fox|1980|p=72}}</ref>
 
పంక్తి 103:
ఫిలిప్ II తలపెట్టిన ఆక్రమణ ప్రాజెక్టును అలెగ్జాండర్ చేపట్టాడు. మాసెడోన్ నుండి, వివిధ గ్రీకు నగర-రాజ్యాల సైన్యాన్ని, కిరాయి సైనికులను, థ్రేస్, పైనోయియా, ఇల్లైరియాల లోని ఫ్యూడల్ సైన్యాన్నీ సమీకరించాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 11}}</ref> {{Cref2|f}} సుమారు 48,100 సైనికులతో, 6,100 అశ్వికదళంతో, 38,000 మంది నావిక సైన్యంతో 120 ఓడలతో {{Sfn|Roisman|Worthington|2010|p=192}} కూడుకున్న అలెగ్జాండర్ సైన్యం సా.పూ 334 లో హెలెస్పాంట్ దాటింది. ఆసియా మట్టిలోకి ఈటెను విసిరి, ఆసియాను దేవతల బహుమతిగా అంగీకరించానని అలెగ్జాండర్ చెప్పాడు. అలా చెప్పడం ద్వారా పర్షియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాలనే తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. దౌత్యానికి తన తండ్రి ఇచ్చిన ప్రాధాన్యతకు విరుద్ధంగా, అలెగ్జాండర్, పోరాడటానికే ఉత్సుకత చూపించాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=192}}
 
గ్రానికస్ యుద్ధంలో పర్షియన్ దళాలపై సాధించిన తొలి విజయం తరువాత, అలెగ్జాండర్ పర్షియన్ ప్రాదేశిక రాజధాని, సర్దిస్ ఖజానా లొంగిపోవడాన్ని అంగీకరించాడు; తరువాత అతను అయోనియన్ తీరం వెంబడి ఉన్న నగరాలకు స్వయంప్రతిపత్తిని, ప్రజాస్వామ్యాన్నీ మంజూరు చేశాడు. అకెమినీడ్ దళాల స్వాధీనంలో ఉన్న మిలేటస్‌కు సమీపంలో పర్షియన్ నావికా దళాలు ఉండడంతో, కడు జాగ్రత్తగా దాని ముట్టడిని పూర్తిచేసాడు. మరింత దక్షిణంలో, కార్నియా లోని హాలికార్నస్సస్‌ వద్ద అలెగ్జాండర్ తన మొదటి భారీ ముట్టడిని చేపట్టాడు. ప్రత్యర్థులైన కిరాయి సైనిక నాయకుడు రోడెస్ కు చెందిన మెమ్నోన్, కారియాలోని పర్షియన్ సామంత రాజు ఒరోంటోబాటెస్ లు అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయి, ఓడల్లో పారిపోయారు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 20–23}}</ref> కారియా ప్రభుత్వాన్ని హెకాటోమ్నిడ్ రాజవంశస్థుడు అడాకు అప్పగించాడు. అతను అలెగ్జాండర్‌ కుఅలెగ్జాండర్‌కు సామంతుడయ్యాడు. <ref name="Arrian 1976 loc=I, 23">{{harvnb|Arrian|1976|loc=I, 23}}</ref>
 
హాలికర్నాసస్ నుండి, అలెగ్జాండర్ పర్వత ప్రాంతమైన లైసియా లోకి, పాంఫిలియన్ మైదానంలోకీ వెళ్ళాడు. అన్ని తీర నగరాలను స్వాధీనపరచుకున్నాడు. దీంతో పర్షియన్లకు నావికా స్థావరాలు లేకుండా పోయాయి. పాంఫిలియా తరువాత ఇక పెద్ద ఓడరేవులేమీ లేవు. దాంతో అలెగ్జాండర్ ఇక లోతట్టు ప్రాంతం వైపు తిరిగాడు. టెర్మెస్సోస్ వద్ద, అలెగ్జాండర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాని ఆ నగరాన్ని ముట్టడించలేదు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 27–28}}</ref> పురాతన ఫ్రిజియన్ రాజధాని గోర్డియన్ వద్ద, అప్పటివరకు విప్పలేని గోర్డియన్ ముడిని "విప్పేసాడు". ఈ ఘనత సాధించగలిగేది, భవిష్యత్ " ఆసియా రాజు" మాత్రమే ననే ప్రతీతి ఉండేది. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 3}}</ref> ఆ ముడి విప్పిన కథనం ఒకటి ఇలా ఉంది: ముడిని ఎలా విప్పదీసామనేది పట్టించుకోవాల్సిన సంగతి కాదని చెబుతూ అలెగ్జాండర్, కత్తితో దాన్ని నరికేసాడు. <ref>{{harvnb|Green|2007|p=351}}</ref>
పంక్తి 111:
 
=== ఈజిప్ట్ ===
[[దస్త్రం:Name_of_Alexander_the_Great_in_Hieroglyphs_circa_330_BCE.jpg|thumb|ఈజిప్టు చిత్రలిపిలో అలెగ్జాండర్ ది గ్రేట్ పేరు (కుడి నుండి ఎడమకు వ్రాయబడింది), {{circa|332&nbsp;BC}} , ఈజిప్ట్. [[లౌవ్రే మ్యూజియం]]]]
అలెగ్జాండర్ టైర్‌ను నాశనం చేసినప్పుడు, [[ఈజిప్టు|ఈజిప్ట్]] దారిలో ఉన్న చాలా పట్టణాలు త్వరత్వరగా లొంగిపోయాయి. అయితే, గాజాలో అతడు గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఈ దుర్గాన్ని భారీ గోడలతో గుట్టపై కట్టారు. దాన్ని గెలవాలంటే ముట్టడి అవసరం. "ఎత్తాటి దిబ్బ కారణంగా అది అసాధ్యమని అతని ఇంజనీర్లు ఎత్తి చూపినప్పుడు ...అది అలెగ్జాండర్‌ను మరింతగా ప్రోత్సహించింది". <ref>{{harvnb|Arrian|1976|loc=II, 26}}</ref> మూడు విఫల ప్రయత్నాల తరువాత, కోట అలెగ్జాండరు వశమైంది, కాని అలెగ్జాండర్‌కు భుజంపై తీవ్రమైన గాయమైంది. టైర్‌లో లాగానే, సైనిక వయస్సు గల పురుషులను కత్తికి బలిపెట్టారు. స్త్రీలు, పిల్లలను బానిసలుగా అమ్మేసారు. <ref>{{harvnb|Arrian|1976|loc=II, 26–27}}</ref>
 
పంక్తి 137:
ఈ సమయంలో, అలెగ్జాండర్ తన ఆస్థానంలో పర్షియన్ దుస్తులను ధరించడం, కొన్ని పర్షియన్ ఆచారాలను అవలంబించడమూ చేసాడు. ముఖ్యంగా ''ప్రోస్కైనెసిస్'' ఆచారం - చేతిని ముద్దాడడం, లేదా నేలపై సాష్టాంగపడటం. పర్షియన్లు సాంఘికంగా ఉన్నత హోదాల్లో ఉండేవారి పట్ల ఈ మర్యాదలు చూపించేవారు. గ్రీకులు ఈ ఆచారాన్ని దేవతల పట్ల మాత్రమే పాటిస్తారు. అది తనకూ చెయ్యమంటున్నాడంటే అలెగ్జాండర్ తనను తాను దైవంగా భావిస్తున్నాడని వారు అనుకున్నారు. ప్రజలకు అది నచ్చలేదు. దీంతో అతడు దేశప్రజల్లో సానుభూతి కోల్పోయాడు. చివరికి అతడు ఆ ఆచారాలను విడిచిపెట్టాడు. {{Sfn|Morkot|1996|p=111}}
 
అతణ్ణి చంపేందుకు చేసిన కుట్ర ఒకటి బయట పడింది. ఆ విషయమై అలెగ్జాండర్‌ను అప్రమత్తం చేయడంలో విఫలమైనందుకు అతని అధికారులలో ఒకరైన ఫిలోటస్‌ను చంపేసారు. కొడుకు చంపడం అనేది, తండ్రిని కూడా చంపడానికి దారితీసింది. కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేస్తాడేమోనని భావించి, దాన్ని నివారించడానికి, ఎక్బాటానా వద్ద ఖజానాకు కాపలాగా ఉన్నతండ్రి పార్మేనియన్‌ను కూడా అలెగ్జాండర్ హత్య చేయించాడు. గ్రానికస్ వద్ద తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి, క్లెయిటస్ ది బ్లాక్‌ను మరాకాండా ( [[ఉజ్బెకిస్తాన్|ఉజ్బెకిస్తాన్‌లో]] ఆధునిక సమర్కాండ్) వద్ద చంపేసాడు. అలెగ్జాండర్ అపఖ్యాతి పాలైన ఘటనల్లో ఇదొకటి. తాగుడు మైకంలో జరిగిన వాగ్వాదంలో అలెగ్జాండర్‌ అనేక తప్పిదాలకు పాల్పడ్డాడనీ, ముఖ్యంగా మాసిడోనియన్ పద్దతులనుపద్ధతులను పక్కనబెట్టి, అవినీతిమయమైన ప్రాచ్య జీవనశైలికి అలవాటు పడ్డాడనీ క్లెయిటస్ అనడంతో అలెగ్జాండర్ అతణ్ణి చంపేసాడు. {{Sfn|Gergel|2004|p=99}}
 
తర్వాత, మధ్య ఆసియా దండయాత్రలో అతడిపై జరిగిన మరో కుట్ర బయట పడింది. ఇది అతడి స్వంత పరిచారకులే చేసారు. అతని అధికారిక చరిత్రకారుడు, ఒలింథస్కు చెందిన కాలిస్థెనీస్ ఈ కుట్రలో పాత్రధారి. కాలిస్టెనెస్‌ను ఇతర సేవకులనూ రాక్ మీద ఎక్కించి హింసించారని, వాళ్ళు వెంటనే మరణించి ఉండవచ్చనీ ''అనాబాసిస్ ఆఫ్ అలెగ్జాండర్‌ పుస్తకంలో'' అరియన్ రాసాడు. <ref>[https://archive.org/stream/cu31924026460752/cu31924026460752_djvu.txt The Anabasis of Arrian]</ref> వాస్తవానికి కాలిస్టెనెస్ ఈ కుట్రలో పాల్గొన్నాడా అనేది అస్పష్టంగానే ఉంది. అతనిపై ఈ ఆరోపణలు రాకముందే, ప్రోస్కైనిసిస్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని వ్యతిరేకించడంతో అతడు అలెగ్జాండరు అనుగ్రహాన్ని కోల్పోయాడు. <ref>{{harvnb|Heckel|Tritle|2009|pp=47–48}}</ref>
పంక్తి 151:
[[దస్త్రం:The_phalanx_attacking_the_centre_in_the_battle_of_the_Hydaspes_by_Andre_Castaigne_(1898-1899).jpg|thumb|ఆండ్రే కాస్టెయిన్ (1898-1899) రచించిన ''ది ఫలాంక్స్ అటాకింగ్ ది సెంటర్ ఇన్ ది బాటిల్ ఆఫ్ ది హైడాస్పెస్''.]]
[[దస్త్రం:AlexanderConquestsInIndia.jpg|thumb|భారత ఉపఖండంలో అలెగ్జాండర్ దాడి.]]
కొత్త సామంత రాజులతో సత్సంబంధాల పెంపు కోసం అతడు రోక్సానాను పెళ్ళి చేసుకున్నాడు. స్పిటామెనెస్ మరణం, ఈ వివాహం తరువాత, అలెగ్జాండర్ చూపు [[భారత ఉపఖండము|భారత ఉపఖండం]] వైపు తిరిగింది. పూర్వపు సామంతుడు గాంధార రాజును (ప్రస్తుత పాకిస్తాన్‌కు ఉత్తరాన, ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల వద్ద ఉన్న ప్రాంతం), లొంగిపొమ్మని చెబుతూ తనవద్దకు పిలిచాడు. [[తక్షశిల]] పాలకుడైన ఓంఫిస్ (భారత పేరు అంభి) (ఇతడి రాజ్యం [[సింధూ నది|ఇండస్]] వరకు [[ఝేలం నది|హైడాస్పెస్ (జీలం)]] వరకు విస్తరించింది) అంగీకరించి, అలెగ్జాండరును దర్శించుకున్నాడు. కానీ కొన్ని కొండ జాతుల నాయకులు, ఆస్పసియోయి, అస్సకేనోయి, [[కాంభోజులు|కాంభోజుల]]<nowiki/>లోని కొందరు (భారతీయ గ్రంధాలలోగ్రంథాలలో అశ్వాయనులు అని అశ్వకాయనులు అనీ అంటారు), లొంగిపోడానికి నిరాకరించారు. {{Sfn|Tripathi|1999|pp=118–21}} అలెగ్జాండరుకు ఉన్న ఆందోళనలను తొలగించేందుకు అంబి హడావుడిగా, విలువైన బహుమతులతో అతన్ని కలుసుకున్నాడు. తనను తన సైన్యమంతటినీ అలెగ్జాండరు ముందు ఉంచాడు. అలెగ్జాండర్ అంబికి అతడి బిరుదును బహుమతులనూ తిరిగి ఇవ్వడమే కాకుండా, "పర్షియన్ వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, 30 గుర్రాలు 1,000 టాలెంట్ల బంగారమూ" ఉన్న వార్డ్రోబ్‌ను కూడా అతనికి బహుకరించాడు. అలెగ్జాండర్ ధైర్యం చేసి తన దళాలను విభజించాడు. హుండ్ వద్ద సింధు నది వంపు తిరిగే చోట వంతెన నిర్మించడానికి హెఓఫేస్టియోన్, పెర్డికాస్ లకు అంభి సాయం చేసాడు. <ref>Lane Fox 1973</ref> వారి దళాలకు ఆహార సరఫరాలు చేసాడు. తన రాజధాని తక్షశిలలోకి అలెగ్జాండరును అతడి సైన్యాన్నీ తానే స్వయంగా స్వాగతించాడు. మైత్రినీ, గొప్ప ఆత్మీయ ఆతిధ్యాన్నీ ప్రదర్శించాడు.
 
అక్కడి నుండి మాసిడోనియా రాజు దండయాత్రలో తక్షశిల 5,000 సైన్యంతో అతడి వెంట నడిచింది. హైడాస్పెస్ నది వద్ద జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. ఆ విజయం తరువాత అలెగ్జాండర్, అంభిని [[పోరస్]] (పురుషోత్తముడు) ను వెంబడించేందుకు పంపించాడు. అయితే అంభి తన పాత శత్రువైన పురుషోత్తముడి చేతిలో చావును కొద్దిలో తప్పించుకున్నాడు. అయితే, ఆ తరువాత, అలెగ్జాండర్ వ్యక్తిగతంగా మధ్యవర్తిత్వం చేసి, ప్రత్యర్ధులిద్దరికీప్రత్యర్థులిద్దరికీ రాజీ కుదిర్చాడు.
 
సా.పూ 327/326 శీతాకాలంలో, అలెగ్జాండర్ కూనార్ లోయ లోని అస్పాసియోయిల పైన, గూరియస్ లోయ లోని గూరియన్ల పైనా, స్వాత్, బూనర్ లోయల్లోని అస్సాకెనోయిల పైనా స్వయంగా దాడి చేసాడు. <ref>{{harvnb|Narain|1965|pp=155–65}}</ref> అస్పాసియోయితో తీవ్రమైన యుద్ధం జరిగింది. అలెగ్జాండర్ భుజంలో బాణం గుచ్చుకుని గాయపడ్డాడు. కాని చివరికి అస్పాసియోయిలు ఓడిపోయారు. ఆ తరువాత అలెగ్జాండర్ అస్సాకెనోయిని ఎదుర్కొన్నాడు. బలమైన మసాగా, ఓరా, ఆర్నోస్ కోటల నుండి అస్సాకెనోయిలు అతనితో యుద్ధం చేసారు. {{Sfn|Tripathi|1999|pp=118–21}}
పంక్తి 163:
=== సైన్యం తిరుగుబాటు ===
[[దస్త్రం:Asia_323bc.jpg|thumb|323 లో ఆసియా అలెగ్జాండర్ సామ్రాజ్యం. పొరుగువారికి సంబంధించి [[నంద వంశం|నంద సామ్రాజ్యం]], [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలోని]] గంగారిడై.]]
పోరస్ రాజ్యానికి తూర్పున, [[గంగా నది|గంగా నదికి]] సమీపంలో, [[మగధ సామ్రాజ్యము|మగధ]] [[నంద వంశం|నందా సామ్రాజ్యం]], ఇంకా తూర్పున, [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలోని]] [[బెంగాల్]] ప్రాంతంలోని గంగారిడై సామ్రాజ్యం ఉండేవి. పెద్ద సైన్యాలను ఎదుర్కొనే అవకాశముందనే భయంతో, సంవత్సరాల తరబడి చేస్తున్న దండయాత్రలతో అలసిపోయిన అలెగ్జాండర్ సైన్యం [[బియాస్ నది|హైఫాసిస్ నది (బియాస్)]] వద్ద తిరుగుబాటు చేసి, తూర్పు వైపుకు నడవటానికి నిరాకరించింది. {{Sfn|Kosmin|2014|p=34}} ఈ నదే అలెగ్జాండర్ విజయాలకు తూర్పు హద్దు. {{Sfn|Tripathi|1999|pp=129–30}}{{quote|మాసెడోనియన్లకు సంబంధించినంత వరకు, పోరస్‌తో వారు చేసిన యుద్ధం వారి శౌర్యాన్ని కుంగదీసింది. భారతదేశంలో మరింత ముందుకు పోనీకుండా అడ్డుపడింది. కేవలం 20 వేల మంది కాల్బలం, రెండు వేల గుర్రాలతో ఉన్న సైన్యాన్ని లొంగదీసుకోడానికే ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఇప్పుడు గంగను దాటి ముందుకు పోదామని అంటున్న అలెగ్జాండరును వాళ్ళు గట్టిగా ఎదిరించారు. గంగ వెడల్పు 32 ఫర్లాంగు లుంటుందని విన్నారు. లోతు వంద ఫాతమ్‌ లుంటుందని, అవతలి ఒడ్డున గుర్రాలు, ఏనుగులపై నున్న సైనికులతో నిండిపోయి ఉంటుందనీ విన్నారు. గాండెరైటెస్, ప్రయేసీ రాజులు తమ కోసం 80 వేల ఆశ్వికులతో, 2 లక్షల కాల్బలంతో, 8 వేల రథాలతో, 6 వేల యుద్ధపు టేనుగులతో ఎదురుచూస్తున్నారనీ విని ఉన్నారు..<ref name="PA62" />}}అలెగ్జాండర్ తన సైనికులను మరింత ముందుకు వెళ్ళడానికి ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని అతని సేనాధిపతి కోనస్, తన అభిప్రాయాన్ని మార్చుకుని వెనక్కి తిరగాలని అలెగ్జాండరును వేడుకున్నాడు. సైనికులు, "వారి తల్లిదండ్రులను, భార్యా పిల్లలను, మాతృభూమినీ మళ్ళీ చూడాలని ఎంతో ఆశపడుతున్నారు" అని అతను చెప్పాడు. అలెగ్జాండర్ చివరికి అంగీకరించి దక్షిణం వైపు తిరిగాడు, [[సింధూ నది|సింధు]] వెంట వెళ్ళాడు. దారిలో అతని సైన్యం మల్హీ నిమల్హీని (ఆధునిక ముల్తాన్‌లో ఉంది), ఇతర భారతీయ తెగలను జయించింది. ముట్టడి సమయంలో అలెగ్జాండర్ గాయపడ్డాడు. {{Sfn|Tripathi|1999|pp=137–38}}
 
అలెగ్జాండర్ తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని దళపతి క్రెటెరస్ వెంట కార్మానియా (ఆధునిక దక్షిణ [[ఇరాన్]]) కు పంపాడు. పర్షియన్ గల్ఫ్ తీరాన్ని అన్వేషించడానికి తన అడ్మిరల్ నెర్కస్ క్రింద ఒక నౌకాదళాన్ని నియమించాడు. మిగిలిన వారిని గెడ్రోసియన్ ఎడారి, మక్రాన్‌ల గుండా మరింత కష్టతరమైన దక్షిణ మార్గం ద్వారా పర్షియాకు తిరిగి నడిపించాడు. {{Sfn|Tripathi|1999|p=141}} అలెగ్జాండర్ సా.పూ 324 లో సూసా చేరుకున్నాడు. కానీ ఈ లోగానే కఠినమైన ఎడారికి చాలామంది సైనికులు బలయ్యారు. <ref>{{harvnb|Morkot|1996|p=9}}</ref>
పంక్తి 183:
విష ప్రయోగ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బలమైన వాదన ఏమిటంటే, అతని అనారోగ్యం మొదలవడానికి మరణానికీ మధ్య పన్నెండు రోజులు గడిచాయి; అంత దీర్ఘకాలం పాటు పనిచేసే విషాలు బహుశా అందుబాటులో ఉండి ఉండకపోవచ్చు. {{Sfn|Lane Fox|2006|loc=chapter 32}} అయితే, అలెగ్జాండర్ మరణంపై దర్యాప్తు చేసిన 2003 బిబిసి డాక్యుమెంటరీలో, న్యూజిలాండ్ నేషనల్ పాయిజన్స్ సెంటర్‌కు చెందిన లియో షెప్, ఆ కాలం నాటికే తెలిసిన వైట్ హెలెబోర్ (''వెరాట్రమ్ ఆల్బమ్'') మొక్కను అలెగ్జాండర్‌పై విషప్రయోగానికి ఉపయోగించి ఉండవచ్చని ప్రతిపాదించారు. <ref>{{Cite news|url=http://www.royalsociety.org.nz/2003/10/16/alexander/|title=NZ scientist's detective work may reveal how Alexander died|date=16 October 2003|work=The Royal Society of New Zealand|access-date=15 January 2014|url-status=dead|archive-url=https://web.archive.org/web/20140116141707/http://www.royalsociety.org.nz/2003/10/16/alexander/|archive-date=16 January 2014|location=Dunedin}}</ref> {{Sfn|Cawthorne|2004|p=138}} <ref>{{Cite journal|last=Bursztajn|first=Harold J|year=2005|title=Dead Men Talking|url=http://www.forensic-psych.com/articles/artDeadMenTalking.php|journal=Harvard Medical Alumni Bulletin|issue=Spring|access-date=16 December 2011}}</ref> ''క్లినికల్ టాక్సికాలజీ'' జర్నల్‌లో 2014 మాన్యుస్క్రిప్ట్‌లో, అలెగ్జాండర్ తాగిన ద్రాక్ష సారాయిలో ''వెరాట్రమ్ ఆల్బమ్‌''ను కలిపారనీ, ''అలెగ్జాండర్ రొమాన్స్‌లో'' వివరించిన సంఘటనల క్రమానికి సరిపోయే విష లక్షణాలను ఇది కలిగిస్తుందనీ షెప్ సూచించాడు. <ref name="schep">{{Cite journal|vauthors=Schep LJ, Slaughter RJ, Vale JA, Wheatley P|date=January 2014|title=Was the death of Alexander the Great due to poisoning? Was it Veratrum album?|journal=[[Clinical Toxicology]]|volume=52|issue=1|pages=72–77|doi=10.3109/15563650.2013.870341|pmid=24369045|doi-access=free}}</ref> ''వెరాట్రమ్ ఆల్బమ్'' విషప్రయోగం సుదీర్ఘంగా సాగుతుంది. అలెగ్జాండర్‌పై విషప్రయోగమే గనక జరిగి ఉంటే, ఆ విషం ''వెరాట్రమ్ ఆల్బమ్'' అయి ఉంటుందని చెప్పేందుకు చాలా ఆమోదయోగ్యమైన హేతువు ఉంది. <ref name="schep" /> <ref>{{Cite news|url=http://www.huffingtonpost.com/2014/01/13/alexander-the-great-poisoned-toxic-wine_n_4591553.html|title=Was Alexander The Great Poisoned By Toxic Wine?|last=Bennett-Smith|first=Meredith|date=14 January 2014|work=The Huffington Post|access-date=15 January 2014|location=}}</ref> 2010 లో ముందుకు వచ్చిన మరో విష వివరణ, ప్రమాదకరమైన సమ్మేళనం కాలిచెమిసిన్ కలిగి ఉన్న స్టైక్స్ నది (గ్రీస్‌లోని ఆర్కాడియాలోని ఉన్న మావ్రోనేరి నది) నీటితో విషప్రయోగం జైరిగి అతడు మరణించి ఉండవచ్చు. ఈ కాలిచెమిసిన్‌ను బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. <ref>{{Cite news|url=https://www.telegraph.co.uk/news/worldnews/europe/greece/7924855/Alexander-the-Great-poisoned-by-the-River-Styx.html|title=Alexander the Great poisoned by the River Styx|last=Squires|first=Nick|date=4 August 2010|work=The Daily Telegraph|access-date=12 December 2011|location=London}}</ref>
 
[[మలేరియా]], [[టైఫాయిడ్|టైఫాయిడ్ జ్వరాలతో]] సహా అనేక సహజ కారణాలను (వ్యాధులు) కూడా సూచించారు. ''న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'' లో 1998 లో వచ్చిన ఒక వ్యాసంలో, టైఫాయిడ్ జ్వరం ఉండి, పైగా ప్రేగు చిల్లులు పడడం, [[పక్షవాతం]] వలన అది మరింత సంక్లిష్టంగా మారడం వలన అలెగ్జాండర్‌ మరణించాడని పేర్కొంది. మరో విశ్లేషణలో పయోజెనిక్ (ఇన్ఫెక్షియస్) [[స్పాండిలైటిస్]] లేదా [[మెదడు వాపు|మెనింజైటిస్]] లు కారణాలుగా సూచించారు. లక్షణాలకు సరిపోయే ఇతర జబ్బులు తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్, వెస్ట్ నైల్ వైరస్. <ref>{{Cite journal|last=Sbarounis|first=CN|year=2007|title=Did Alexander the Great die of acute pancreatitis?|journal=J Clin Gastroenterol|volume=24|issue=4|pages=294–96|doi=10.1097/00004836-199706000-00031|pmid=9252868}}</ref> చాలా సంవత్సరాల పాటు అధికంగా మద్యపానం చెయ్యడంతో ఆరోగ్యం క్షీణించడం వలన, తీవ్రమైన గాయాల వలనా సహజ మరణం ప్రాప్తించి ఉండవచ్చు. హెఫెస్టియన్ మరణం తరువాత అలెగ్జాండర్ అనుభవించిన వేదన కూడా అతని ఆరోగ్య క్షీణతకు కారణమై ఉండవచ్చు.
 
=== మరణం తరువాత ===
పంక్తి 192:
పాంపే, [[జూలియస్ సీజర్]], [[ఆగస్టస్|అగస్టస్]] అందరూ అలెగ్జాండ్రియాలోని సమాధిని సందర్శించారు, అక్కడ అగస్టస్ అనుకోకుండా ముక్కును తన్నాడు. కాలిగులా తన సొంత ఉపయోగం కోసం సమాధి నుండి అలెగ్జాండర్ రొమ్ము పలకను తీసుకెళ్ళినట్లు చెబుతారు. క్రీ.శ. 200 ప్రాంతంలో, చక్రవర్తి సెప్టిమియస్ సెవెరస్ అలెగ్జాండర్ సమాధిని ప్రజలు దర్శించకుండా మూసివేసాడు. అతని కుమారుడు, వారసుడు, కారకాల్లా, అలెగ్జాండరంటే ఆరాధన కలిగినవాడు, తన పాలనలో సమాధిని సందర్శించారు. దీని తరువాత, సమాధి గతి ఏమైందనే దాని గురించిన వివరాలు అస్పష్టంగా ఉన్నాయి.
 
సిడాన్ సమీపంలో కనుగొన్న "అలెగ్జాండర్ సార్కోఫాగస్" ను అలా పిలవడానికి కారణం అందులో అలెగ్జాండర్ అవశేషాలను ఉండేవని భావించినందువల్ల కాదు, కానీ దానిపై అలెగ్జాండర్, అతని సహచరులు పర్షియన్లతో పోరాడటం, వేటాడటం చిత్రించి ఉండడం వలన. ప్రస్తుతం ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది. దీన్ని మొదట అబ్దలోనిమస్ యొక్క సార్కోఫాగస్ అని భావించారు (మరణం: 311 సా.పూ), 331 లో ఇస్సస్ యుద్ధం ముగిసిన వెంటనే అలెగ్జాండర్ నియమించిన సిడాన్ రాజు ఇతడు. <ref>{{harvnb|Studniczka|1894|pp=226ff}}</ref> <ref>{{Cite journal|last=Bieber|first=M|year=1965|title=The Portraits of Alexander|journal=Greece & Rome|series=Second Series|volume=12|issue=2|pages=183–88|doi=10.1017/s0017383500015345}}</ref> అయితే, ఇటీవల, ఇది అబ్దలోనిమస్ మరణ కాలం కంటే ఇది పూర్వపుదని సూచించబడింది.
 
=== సామ్రాజ్య విచ్ఛిన్నం ===
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు