థామస్ పైన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5:
థామస్ పేన్ [[ఇంగ్లాండు]] దేశానికి చెందిన [[థెట్ఫోర్డ్]] లో జన్మించాడు. ఇతడు ప్రఖ్యాత శాస్త్రవేత్త, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడైన "[[బెంజమిన్ ఫ్రాంక్లిన్]] ద్వారా [[1774]]<nowiki/>లో అప్పటి బ్రిటష్ కాలనీలుగా పిలువబడే అమెరికాకు పయనమయ్యాడు. అతను అమెరికాలో ప్రవేశించిన సమయంలో అమెరికా దేశానికి స్వాతంత్ర్యం కోసం విప్లవాత్మక సంఘర్షణలు జరుగుతున్నాయి. ఆ సమయంలో పేన్ "కామన్ సెన్సు" పేరుతో 1776లో కరపత్రాలను అమెరికా వ్యాప్తంగా పంపిణీ చేసాడు. అది విప్లవ నాయకులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తరువాతి కాలంలో అమెరికా దేశ స్వాతంత్ర్యం కోసం" [[ది అమెరికన్ క్రైసిస్]]" అనే మరో కరపత్రిక రచించాడు. Common Sense రచన గురించి అమెరికా దేశ వ్యవస్థాపకులలోఒకరైన జాన్ఆడంస్ "కామన్ సెన్ స్ రచయిత కలం యొక్క ప్రభావం గనక లేకపోతే జార్జ్ వాషింగ్టన్ యొక్క ఖడ్గ ప్రభావం నిష్ఫలమై వుండేది."
థామస్ పేన్ 1790వ దశకంలో
1793లో థామస్ పేన్ను బంధించి లక్సెంబర్గు కారాగారంలో ఖైదు చేసారు. జైలు జీవితంలో తన బృహత్గ్రంథం "ది ఏజ్ ఆఫ్ రీజన్" (1793-94) రచనలో నిమగ్నమైయ్యాడు. థామస్ పేన్ను ఫ్రాన్సు దేశంలో బంధించారనే విషయం అమెరికా దేశ వ్యాప్తంగ ప్రకంపనలు సృష్టించింది. అమెరికాకు అప్పటికి కాబోయే భావి అధ్యక్షుడు "జేమ్స్ మన్రో" తన పలుకుబడిని ఉపయోగించి దౌత్య సంబంధాల ద్వారా థామన్ పేన్ను విడుదల చేయించాడు. అప్పటికే తన రచన "ది ఏజ్ ఆఫ్ రీజన్" ద్వారా మత ఛాందసవాదుల నుంచి ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తన గ్రంథంలో "దీయిసమ్" అనే వాదనను సమర్ధించాడు. ఈ వాదం ఏమిటంటే భగవంతుడు ఈ సృష్టిని తయారు చేసి దాని కంటూ కొన్ని నియమాలు ఏర్పరచాడు. ఆ తరువాత ఆ నియమాల అనుసారం ఈ సృష్టి నడుస్తుందే తప్ప భగవంతుని జోక్యం ఇందులో వుండదు. ఈ సిద్ధాంతం అప్పట్లో ఎన్నో అలజడులను సృష్టించింది. మత ఛాందసవాదులనుంచి విమర్శలను ఎదుర్కొంది. ఈ సిద్ధాంతాన్ని అప్పటి మేధావులైన "[[వోల్టేర్]]" "బెంజమిన్ ఫ్రాంక్లిన్" "థామస్ జెఫర్ సన్" వంటి వారు అనుసరించారు. థామస్ పేన్ తన 72వ ఏట 1809 జూన్ 8వ తేదీన వృద్ధాప్యంలో అమెరికాలోని తన స్వంత గృహంలో తుది శ్వాస విడిచాడు. అప్పటి క్రైస్తవ మత అధికారులకు భయపడి పేన్ యొక్క అంతిమ యాత్రకు కేవలం 6గురు మాత్రమే హాజరయ్యారు.
|