పంచె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
దక్షిణ భారతదేశం లోని నాలుగు రాష్ట్రాలలోనూ, పంచెని కొంచెం అటు ఇటుగా ఒకే రకంగా కడతారు.
 
తమిళులు పంచకీ, [[లుంగీ]]లకీ జారిపోకుండా వెడల్పైన [[బెల్టు]] వాడతారు. కొందరైతే బెల్టు కనబడేలా షర్టుని పంచ లోకి టక్-ఇన్ చేస్తారు.
 
మలయాళీలు ఎక్కువగా ఎరుపు రంగు [[చొక్కా]], తెలుపు రంగు పంచెలను ధరిస్తారు. కేరళలో జరిగే అత్యంత పెద్ద పండుగ అయిన [[ఓనం]]కి హిందువులే[[హిందూ మతం|హిందువు]]<nowiki/>లే కాకుండా [[ఇస్లాం మతం|ముస్లింలు]], క్రైస్తవులు[[క్రైస్తవ మతం|క్రైస్తవు]]<nowiki/>లు చొక్కా-తెల్ల పంచెలు ధరిస్తారు. అయితే [[హిందువులు]] సవ్య దిశగా (clockwise: free end కుడి వైపుకు), [[ముస్లిం]], [[క్రైస్తవులు|క్రైస్తవు]]<nowiki/>లు అయితే అపసవ్య దిశగా (anti-clockwise: free end ఎడమ వైపుకు) కడతారు. [[కేరళ]] లోని ప్రతి [[గుడి]]<nowiki/>లో [[పురుషులు]] కేవలం పంచెలను మాత్రమే ధరించాలి. (శరీరం పై భాగం పై [[టవలు]], పై పంచె, [[శాలువా]] వంటి ఎటువంటి ఆచ్ఛాదన ఉండకూడదు.)
 
మోకాలి వరకు (కాస్త పైకి గానీ, క్రిందకి గానీ) ఎగకట్టే పంచెని '''అడ్డ పంచె''' అంటారు. అయితే, గౌరవనీయులైన, వయసులో పెద్ద వారైన వారి ఎదురుపడినప్పుడు, గుడులలోకి ప్రవేశించే ముందు దీనిని మరల క్రిందకు దించేస్తారు. అడ్డ పంచె స్వేచ్ఛను అనుభవించటం కొరకు మాత్రమే. అది సాంప్రదాయికం కాదు.
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు