రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు

,
రీమణు
పంక్తి 3:
[[బొమ్మ:rudramadEvi text.jpg|right|250x250px|శిలాఫలకం|alt=]]
'''రుద్రమదేవి''' (ఆంగ్లం : [[:en:Rudrama Devi|Rudrama Devi]]) [[కాకతీయులు|కాకతీయుల]] వంశంలో ఒక ధృవతారగా వెలిగిన [[మహారాణి]]<ref>ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర, పి.వి.కె. ప్రసాదరావు, ఎమెస్కో బుక్స్, విజయవాడ, 2007</ref>. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. [[భారతదేశం|భారతదేశ]] చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ.
కాకతీయ గణపతిదేవుడు, పాలకుడైన జయాపసేనాని సోదరులైనసోదరీమణులైన నారంభ, పేరాంభలను వివాహ మాడినాడు, వీరి ముద్దుల కుమార్తె రుద్రమదేవి. చేబ్రోలు శాసనం దీని గురించి తెలియజేస్తుంది. ఈమె తండ్రి [[గణపతి దేవుడు|గణపతిదేవునికి]] పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు<ref>Rudrama Devi, the Female King: Gender and Political Authority in Medieval India, In: Syllables of Sky: Studies in South Indian Civilization, ed. David Schulman, 1995; pp.391-430, Oxford Unversity Press, Delhi</ref>. గణపతిదేవుడు తన [[కుమార్తె]] రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు ) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి [[పెళ్ళి|వివాహం]] చేశాడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే [[ప్రతాప రుద్రుడు]]. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే [[తమ్ముడు]] ఉండేవాడని స్థానిక గాథ. [[బస్తర్]] రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ [[కుమార్తె]] రుయ్యమ్మ.
 
===జీవిత విశేషాలు ===
"https://te.wikipedia.org/wiki/రుద్రమ_దేవి" నుండి వెలికితీశారు