రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు

→‎రుద్రమదేవి మరణశాసనం: కల్ లో  దొరికిన  
పంక్తి 62:
ఉస్మానియా యూనివర్శిటీలో తెలుగు రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తున్న టంగుటూరి సైదులు కాకతీయ రుద్రమదేవి మరణానికి సంబంధించిన చారిత్రిక ఆధారాల కోసం అన్వేషించసాగాడు. ఇందులో భాగంగానే మునుగోడులో మట్టిలో కూరుకుపోయిన శాసనాన్ని గుర్తించి పురావస్తు శాఖాధికారుల సహాయంతో వెలికితీయించి అది రుద్రమదేవి మరణశాసనంగా గుర్తించారు. విరోధనామ సంవత్సరం ద్వాదశి రోజున అంటే 1289వ సంవత్సరం, నవంబరు 27వ తేదీన రాణీ రుద్రమదేవి వీరమరణం పొందినట్లుగా శాసనంపై లిఖించినట్లు వెల్లడైంది.
 
తెలంగాణలో నల్లమల అడవులు హైదరాబాద్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్ననూరులో ప్రారంభమవుతాయి. అక్కడినుంచి 50కిలోమీటర్ల దూరంలో ఉండే బౌరాపురం (భ్రమరాంబపురం) మీదుగా కాలినడకన మరో పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మేడిమల్‌కల్ అనే చెంచుపెంట శివారులో దుర్గమ అరణ్యంలో ఒక శిలాశాసనం వుంది. మేడిమల్‌కల్‌లో (ఒకప్పటి మేడిమ లంకలు అనే గ్రామంలో) ఈ శాసనం వేయించిన రోజు క్రీ.శ.1290 ఫిబ్రవరి 20 (విరోధి పాల్గుణ శుక్ర) నాటికే మల్లికార్జున దేవాలయం, దానికి అనుబంధంగా కలు మఠం ఉండేవి. ఆలయంలో శ్రీ పర్వత శ్రీ స్వయంభు శ్రీలింగ చక్రవర్తి శ్రీ మల్లికార్జున మహాలింగం అనే దేవుడుండేవాడు. కారణాలు ఏవో గానీ ఆ ఆలయం, మఠం కొంతకాలం నిరాదరణకు గురైనవి. అలా జరుగకూడదని ప్రతాపరుద్రుని మహా సామంతుడు చెరకు బొల్లయరెడ్డి 1290 ఫిబ్రవరి 20 నాటి సూర్యగ్రహణ కాలమున స్వామి వారి అంగరంగ భోగాలకు, కలు మఠానికి అనేక దానాలు చేశాడు. ఆ వివరాలు శిలా శాసనం చివర్లో ఉన్నాయి.1289లో నవంబరు 27న ఆమె వీరమరణం చెందినట్టు నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతంలోని చందుపట్ల శాసనం స్పష్టంచేస్తున్నది.భారతి మే 1974 సంచికలో చరిత్ర పరిశోధకుడు పీవీ పరబ్రహ్మశాస్త్రిగారు ఈ విషయాలను చర్చిస్తూ సవివరంగా వ్యాసం రాయటంతో ఈ సంగతి ప్రపంచానికి తెలిసింది. మేడిమల్ కల్మేడిమల్కల్ లో  దొరికిన కొత్త శాసనం చందుపట్ల శాసనంలో పేర్కొన్న రుద్రమ మరణ తేదీ నిజమే అని నిర్ధారిస్తోంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రుద్రమ_దేవి" నుండి వెలికితీశారు