1,744
edits
1323వ సంవత్సరములొ ముస్లిముల ధాటికి [[ఓరుగల్లు]] తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు మరియు పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కిరి. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు నర్మదా నదిలో మునిగి ఆత్మహత్య చేసుకొనెను. ఢిల్లీ చేరిన పిదప గన్నమ నాయునికి మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చెను. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. మరియు తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుట ఢిల్లీ సుల్తానుల రివాజు. గన్నమ మాలిక్ మక్బూల్ గా మార్చబడెను. సుల్తాను మక్బూల్ ను పంజాబ్ పాలకునిగా ముల్తాను పంపెను.
ఉలుఘ్ ఖాను (మహమ్మదు బిన్ తుగ్లకు) ఓరుగల్లును 1323లో దౌలతాబాదు అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచాడు. అటుపిమ్మట ముసునూరి నాయకుల విప్లవముతో తెలుగునాడు విముక్తమైనది. 1257లో మధుర సుల్తాను జలాలుద్దీను కూడ తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. ఇది సహించని తుగ్లకు పెద్దసైన్యముతో మక్బూల్ ను తొడ్కొని ఓరుగల్లు చేరాడు. అచట ప్రబలుతున్న మహమ్మారి వల్ల సుల్తానుకు అంటుజాడ్యము సోకింది. భయపడిన సుల్తాను తూర్పు తెలంగాణమును మక్బూల్ ను అధిపతిగా చేసి ఢిల్లీ తిరిగి వెళ్ళాడు. 1258లో కాపానీడు మక్బూల్ ను ఓరుగంటినుండి తరిమివేసి కోటను జయించెను.
ఫిరోజ్ షా సింధుదేశపు దండయాత్ర సందర్భమున 6 నెలలు ఎట్టి వార్తలు లేవు. క్లిష్ట పరిస్థితులలో ఢిల్లీ ని కుతంత్రములనుండి కాపాడి సుల్తానుకు మక్బూల్ మరింత చేరువయ్యెను. సంతసించిన సుల్తాను మక్బూలే నిజమైన సుల్తాను అని పొగడెను. ఒక సందర్భమున తురుష్క కోశాధికారి అల్ మిహ్రు తో విభేదములు వచ్చి అతనిని తొలగించుటకు మక్బూల్ పట్టుబట్టగా సుల్తానుకు అలా చేయక తప్పలేదు. అప్పటినుండి మక్బూలే కోశాధికారిగా వ్యవహరించెను. ఈతని జెనానాలో 2,000 మంది ఉంపుడుగత్తెలు గలరు.▼
అటు పిమ్మట మక్బూల్ తిరిగి ఢిల్లీ దర్బారు చేరి గుజరాత్ మరియు సింధు దేశములలొ పెక్కు విజయములు సాధించెను. అప్పటినుండి మక్బూల్ ఢిల్లీ దర్బారు లో వజీరు (ప్రధాన మంత్రి)గా నియమించబడెను. భాషాప్రాంతమతభేధములనధిగమించి ఢిల్లీ దర్బారునందు క్లిష్టపరిస్థితులలో మక్బూల్ సాధించినది అతని ప్రతిభాపాటవములకు తార్కాణము.
▲ఫిరోజ్ షా సింధుదేశపు దండయాత్ర సందర్భమున 6 నెలలు ఎట్టి వార్తలు లేవు.
==వనరులు==
* http://links.jstor.org/sici?sici=0004-3648(2001)61%3A1%3C77%3AFDTTDN%3E2.0.CO%3B2-8
* Sri Marana Markandeya Puranamu, ed. G. V. Subrahmanyam, 1984, Andhra Pradesh Sahitya Academy, Hyderabad
|
edits