"భోగరాజు పట్టాభి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు. [[ఆంధ్రా బ్యాంకు]] ([[1923]]లో స్థాపన), ఆంధ్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించాడు.
===తెలుగు అభిమానిగా===
[[File:Bhogaraju Pattabhi Sitaramayya 1997 stamp of India.jpg|right|thumb|150px|సీతారామయ్య స్మారక తపాలాబిళ్ళ]]
ప్రత్యేక [[తెలుగు]] రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాలలో తెలుగు వాడకాన్ని పట్టాభి ఎంతగానో ప్రోత్సహించాడు. తాను స్థాపించిన సంస్థలన్నింటిలోనూ తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీలు తెలుగులోనే జరగాలని నియమం పెట్టి ఆచరించాడు. ఆయన వేష, భాషల్లో ఎప్పుడూ తెలుగుతనం ఉట్టిపడుతూ ఉండేది. అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడు అయిననూ, గవర్నర్‌గా [[మధ్య ప్రదేశ్]] వెళ్ళిననూ వేష, భాషల్లో మార్పు రాలేదు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2923361" నుండి వెలికితీశారు