చినరాయుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎తారాగణం: +విజయలలిత
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
చేపల చెరువు వేలంలో చినరాయుడి మీద నెగ్గుతాడు పశుపతి. తర్వాత ఆ చెరువులోవిషం కలిపి ఆ నేరాన్ని చినరాయుడి మీదకు నెట్టడానికి ప్రయత్నిస్తాడు. అందుకు అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు ప్రకాష్ రావు అనే వ్యక్తిని నియమిస్తాడు పశుపతి. ప్రకాష్ రావు చిన్నప్పటి నుంచి చినరాయుడి దగ్గరే పెరిగినా అతన్ని అవమానించాడనే కోపంతో సాక్ష్యం చెప్పడానికి సిద్ధ పడతాడు. గంగ అడ్డుపడి చెప్పవద్దని వేడుకుంటుంది. కానీ అతను వినడు. చినరాయుడిని పరువు కాపాడ్డం కోసం ప్రకాష్ రావును కత్తితో నరుకుతుంది గంగ. ఆమెను పోలీసులు నిర్భందిస్తారు. చినరాయుడు వెళ్ళి ఆమె దగ్గరకు పోయి అసలు కారణం పశుపతి అని తెలుసుకుని అతని మీద కత్తిదూయడానికి వెళతాడు. కానీ అదే సమయానికి చెల్లెలికి శుభకార్యం జరుగుతుండటంతో వెనక్కి తిరిగి వచ్చేస్తాడు.
 
ఈ లోపు పెళ్ళి కాని గంగ గర్భవతి అవుతుంది. ఆమె గౌరవం కాపాడ్డం కోసం చినరాయుడు జరిగిన నేరం తనమీద వేసుకుంటాడు. దుర్గమ్మ కొడుకుని ఇంటి నుంచి బయటకు పంపేస్తుంది. జైలులో గౌరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంది. చినరాయుడు ఆమెను ఆపి జరిగిన విషయం చెబుతాడు. గంగకు అలా జరగడానికి కారణం ప్రకాష్ రావు అనీ, వాళ్ళ కుటుంబ గౌరవం కాపాడ్డానికే అలా చేయవలసి వచ్చిందని ఆమెకు చెబుతాడు. అదే సమయానికి ప్రకాష్ రావు నిజానికి గౌరి నరకడం వలనే చనిపోలేదని, తర్వాత పశుపతి వచ్చి చంపేశాడనీ చినరాయుడికి తెలుస్తుంది. చినరాయుడు ఈ విషయాన్ని గౌరికి నిరూపిస్తాడు. గంగ ఒక బిడ్డకు జన్మనిచ్చి అందరికీ నిజం చెప్పి చనిపోతుంది. చినరాయుడు పశుపతిని పంచాయితీకి పిలిచి నేరం ఒప్పుకోమంటాడు. అతనిపశుపతి పశ్చాత్తాపపడి పోలీసులకి లొంగిపోవడంతో కథ ముగుస్తుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/చినరాయుడు" నుండి వెలికితీశారు