వికీపీడియా:శైలి/భాష: కూర్పుల మధ్య తేడాలు

767 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
** మరో ఉదాహరణ - కార్తిజియన్లు మరియు గ్రీకులు >> కార్తిజియన్లూ, గ్రీకులూ (రెండూ దీర్ఘాలతో ముగించేసి, కామా పెడితే మరియు తీసేయొచ్చు).
** ఇంకో ఉదాహరణ - ''సెల్ట్స్ ఇటలీ కేంద్రంలో నివసిస్తున్నారు మరియు ఇటాలిక్ ప్రజలు ఇటాలియన్ ద్వీపకల్పం అంతటా జీవిస్తున్నారు.'' >> ''సెల్ట్స్ ఇటలీ కేంద్రంలోనూ, ఇటాలిక్ ప్రజలు ఇటాలియన్ ద్వీపకల్పం అంతటా జీవిస్తున్నారు'' అని వాక్యాలు రెండూ కలపవచ్చు, లేదంటే ''సెల్ట్స్ ఇటలీ కేంద్రంలో నివసిస్తున్నారు. ఇటాలిక్ ప్రజలు ఇటాలియన్ ద్వీపకల్పం అంతటా జీవిస్తున్నారు.'' అని విడదీయనూవచ్చు.
* '''బడు''': బడు ప్రయోగం రావడానికి ప్రధానమైన కారణం ఆంగ్ల భాషకు సహజమైన పాసివ్ వాయిస్ వాడకం. అది తెలుగుకు అసహజం. తెలుగులో మార్చేప్పుడూ యాక్టివ్ వాయిస్ లోకి మారిస్తే ఈ సమస్య ఉండదు.
* '''యొక్క''': యొక్క అన్నది సమాసంలో దానంతట అదే ఉంటుంది. ప్రత్యేకించి యొక్క అక్కరలేదు. వీటిని సరైన పద్ధతిలో తీసివేయాలి.
* సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలను విడదీయడం మేలు. ఎంత చిన్న వాక్యాలైతే అంత తేటగా అర్థాన్ని ఇస్తాయి.
** ఉదాహరణకు: ''ప్రధానంగా ఇటలీ ఉత్తర మరియు మధ్య ప్రాంతాలలో షిప్పింగ్, వాణిజ్యం మరియు బ్యాంకింగ్ జరగడం ద్వారా గొప్ప సంపదకు, ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి పునాది వేసింది.''. ఈ వాక్యాన్ని ''ప్రధానంగా ఉత్తర, మధ్య ఇటలీలో షిప్పింగ్, వాణిజ్యం, బ్యాంకింగ్ జరిగేది. ఇది ఇటలీలో గొప్ప సంపదకు, ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి పునాది వేసింది.''
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2923602" నుండి వెలికితీశారు