మహా జనపదాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎కాంభోజ: మరి కొన్ని జనపదాల చేర్పు
పంక్తి 112:
పామీర్లు, బదక్షన్ లతో కూడిన హిందూకుష్-ఆవలి ప్రాంతం ఓరమ కాంభోజ రాజ్యం. దీనికి పశ్చిమాన బాహ్లికులు, ఉత్తరన సోగ్దియనా/పర్గాణా ల్కు చెందిన రిషికులు సరిహద్దులుగా ఉండేవారు. <ref>MBH II.27.27.</ref> కాంభోజుల ట్రాన్స్-హిందూకుష్ శాఖ స్వచ్ఛమైన ఇరానియన్లుగా మిగిలిపోయారు గానీ, హిందూకుష్‌కు ఇవతల ఉన్న కాంభోజులు భారతీయ సాంస్కృతిక ప్రభావానికి లోనైనట్లు కనిపిస్తోంది. కాంభోజులకు [[ఇరాన్|ఇరానియన్]] భారతీయ అనుబంధాలు రెండూ ఉన్నట్లు తెలుస్తోంది. <ref>''Vedic Index I'', p. 138, Macdonnel, Dr Keith.</ref> <ref>''Ethnology of Ancient Bhārata'', 1970, p. 107, Dr Ram Chandra Jain.</ref> <ref>''The Journal of Asian Studies''; 1956, p. 384, Association for Asian Studies, Far Eastern Association (U.S.).</ref> <ref>''Balocistān: siyāsī kashmakash, muz̤mirāt va rujḥānāt''; 1989, p. 2, Munīr Aḥmad Marrī.</ref> <ref>''India as Known to Panini: A Study of the Cultural Material in the Ashṭādhyāyī''; 1953, p. 49, Dr Vasudeva Sharana Agrawala.</ref> <ref>''Afghanistan'', p. 58, W. K. Fraser, M. C. Gillet.</ref> <ref>''Afghanistan, its People, its Society, its Culture'', Donal N. Wilber, 1962, pp. 80, 311 etc.</ref> <ref>''Iran'', 1956, p. 53, Herbert Harold Vreeland, Clifford R. Barnett.</ref> <ref>''Geogrammatical Dictionary of Sanskrit (Vedic): 700 Complete Revisions of the Best Books...'', 1953, p. 49, Dr Peggy Melcher, Dr A. A. McDonnel, Dr Surya Kanta, Dr Jacob Wackernagel, Dr V. S. Agarwala.</ref> <ref>''Geographical and Economic Studies in the Mahābhārata: Upāyana Parva'', 1945, p. 33, Dr Moti Chandra - India.</ref> <ref>''A Grammatical Dictionary of Sanskrit (Vedic): 700 Complete Reviews of the ...'', 1953, p. 49, Dr Vasudeva Sharana Agrawala, Surya Kanta, Jacob Wackernagel, [[Arthur Anthony Macdonell]], Peggy Melcher - India.</ref>
 
కాంభోజులు పురాణ కాలం నుండీ ప్రసిద్ధి గాంచిన గణతంత్ర ప్రజలు. [[మహాభారతం]] కాంభోజులలోని అనేక గణా (లేదా రిపబ్లిక్) లను సూచిస్తుంది. <ref>MBH 7/91/39.</ref> [[చాణక్యుడు|కౌటిల్యుని]] [[అర్థశాస్త్ర|అర్ధశాస్త్రం]] <ref>Arthashastra 11/1/4.</ref> [[అశోకుడు|అశోకుడి]] శాసనం నంబర్ XIII కూడా కాంభోజులు గణతంత్ర రాజ్యాంగాన్ని అనుసరించాయని ధృవీకరిస్తున్నాయి. పాణిని సూత్రాలు మాత్రం, <ref>Ashtadhyayi IV.1.168–175.</ref> కాంభోజది [[క్షత్రియులు|క్షత్రియ]] రాచరికం అని తెలియజేస్తున్నాయి. కాంభోజుల పాలకుడు నామమాత్రపు నేత మాత్రమేనని కూడా చెబుతాడు <ref>''Hindu Polity: A Constitutional History of India in Hindu Times'', Parts I and II., 1955, p. 52, Dr Kashi Prasad Jayaswal - Constitutional history; Prācīna Kamboja, jana aura janapada =: Ancient Kamboja, people and country, 1981, Dr Jiyālāla Kāmboja - Kamboja (Pakistan).</ref> బౌద్ధ గ్రంథాల ప్రకారం, పైన పేర్కొన్న మహాజనపదాలలో మొదటి పద్నాలుగు మజ్జిమదేశ (మధ్య భారతదేశం) కు చెందినవి. చివరి రెండు ఉత్తరాపథానికి లేదా జంబూద్విప ''వాయువ్యవాయవ్య'' ప్రాంతానికి చెందినవి.
<br />
 
క్రీస్తుపూర్వం 6/5 వ శతాబ్దంలో జరిగిన ఆధిపత్య పోరాటంలో, పెరుగుతున్న మగధ రాజ్యం ప్రాచీన భారతదేశంలో ప్రధాన శక్తిగా ఉద్భవించింది. మజ్జిమదేసలోని అనేక జనపదాలను ఆక్రమించింది. మగధ చక్రవర్తి [[మహాపద్ముడు|మహాపద్మ నందుడు]] [[క్షత్రియులు|క్షత్రియులందరినీ]] నిర్మూలించాడని [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] [[పురాణములు|పురాణాలలో]] విలాపం వినిపించింది. ఆ తరువాత క్షత్రియ అనే పేరుకు అర్హులైనవారే లేరు. ఇది కాశీ, కోసల, కురు, పాంచాల, వత్స్య, తూర్పు పంజాబుకు చెందిన ఇతర నియో-వేద తెగలను సూచిస్తుంది. వీళ్ళ గురించి పురాణాల్లోను కవిత్వాల్లోనూ తప్ప మరెక్కడా వినబడలేదు. (నందులు క్రీ.పూ. 345 లో [[శిశునాగ వంశం|శిశునాగ]] సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తద్వారా [[నంద వంశం|నంద సామ్రాజ్యాన్ని]] స్థాపించారు. ) <ref>{{Citation}}</ref>
 
అయితే [[చంద్రగుప్త మౌర్యుడు|చంద్రగుప్తుడు]], [[చాణక్యుడు|కౌటిల్యుడు]] రంగస్థలం పైకి వచ్చే వరకు కాంభోజులు, గాంధారులకు మగధ రాజ్యంతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. కానీ ఈ దేశాలకు ఉన్న ఆహారంగా పడిపోయింది కానీ ఈ రెండు రాజ్యాలు [[ఇరాన్|పర్షియా]] కు చెందిన అకెమినీడ్ల పాలకుడు, [[సైరస్ ది గ్రేట్|సైరస్]] (558-530 BCE) చేతిలో గానీ, డారియస్ పాలన మొదటి సంవత్సరంలో గానీ ఓడిపోయారు. కాంభోజ, గాంధారలు అకెమెనీడ్ సామ్రాజ్యపు ఇరవయ్యవ సామంత రాజ్యంగా, వారి సామంత రాజుల్లో అత్యంత ధనిక రాజ్యంగా మారిపోయింది. సైరస్ I ప్రముఖ కాంభోజ నగరం కపిసి (ఆధునిక బెగ్రామ్) ని నాశనం చేసాడని ప్రతీతి  
 
=== కాశీ ===
ఈ రాజ్యం దాని రాజధాని [[కాశీ|వారణాసి]] చుట్టూ ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉంది. దీనికి ఉత్తర, దక్షిణాల్లో వరుణ, ఆసి నదులున్నాయి. వీటి వలన ఈ నగరానికి వారణాసి అనే పేరు వచ్చింది. బుద్ధుడికి ముందు, పదహారు మహాజనపదాలలో కాశీ అత్యంత శక్తివంతమైనసి. అనేక ''[[జాతక కథలు]]'' భారతదేశంలోని ఇతర నగరాల కంటే కాశీ రాజ్య రాజధానే గొప్పదని పేర్కొంటాయి. దాని గొప్పదనం గురించి, సుసంపన్నత గురించి ఎక్కువగా వర్ణిస్తాయి. ఈ కథలు కాశీ రాజ్యానికీ [[కోసల]], [[అంగదేశము|అంగ]], [[మగధ సామ్రాజ్యము|మగధ]] అనే మూడు రాజ్యాలకూ మధ్య ఆధిపత్యం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాల గురించి చెబుతాయి. కాశీ రాజు బృహదత్తుడు [[కోసల]]<nowiki/>ను స్వాధీనం చేసుకున్నప్పటికీ, బుద్ధుడి కాలం లోనే కంసుడు కాశీ రాజ్యాన్ని [[కోసల]] రాజ్యంలో కలిపేసుకున్నాడు. కాశీ, కోసల, విదేహ రాజ్యాల ప్రస్తావన వేద గ్రంథాలలో కనబడుతుంది. ఈ ప్రజలు ఓక్రికొకరు దగ్గరి సంబంధీకులని తెలుస్తోంది. కాశీని ''మత్స్య పురాణంలో కౌశిక అని,'' అల్ బెరూని కౌషాక అనీ పిలిచారు. మిగతా పురాతన గ్రంథాలన్నీ కాశీ అనే పేరునే ప్రస్తావిస్తాయి
 
=== కోసల ===
[[దస్త్రం:Kosala_Karshapana.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Kosala_Karshapana.jpg|thumb|[[కోసల]] మహాజనపాడ యొక్క వెండి నాణేలు (క్రీ.పూ. 525-465) ]]
కోసల దేశం మగధకు వాయవ్య దిశలో ఉంది, దాని రాజధాని [[అయోధ్య]]. దీని భూభాగం మధ్య తూర్పు [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్‌లోని]] ఆధునిక అవధ్ (లేదా ఔధ్) తో సరిపోతుంది. దీనికి దక్షిణాన [[గంగా నది|గంగా]] నది, తూర్పున గండక్ (నారాయణి) నది, ఉత్తర సరిహద్దున [[హిమాలయాలు|హిమాలయ]] పర్వతాలూ ఉన్నాయి. ఇది వేద ధర్మ కేంద్రంగా పేర్కొనబడింది. దాని రాజులు దైత్యులు, రాక్షసులు, అసురులకు వ్యతిరేకంగా వివిధ యుద్ధాలలో దేవతలతో పొత్తు పెట్టుకున్నారు. కోసల, అయోధ్య లకు హిందూ గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలలో ప్రముఖ స్థానం ఉంది. రఘువంశం-ఇక్ష్వాకువంశం అత్యంత సుదీర్ఘమైన నిరంతర రాజవంశం; ఈ రాజవంశంలో రాముడు ఒక రాజు. ఇతర గొప్ప రాజులు పృథువు, హరిశ్చంద్రుడు, దిలీపుడు. వివిధ పురాణాల్లో, రామాయణం, మహాభారతాలలో వీరందరి ప్రస్తావన ఉంది. ఈ గ్రంథాల ప్రకారం, రికార్డు చేసిన చరిత్రలో కోసల అత్యంత శక్తివంతమైన, అతిపెద్దదైన రాజ్యం.
[[దస్త్రం:Procession_of_Prasenajit_of_Kosala_leaving_Sravasti_to_meet_the_Buddha.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Procession_of_Prasenajit_of_Kosala_leaving_Sravasti_to_meet_the_Buddha.jpg|ఎడమ|thumb|216x216px|సాంచిలోని [[గౌతమ బుద్ధుడు|బుద్ధుడిని]] కలవడానికి శ్రావస్తి నుండి బయలుదేరిన కోసల ప్రసేనజిత్తు ఊరేగింపు . <ref>Marshall [https://archive.org/stream/in.ernet.dli.2015.459148 p.59]</ref>]]
తరువాత, ఈ రాజ్యాన్ని మహావీరుడు, బుద్ధుని కాలాల్లో ప్రసిద్ధ రాజు ప్రసేనజిత్తు పాలించాడు. తరువాత అతని కుమారుడు విడుదాభా (విరూధక). ప్రసేనాజిత్తు ఉన్నత విద్యావంతుడు. మగధతో పెళ్ళి సంబంధాల ద్వారా అతని స్థానం మరింత బలపడింది: అతని సోదరిని బింబిసారుడు వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్ళిలో కాశీలో కొంత భాగాన్ని కట్నంగా ఇచ్చారు. అయితే, పసేనాడి (ప్రసేనజిత్తు) కు, మగధ రాజు అజాతశత్రువుకూ మధ్య ఆధిపత్య పోరు జరిగింది. [[లిచ్చావి (వంశం)|లిచ్ఛవులు]] మగధకు మద్దతు పలకడంతో ఈ పోరు ముగిసింది. విదుదాభా కోసల పాలకుడిగా ఉన్న సమయంలో కోసల మగధలో విలీనమై పోయింది. [[అయోధ్య]], [[ Saketa|సాకేత]], [[కాశీ|బనారస్]], శ్రావస్తి లు కోసల రాజ్యపు ప్రధాన నగరాలు.  
 
=== కురు ===
[[దస్త్రం:Kurus_(Kurukshetras)_circa_350-315_BCE.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Kurus_(Kurukshetras)_circa_350-315_BCE.jpg|thumb|[[కురు సామ్రాజ్యం|కురు]] మహాజనపదపు వెండి నాణెం (క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం) ]]
''పురు - భరత'' కుటుంబం ప్రస్తావన ద్వారా [[పురాణములు|పురాణాల్లో]] కురు రాజ్య మూలం ఉంది. పురు రాజవంశంలో 25 తరాల తరువాత, కురు పుట్టాడు. కురు తర్వాత 15 తరాల అనంతరం, కౌరవులు, పాండవులు జన్మించారు. కురులు ''మధ్యదేశంలో ఉండేవారని,'' ఉత్తర కురులు హిమాలయాలకు ఆవల నివసించేవారనీ ఐతరేయ బ్రాహ్మణం చెబుతోంది. బౌద్ధ గ్రంథం సుమంగవిలాసిని ప్రకారం, <ref>II. p 481</ref> కురురాజ్య ప్రజలు (కురులు) ఉత్తర కురు భూముల నుండి వచ్చారు. వాయు పురాణము ''కురు,'' పురు వంశం సంవర్షణుడి కుమారుడైన కురు, ఈ వంశానికి మూల పురుషుడని చెబుతుంది. ఇతడే కురుక్షేత్ర జనపద స్థాపకుడు. సుమారుగా ఆధునిక థానేసర్, ఢిల్లీ రాష్ట్రం, [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్ లోని]] [[మీరట్ నగరం|మీరట్]] జిల్లా ప్రాంతమే కురు రాజ్యం. [[జాతక కథలు|జాతక కథల]] ప్రకారం, కురు రాజధాని, ఆధునిక ఢిల్లీ సమీపంలోని [[ఇంద్రప్రస్థం|ఇంద్రప్రస్థ]] (ఇందపత్త). బుద్ధుని కాలంలో, కురు రాజ్యాన్ని కొరైవ్య అనే పేరుగల అధిపతి (కింగ్ కాన్సుల్) పాలించారు. బౌద్ధ కాలంలోని కురులకు [[వైదిక నాగరికత|వేద కాలపు]] కురులకు ఉన్నంత ఉన్నత స్థానం లేదు గానీ, వారి ప్రాచీనుల లాగానే వీరు కూడా లోతైన జ్ఞానం, మంచి ఆరోగ్యంతో ఉండేవారు. కురులు యాదవులు, భోజులు, త్రిగ్రర్తులు, పాంచాలులతో పెళ్ళి సంబంధాలు కలుపుకున్నారు. [[ధర్మరాజు|యుధిష్ఠిర]] జాతికి చెందిన యువరాజుగా పరిచయం చేసిన ధనంజయ రాజు గురించి, [[జాతక కథలు|జాతక]] కథలో ఒక ప్రస్తావన ఉంది. మునుపటి కాలంలో సుప్రసిద్ధ రాచరిక ప్రజలు అయినప్పటికీ, కురులు క్రీస్తుపూర్వం 6 నుండి 5 వ శతాబ్దాలలో గణతంత్ర ప్రభుత్వానికి మారారు. కురులు ''రాజశబ్దోప జీవిన్'' (కింగ్ కాన్సుల్) రాజ్యాంగాన్ని అనుసరించేవారని క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో, [[చాణక్యుడు|కౌటిల్యుని]] అర్ధశాస్త్రం ధృవీకరిస్తుంది.
 
=== మగధ ===
[[దస్త్రం:Magadha_kingdom_coin_Circa_350_BC_AR_Karshapana.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Magadha_kingdom_coin_Circa_350_BC_AR_Karshapana.jpg|thumb|[[మగధ సామ్రాజ్యము|మగధ]] మహాజనపదపు వెండి నాణెం (క్రీ.పూ 350) ]]
[[మగధ సామ్రాజ్యము|మహాజనపదాలలో మగధ]] అత్యంత ప్రముఖమైనది, సంపన్నమైనది. రాజధాని నగరం పాటలీపుత్ర ([[పాట్నా]], [[బీహార్]]), [[గంగా నది|గంగా]], సోన్, పున్పున్, గండక్ వంటి ప్రధాన నదుల సంగమ స్థలం వద్ద ఉంది. ఈ ప్రాంతంలోని ఒండ్రు మైదానాలు, [[బీహార్]], [[జార్ఖండ్]] ల లోని రాగి, ఇనుము అధికంగా ఉన్న ప్రాంతాల సామీప్యత వలన మంచి నాణ్యమైన ఆయుధాలను అభివృద్ధి చేయడానికీ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ దోహదపడింది. ఆ కాలం నాటి వాణిజ్య రహదారులకు మధ్యలో ఉన్నందున మగధ సంపదకు దోహదపడింది. ఈ కారకాలన్నీ [[మగధ సామ్రాజ్యము|మగధను]] ఆ కాలంలో అత్యంత సంపన్నమైన రాజ్యంగా [[మగధ సామ్రాజ్యము|ఎదగడానికి]] సహాయపడ్డాయి.
[[దస్త్రం:Bamboo_garden_(Venuvana)_at_Rajagriha,_the_visit_of_Bimbisara.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Bamboo_garden_(Venuvana)_at_Rajagriha,_the_visit_of_Bimbisara.jpg|ఎడమ|thumb|మగధ రాజు [[బింబిసారుడు]] రాజగృహలోని వెదురు తోట (వేణువనం) ను సందర్శిస్తాడు; సాంచి నుండి కళాకృతి. ]]
[[మగధ సామ్రాజ్యము|మగధుల]] రాజ్యం - దక్షిణ [[బీహార్|బీహార్‌లోని]] [[పాట్నా]], [[గయ]] ఆధునిక జిల్లాలు, తూర్పున [[బెంగాల్|బెంగాల్‌లోని కొన్ని]] ప్రాంతాలూ ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పాటలీపుత్రకు ఉత్తరాన గంగా నది, తూర్పున చంపా నది, దక్షిణాన [[వింధ్య పర్వతాలు|వింధ్య]] పర్వతాలు, పశ్చిమాన సోన్ నది ఉన్నాయి. బుద్ధుని కాలంలో అంగ రాజ్యం దాని సరిహద్దుల లోపల ఉండేది. దీని తొలి రాజధాని గిరివ్రజ లేదా రాజగృహ (ఆధునిక బీహార్ లోని నలంద జిల్లాలో ఉన్న రాజ్‌గిర్). నగరానికి ఇతర పేర్లు మగధపుర, బృహద్రథపుర, వసుమతి, కుశాగ్రపుర, బింబిసారాపురి. ఇది ప్రాచీన కాలంలో [[జైన మతము|జైనమతం]] యొక్క చురుకైన కేంద్రం. మొదటి [[ బౌద్ధ మండలి|బౌద్ధ మండలి]] వైభారా కొండలలోని రాజగృహలో జరిగింది. తరువాత, [[పాటలీపుత్ర]] మగధ రాజధాని అయింది.  
<br />
==ఇవీ చూడండి==
*[[:en:Iron Age India|ఇనుప యుగ భారతదేశం]]
"https://te.wikipedia.org/wiki/మహా_జనపదాలు" నుండి వెలికితీశారు