యల్లాప్రగడ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
==బాల్యం - విద్యాభ్యాసం==
ఇయన [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[భీమవరం]] బస్తీలో [[1895]], [[జనవరి 12]] న జన్మించారు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల చదువులు పూర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఈయనను చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి ఈయనను [[రాజమండ్రి]]కి పంపించి [[మెట్రిక్యులేషన్]] పరీక్ష చదివించారు. ఫెయిలయ్యారు. ఇంతలో తండ్రి మరణించాడు. తల్లి పట్టుదలతో [[మద్రాసు]]కు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది.
 
[[మద్రాసు]] హిందూ ఉన్నత పాఠశాలలో చేరి, చదువులో ముందడుగు వేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో కూడా భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఈయనకు బాల్యంలోనే అబ్బింది. సంఘ సంస్కర్త [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] ప్రభావం ఈయన మీద బాగా పొడసూపింది. మద్రాస్, మైలాపూర్ లోని రామకృష్ణ మిషన్ వైపు కూడా ఆకర్షితుడాయ్యారు. వైద్యం నేచి, మిషన్ లో చేరి సన్యాసిగా అందరికీ వైద్య సేవలు అందించాలన్న అలోచన కూడా చేశారు. తన ఆలోచనను వివరింపగా, ససేమిరా అంగీకరించలేదు. బంధువుల సహకారంతో [[మద్రాస్ వైద్య కళాశాల|మద్రాసు మెడికల్ కాలేజీ]] ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్ లో పాసయిన ఈయనను చేర్చిందింది. ఈ ఘటన చరిత్ర గతిని మార్చివేసింది.