మహా జనపదాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎మగధ: +మల్ల
→‎మల్ల: +రెండు జనపదాలు
పంక్తి 145:
[[దస్త్రం:War_over_the_Buddha's_Relics,_South_Gate,_Stupa_no._1,_Sanchi.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:War_over_the_Buddha's_Relics,_South_Gate,_Stupa_no._1,_Sanchi.jpg|center|thumb|800x800px|<center>మల్లులు తమ నగరం [[కుసినార|కుశినగర]]<nowiki/>ను రక్షించుకుంటున్న చిత్రం, సాంచి. మల్ల ఒక పురాతన భారతీయ రిపబ్లిక్ (గణ సంఘ) అంగూత్తర ''నికాయలో'' ప్రస్తావించబడింది. <ref>Asiatic Mythology by J. Hackin [https://books.google.com/books?id=HAZrFhvqnTkC&pg=PA83 p.83ff]</ref></center>]]
 
=== మత్స్య దేశం ===
[[మత్స్యావతారము|మత్స్య]] దేశం కురు రాజ్యానికి దక్షిణాన, యమునకు పశ్చిమాన ఉంటుంది. పాంచాలకు మత్స్య రాజ్యనికీ మధ్య యమునానది ఉంది. సుమారుగా [[రాజస్థాన్]] లోని పూర్వ [[జైపూర్]] రాష్ట్రం ఉన్న ప్రాంతం, భరత్‌పూర్ లోని కొన్ని భాగాలతో, అల్వార్ మొత్తమంత కలిపిన ప్రాంతమే ఈ రాజ్యం. మత్స్య రాజధాని ''విరాటనగర'' (ఆధునిక బైరత్) వద్ద ఉంది. ఈ నగర వ్యవస్థాపక రాజు విరాటుడి పేరే దీనికి పెట్టారు. [[పాళీ భాష|పాళీ]] సాహిత్యంలో, మత్స్యులు సాధారణంగా సూరసేనులతో సంబంధం కలిగి ఉంటారు. పశ్చిమ మత్స్య చంబల్ నదికి ఉత్తర ఒడ్డున ఉన్న కొండ ప్రాంతం. మత్స్య రాజ్యపు శాఖ ఒకటి తరువాతి రోజులలో [[విశాఖపట్నం]] ప్రాంతంలో కూడా కనిపిస్తుంది. బుద్ధుని కాలంలో మత్స్యులకు తమకంటూ రాజకీయ ప్రాముఖ్యత లేదు. సుజాత రాజు ఛేది, మత్స్యలు రెండింటినీ పరిపాలించాడు. తద్వారా మత్స్య ఒకప్పుడు ఛేది రాజ్యంలో భాగమని తెలుస్తోంది.
 
=== పాంచాల ===
[[దస్త్రం:Panchalas_of_Adhichhatra.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Panchalas_of_Adhichhatra.jpg|కుడి|thumb|200x200px|అహిచ్ఛత్ర పాంచాలుల నాణెం (క్రీ.పూ. 75-50). [[ఇంద్రుడు]] పీఠంపై ఎదురుగా కూర్చుని, విభజించబడిన వస్తువును పట్టుకున్నాడు. [[బ్రాహ్మీ లిపి|బ్రహ్మి]], పంచల చిహ్నాలలో ''ఇద్రమిత్ర''. ]]
పాంచాలులు కురు రాజ్యానికి తూర్పున, పర్వతాలకూ గంగా నదికీ మధ్య దేశాన్ని పాలించారు. సుమారు ఆధునిక బుదౌన్, ఫరూఖాబాద్, వాటికి ఆనుకుని ఉన్న [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్]] జిల్లాల ప్రాంతమే పంచాల రాజ్యం. దేశాన్ని ఉత్తరా-పాంచాల మరియు దక్షిణ-పాంచాలగా విభజించారు. ఉత్తర పాంచాల రాజధాని అధిచ్ఛత్ర లేదా ఛత్రావతి ([[బరేలి|బరేలీ]] జిల్లాలో ఆధునిక రామ్‌నగర్), దక్షిణ '''పాంచాల''' రాజధాని ఫరూఖాబాద్ జిల్లాలోని కాంపిల్య లేదా కాంపిల్ వద్ద ఉంది. ప్రసిద్ధ నగరం కన్యాకుబ్జ లేదా కనౌజ్ పాంచాల రాజ్యంలో ఉంది. రాచరిక వంశీకులైన పాంచాలులు క్రీస్తుపూర్వం 6 , 5 శతాబ్దాలలో గణతంత్రానికి మారినట్లు తెలుస్తోంది. క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో, [[చాణక్యుడు|కౌటిల్యుడి]] అర్ధశాస్త్రం కూడా ''రాజశబ్దోప జీవిన్'' (కింగ్ కాన్సుల్) రాజ్యాంగాన్ని అనుసరించి ''పాంచాలను'' ధృవీకరిస్తుంది. 
 
=== శూరసేన ===
[[దస్త్రం:First_coin_of_India.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:First_coin_of_India.jpg|కుడి|thumb|180x180px|శూరసేన మహాజనపదానికి (క్రీ.పూ. 5 వ శతాబ్దం) చెందిన వెండి నాణెం. ]]
శూరసేన దేశం మత్స్యదేశానికి తూర్పున, [[యమునా నది|యమునా]] నదికి పశ్చిమాన ఉంది. ఇది ఉత్తర ప్రదేశ్, [[హర్యాణా|హర్యానా]], [[రాజస్థాన్]] రాష్ట్రాల్లోని బ్రిజ్ ప్రాంతానికి,[[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]] లోని [[గ్వాలియర్]] ప్రాంతానికీ కలిపి సుమారుగా సరిపోతుంది. దీనికి రాజధాని మధుర లేదా [[మథుర]] వద్ద ఉంది. బుద్ధుని ముఖ్య శిష్యులలో శూరసేన రాజైన అవంతీపుత్ర మొదటివాడు. అతని వల్లనే మధుర రాజ్యంలో [[బౌద్ధ మతము|బౌద్ధమతం]] పుంజుకుంది. మధుర / శూరసేన లకు చెందిన అంధకులు, వృృష్ణులను పాణిని యొక్క [[పాణిని|అష్టాధ్యాయిలో]] సూచించాడు. [[చాణక్యుడు|కౌటిల్యుడి]] [[ అర్థశాస్త్ర|అర్థశాస్త్రంలో]], వృష్ణులను ''సంఘ'' లేదా గణతంత్రంగా వర్ణించాడు. వృృష్ణులు, అంధకులు, యాదవులకు చెందిన ఇతర అనుబంధ తెగలు ఒక ''సంఘాన్ని'' ఏర్పాటు చేశాయి, వాసుదేవ ([[శ్రీ కృష్ణుడు|కృష్ణ]]) ను ''సంఘ-ముఖ్యుడిగా'' వర్ణించారు. శూరసేనకు రాజధాని మథుర, [[మెగస్తనీసు|మెగస్థనీస్]] కృష్ణుని ఆరాధనకు కేంద్రంగా ఉండేది. మగధ సామ్రాజ్యం స్వాధీనం చేసుకోవడంతో శూరసేన రాజ్యం స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది.
<br />
==ఇవీ చూడండి==
*[[:en:Iron Age India|ఇనుప యుగ భారతదేశం]]
"https://te.wikipedia.org/wiki/మహా_జనపదాలు" నుండి వెలికితీశారు