మహా జనపదాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎మల్ల: +రెండు జనపదాలు
→‎మహాజనపదాల జాబితా: మిగతా జనపదాల చేర్పు
పంక్తి 154:
=== శూరసేన ===
[[దస్త్రం:First_coin_of_India.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:First_coin_of_India.jpg|కుడి|thumb|180x180px|శూరసేన మహాజనపదానికి (క్రీ.పూ. 5 వ శతాబ్దం) చెందిన వెండి నాణెం. ]]
శూరసేన దేశం మత్స్యదేశానికి తూర్పున, [[యమునా నది|యమునా]] నదికి పశ్చిమాన ఉంది. ఇది ఉత్తర ప్రదేశ్, [[హర్యాణా|హర్యానా]], [[రాజస్థాన్]] రాష్ట్రాల్లోని బ్రిజ్ ప్రాంతానికి,[[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]] లోని [[గ్వాలియర్]] ప్రాంతానికీ కలిపి సుమారుగా సరిపోతుంది. దీనికి రాజధాని మధుర లేదా [[మథుర]] వద్ద ఉంది. బుద్ధుని ముఖ్య శిష్యులలో శూరసేన రాజైన అవంతీపుత్ర మొదటివాడు. అతని వల్లనే మధుర రాజ్యంలో [[బౌద్ధ మతము|బౌద్ధమతం]] పుంజుకుంది. మధుర / శూరసేన లకు చెందిన అంధకులు, వృృష్ణులను పాణిని యొక్క [[పాణిని|అష్టాధ్యాయిలో]] సూచించాడు. [[చాణక్యుడు|కౌటిల్యుడి]] [[ అర్థశాస్త్ర|అర్థశాస్త్రంలో]], వృష్ణులను ''సంఘ'' లేదా గణతంత్రంగా వర్ణించాడు. వృృష్ణులు, అంధకులు, యాదవులకు చెందిన ఇతర అనుబంధ తెగలు ఒక ''సంఘాన్ని'' ఏర్పాటు చేశాయి, వాసుదేవ ([[శ్రీ కృష్ణుడు|కృష్ణ]]) ను ''సంఘ-ముఖ్యుడిగా'' వర్ణించారు. శూరసేనకు రాజధాని మథుర, [[మెగస్తనీసు|మెగస్థనీస్]] కృష్ణుని ఆరాధనకు కేంద్రంగా ఉండేది. మగధ సామ్రాజ్యం స్వాధీనం చేసుకోవడంతో శూరసేన రాజ్యం స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది.
 
<br />
=== వజ్జి ===
[[దస్త్రం:Anandastupa.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Anandastupa.jpg|కుడి|thumb|250x250px|''[[లిచ్చావి (వంశం)|లిచ్ఛవులు]]'' వైశాలి వద్ద నిర్మించిన ఆనంద స్థూపం. వైశాలి వజ్జి [[రాజధాని]]. ప్రపంచంలోని మొట్టమొదటి ఒకటి గణతంత్రాల్లో ఒకటి ]]
'''వజ్జీ''' లేదా '''వృజ్జి''' మహాజనపదాల్లో ఒకటి. పొరుగున ఉన్న లిచ్ఛవుల వటి ఇతర జాతులతో కలిసి సమాఖ్య గా ఏర్పడింది.వారు పాలించిన ప్రాంతం ఉత్తర [[బీహార్|బీహార్‌లోని]] మిథిల ప్రాంతం. వారి రాజధాని [[ వైశాలి (పురాతన నగరం)|వైశాలి]] నగరం. <ref>{{వెబ్ మూలము|url=https://books.google.co.uk/books?id=efaOR_-YsIcC&pg=PA15&dq=vajji+mithila&hl=en&sa=X&ved=0ahUKEwj3lua2-ZbQAhUnJ8AKHdbYBJIQ6AEIIDAB|title=Between the Empires: Society in India 300 BCE to 400 CE|first=Patrick|last=Olivelle|date=13 July 2006|publisher=Oxford University Press}}</ref>
 
బౌద్ధ గ్రంథం ''అంగుత్తర నికాయ,'' జైన గ్రంథం ''భగవతి సూత్ర'' ''(సాయా'' XV ''ఉద్దేశ'' I) రెండింటి లోనూ చూపిన షోడశ మహాజనపదాల్లో వజ్జి ఉంది. <ref>Raychaudhuri Hemchandra (1972), ''Political History of Ancient India'', Calcutta: University of Calcutta, pp. 85–6</ref> ఈ మహాజనపద పేరు దాని పాలక వంశాలలో ఒకటైన వృజ్‌ల నుండి వచ్చింది. వజ్జీ రాజ్యం గణతంత్రం అని చెప్పబడింది. ఈ వంశాన్ని [[పాణిని]], [[చాణక్యుడు|చాణక్య]], [[యుఁఆన్‌ చ్వాంగ్‌|జువాన్జాంగ్‌]] లు ప్రస్తావించారు. <ref>Raychaudhuri Hemchandra (1972), ''Political History of Ancient India'', Calcutta: University of Calcutta, p.107</ref>
 
=== వత్స లేదా వంశ ===
వత్స లేదా వంస ను కురు ల్లోనే ఒక శాఖగా భావిస్తారు. వత్స దేశం [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్‌లోని]] ఆధునిక [[అలహాబాదు|అలహాబాద్]] భూభాగమే. కౌశాంబి దీని రాజధాని. ([[అలహాబాదు|అలహాబాద్]] నుండి 38 మైళ్ళ దూరంలో ఉన్న కోసం గ్రామం అని గుర్తించారు). <ref>{{Cite news|url=http://www.dailynews.lk/2007/12/05/fea06.asp|title=The Ghositarama of Kaushambi|last=Rohan L. Jayetilleke|date=2007-12-05|access-date=2008-10-29|url-status=dead|archive-url=https://web.archive.org/web/20110604160714/http://www.dailynews.lk/2007/12/05/fea06.asp|archive-date=4 June 2011|publisher=[[Daily News (Sri Lanka)|Daily News]]}}</ref> ఇక్కడ రాచరిక ప్రభుత్వ వ్యవస్థ ఉండేది. కౌశాంబి చాలా సంపన్నమైన నగరం. ఇక్కడ పెద్ద సంఖ్యలో సంపన్న వ్యాపారులు నివసించేవారు. ఇది వాయవ్య, దక్షిణ ప్రాంతాల నుండి వచ్చే వస్తువులు, ప్రయాణీకులకు అతి ముఖ్యమైన స్థానం. క్రీస్తుపూర్వం 6 వ -5 వ శతాబ్దంలో ఉదయనుడు [[వత్స|వత్సకు]] పాలకుడు. అతను చాలా శక్తివంతమైనవాడు, యోధుడు. వేటను ఇష్టపడ్డాడు. ప్రారంభంలో ఉదయనుడు [[బౌద్ధ మతము|బౌద్ధమతాన్ని]] వ్యతిరేకించాడు. కాని తరువాత బుద్ధుని అనుచరుడు అయ్యాడు. బౌద్ధమతాన్ని రాజ్య అధికారిక మతంగా మార్చాడు. ఉదయనుడి తల్లి, రాణి మృగవతి, భారత చరిత్రలో తొలి మహిళా పాలకులలో ఒకరు.
[[null|link=|కుడి|thumb]]
{{Clear}}
 
==ఇవీ చూడండి==
*[[:en:Iron Age India|ఇనుప యుగ భారతదేశం]]
"https://te.wikipedia.org/wiki/మహా_జనపదాలు" నుండి వెలికితీశారు