కోడూరి లీలావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==జీవిత విశేషాలు==
ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1919 సెప్టెంబరు 19న దేవత శ్రీరామమూర్తి, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. తండ్రి నుంచి జాతీయోద్యమ పోరాటం, కళాభిరుచి ఆమెకు వారసత్వంగా సంక్రమించాయి. గృహిణిగా కుటుంబాన్ని ఉన్నతంగా దిద్దుకుంటూనే సంగీత, సాహిత్యాలకు అంకితమయ్యారు.
 
== రచనా ప్రస్థానం ==
1958లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన బాలసాహిత్య పోటీలలో ఆమె రచించిన నాటికల సంపుటి ‘బాలవినోదిని’ బహుమతికి ఎంపికైంది. అప్పటికే ఆమె బాలసాహిత్యంలో రచయిత్రిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 1961లో రవీంద్రనాథ్ ఠాగూర్ శతజయంతి ఉత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన బాల సాహిత్య పోటీలలో ఆమె కుమారుడు శ్రీరామమూర్తితో కలసి సంయుక్తంగా రచించిన "రవికవి" కు బహుమతి వచ్చింది. 1968, 1969, 1970లలో వరుసగా మూడేళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలసాహిత్య విభాగపోటీలలో ఆమె రచనలు ''బాలచంద్రిక'' (బాలలనాటికల సంపుటి), ''ఆశాకిరణం'' (బాలలనవల), ‘కుంకుమరేఖ’ (కస్తూరిబా గాంధీ జీవిత విశేషాల ఆధారంగా రూపొందిన రచన) లు బహుమతులను సాధించుకున్నాయి. 1981లో పదేళ్ళ విరామానంతరం ‘సరోజినీనాయుడు’ జీవితగాథ భూమికగా రచించిన ‘ఇంద్రధనుస్సు’ అనే గ్రంథానికి బహుమతి లభించింది. వీటిలో ‘కుంకుమరేఖ’, ‘ఇంద్రధనుస్సు’ రచనలు రెండూ సాహిత్య అకాడమీ అవార్డులు సాధించిపెట్టాయి. ‘కుంకుమరేఖ’ ఇప్పటికి మూడు ముద్రణలుగా వచ్చింది. 1970లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ‘కుంకుమరేఖ’ను ధారావాహికంగా ప్రచురించింది.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-907392|website=www.andhrajyothy.com|access-date=2020-04-28}}</ref>
 
 
==రచనలు==
* కుంకుమరేఖ
Line 18 ⟶ 24:
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}{{Authority control}}
 
[[వర్గం:గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/కోడూరి_లీలావతి" నుండి వెలికితీశారు