"మౌస్" కూర్పుల మధ్య తేడాలు

1,061 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
[[File:3-Tasten-Maus Microsoft.jpg|thumb|లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్క్రోల్ వీల్ (చక్రం) అనే మూడు బటన్లు కలిగివున్న కంప్యూటర్ మౌస్.]]
[[File:3-Tasten-Maus Microsoft.jpg|thumb|A computer mouse with the most common standard features: two buttons and a scroll wheel, which can also act as a third button.]]
[[కంప్యూటరు]]లో ఒకరకమయిన ఇన్పుట్ సాధనము '''మౌస్'''. [[విండోస్]] ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేసేటప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా పనులు సులభంగా, కమాండులు టైపు చేయనవసరం లేకుండా చేయవచ్చును. కంప్యూటర్ యొక్క పరికరాలలో ముఖ్యమైనది మౌస్. దీనిని చేతితో అటు, ఇటు తిప్పుతూ దానికి ఉన్న బటన్లను నొక్కుతూ దీనిని ఉపయోగిస్తారు. దీనికి సాధారణంగా లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్క్రోల్ వీల్ (చక్రం) అనే మూడు బటన్లు ఉంటాయి. పిఎస్2 మౌస్ ను సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఉపయోగిస్తారు, ఇది వైరు ద్వారా కంప్యూటర్‌కి కనెక్ట్ చేయబడుతుంది. [[యుఎస్‌బి]] మౌస్ ను సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో, ల్యాప్‌టాప్‌‌లలో ఉపయోగిస్తారు, ఇది వైరు ద్వారా కంప్యూటర్‌కి కనెక్ట్ చేయబడుతుంది. వైర్‌లెస్ మౌస్ సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో, ల్యాప్‌టాప్‌‌లలో, కొత్త టి.విలలో ఉపయోగిస్తారు, దీనికి వైరు ఉండదు, కాబట్టి దీనిని వైర్ లెస్ మౌస్ అంటారు. వైర్ లెస్ మౌస్‌కు బ్యాటరీ సెల్స్ వేయాల్సివుంటుంది.
 
మౌస్‌కి అడుగు భాగాన బంతి వంటిది, లేదా లైట్ వుంటుంది. బంతి వంటిది మనం మౌస్‌ను మౌస్ ప్యాడ్‌కి లేదా ఏదైనా ఉపరితలానికి ఆనించి కదలించినప్పుడు బంతి కూడా తిరుగుతుంది, తద్వారా కంప్యూటర్ తెరపై కర్సర్ కదులుతుంది. అలాగే లైట్ కూడా మనం మౌస్‌ను మౌస్ ప్యాడ్‌కి లేదా ఏదైనా ఉపరితలానికి ఆనించి కదలించినప్పుడు ఆ లైట్ ఇచ్చే సంకేతాల ద్వారా కంప్యూటర్ తెరపై కర్సర్ కదులుతుంది.
 
మౌస్‌ను కదిలించినప్పుడు కంప్యూటర్ తెరపై బాణం గుర్తు కదులుతుంటుంది, ఈ గుర్తును కర్సర్ అంటారు. కంప్యూటర్ తెరపై కర్సర్ ఉన్న స్థానాన్ని బట్టి బటన్లు నొక్కడం ద్వారా కంప్యూటర్‌ను ఆపరేట్ చేయవచ్చు. కంప్యూటర్ కీబోర్డు లోని కీలను కూడా ఆన్ స్క్రీన్ కంప్యూటర్ కీబోర్డు ద్వారా మౌస్ తో ఉపయోగించవచ్చు.
32,620

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2925650" నుండి వెలికితీశారు