"తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
భాషా శాస్త్రకారులు తెలుగును [[ద్రావిడ భాషలు|ద్రావిడ భాషా వర్గము]]<nowiki/>నకు చెందినదిగా వర్గీకరించారు<ref>{{Cite web |url=http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx |title=తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం |website= |access-date=2010-10-12 |archive-url=https://web.archive.org/web/20101029124329/http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx |archive-date=2010-10-29 |url-status=dead }}</ref>. అనగా తెలుగు – [[హిందీ భాష|హిందీ]], [[సంస్కృత భాష|సంస్కృతము]], [[లాటిన్|లాటిను]], [[గ్రీక్ భాష|గ్రీకు]] మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషా వర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, [[కన్నడ భాష|కన్నడము]], [[మలయాళ భాష|మలయాళము]], తోడ, [[తుళు]], [[బ్రహుయి|బ్రహూయి]] మొదలైన భాషలతో పాటుగా ద్రవిడ భాషా వర్గమునకు చెందినదని భాషా శాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో పాటు కుయి, [[కోయ]], కొలామి కూడా ఉన్నాయి<ref name="BKrishnamurthi2003">Krishnamurti, Bhadriraju (2003), The Dravidian Languages Cambridge University Press, Cambridge. ISBN 0-521-77111-0</ref>.
 
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడద్రవిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. నాటి [[సింధు లోయ నాగరికత]] నివాసులు ద్రవిడ జాతికి సంబంధించినవారే<ref>https://www.ncbi.nlm.nih.gov/m/pubmed/31495572/</ref> అన్న కారణంగా వారి భాష కూడా ద్రవిడభాషే, లేదా ద్రవిడభాషలకు సంబంధించినదే అయివుంటుందని వారి నమ్మకం. కానీ వారి లిపిని అర్ధం చేసుకునే ముందే ఇది నిజమా కాదా అని కచ్చితంగా తేల్చడం అసంభవం.
 
== '''చరిత్ర''' ==
278

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2927030" నుండి వెలికితీశారు