"పేరిస్" కూర్పుల మధ్య తేడాలు

(Created page with '==పేరిస్ - గ్రీసు దేశపు పురాణ గాథలు== గ్రీసు దేశపు పురాణ గాధలల...')
 
గ్రీసు దేశపు పురాణ గాధలలో ఒక కథ ఇది. ప్రస్తుతం టర్కీ దేశం ఆక్రమించిన ప్రాంతాన్ని పూర్వం ఏసియా మైనర్ అనేవారు. ఈ ప్రాంతపు ఈశాన్య మూలకి ట్రోయ్ అనే నగరం ఉండేది. గర్భవతిగా ఉన్న ఈ నగరపు రాణి హెకూబా ఒక రాత్రి ఒక వింతైన జ్వాలని ప్రసవించినట్లు కలని కన్నది. రాజు ఆస్థాన జ్యోతిష్కుడిని పిలిపించి కలకి అర్థం చెప్పమని అడిగేరు.
 
“రాజా! రాణి వారు ప్రసవించబోయే బాలుడు [[ట్రోయ్]] నగరపు వినాశనానికి కారకుడు అవుతాడు! ఈ రాజ్యాన్ని, ప్రజలని రక్షించుకోవాలంటే ఈ బాలుడిని హతమార్చవలసిందే” అని జోశ్యంతో పాటు సలహా కూడా చెప్పేడు.
 
భూపతనమైన వెంటనే బాలుడిని హతమార్చమని భటుడికి ఆదేశం ఇచ్చేడు రాజు. ముక్కుపచ్చలారని పసికందు ప్రాణాలు తియ్యలేక భటుడు ఆ పసికూనని ఇడా పర్వతం మీద ఒక చెట్టు కింద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పసి కందుని ఒక ఎలుగుబంటి చూసింది. పాపని చూసి, జాలిపడిందో ఏమో రాత్రల్లా కాపలా కాసింది. మరునాడు బాలుడు ఏమయ్యాడో చూద్దామని భటుడు తిరిగి వచ్చేడు. ఆ బాలుడు ప్రాణాలతో కనిపించేసరికి “ఈ బాలుడు భవిష్యత్తులో ఏదో సాధించవలసి ఉంది. అందుకనే ప్రాణాలతో బయట పడ్డాడు” అనుకుంటూ ఆ పసివాడిని రహస్యంగా తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నాడు. శుక్లపక్ష చంద్రుడిలా పెరిగిన పేరిస్ (Paris) స్ఫురద్రూపి, సత్యసంధుడు, శీలవంతుడుగా ముల్లోకాలలోను పేరు తెచ్చుకున్నాడు.
 
పందేలలో పోటీకని పేరిస్ కోడె దూడలని పెంచేవాడు. పందెంలో తన గిత్తని ఎవ్వరి గిత్త ఓడగొడితే వారికి బంగారు కిరీటం బహుమానంగా ఇస్తానని పేరిస్ ఒక సారి సవాలు విసిరేడు. స్వర్గలోకంలో ఉన్న ఆరిస్ (Ares) ఈ సవాలు విన్నాడు. తానే స్వయంగా ఒక గిత్త రూపం దాల్చి పోటీలోకి దిగేడు. యుద్ధాలకి అధినేత అయిన ఆరిస్ ఈ పోటీని అనాయాసంగా గెలిచేడు. పేరిస్ పెద్దమనిషి తరహాలో ఓటమిని అంగీకరించి ఆరిస్ కి బంగారు కిరీటాన్ని బహూకరించేడు. ఈ సంఘటనతో “సత్యసంధుడు, మాట తప్పని పెద్దమనిషి” అని పేరిస్ భూమి మీద, స్వర్గంలోనూ పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నాడు. ఇలాంటి పేరు రావడంతో ఒక అనూహ్యమైన పందేనికి పేరిస్ ఎలా న్యాయనిర్ణేత అయేడో చూద్దాం.
 
==అపస్వరం అనే ఏపిల్ పండు కథ==
స్వర్గానికి అధినేత [[జూస్]] భార్యలలో ఒకరైన థేమిస్ (Themis) జూస్ కొడుకులలో ఒకడు జూస్ ని పదవీభ్రష్టుడిని చేస్తాడని జోశ్యం చెప్పింది. ఈ జోశ్యం ఇలా ఉండగా జూస్ ఒక రోజు సముద్రపుటొడ్డుకి విహారానికని వెళ్లి, అక్కడ తేటిస్ (Thetis) అనే జలకన్యని చూసి, మనసు పడి, గాంధర్వ విధిని పెళ్లి చేసుకుంటానంటాడు. అప్పుడు తేటిస్ కి పుట్టబోయే కొడుకు తండ్రిని మించిన వాడు అవుతాడు అని మరొకరు జోశ్యం చెప్పేరు. జూస్ రెండు రెండు కలిపితే నాలుగు అని లెక్క వేసుకుని, పెద్ద ఎత్తున కంగారు పడి, తేటిస్ ని పీలియస్ అనే ముసలి మానవుడికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి తాంబూలాలు ఇప్పించేసేడు. విందుకి జూస్ అందరినీ ఆహ్వానించేడు - కలహభోజని అని పేరు తెచ్చుకున్న ఒక్క ఏరీస్ (Eris) ని తప్ప!
7,887

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2927110" నుండి వెలికితీశారు