వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి చే
పంక్తి 54:
2011 లో యువజన శ్రామిక రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయించినపుడు దాని వలన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుందని తీవ్రంగా విభేదించి దీక్షలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి [[నారా చంద్రబాబునాయుడు]] అధ్యక్షుడిగా ఉన్న [[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]] పార్టీ చేతిలో అతిస్వల్ప ఓట్ల శాతం (1.25) తో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
 
రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేకహోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి, ప్రజలలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పిస్తు వచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో 2017-11-16 లో ఇడుపలపాయ నుండి 2019-01-09 లో ఇచ్ఛాపురం వరకు 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చెసిచేసి రాష్ట్ర ప్రజలకు దగ్గర అయ్యారు.
 
ప్రత్యేకహోదా సాధించాలనే తపనతో, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీలచేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారిచేత ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశారు. తాను చేసే ప్రత్యేకహోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి.