వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వై.ఎస్.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
==రాజకీయ జీవితం==
కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి [[1980]]-[[1983|83]] కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించాడు. [[కడప లోక్‌సభ నియోజకవర్గం]] నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. [[పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర [[శాసనసభ ప్రతిపక్షనేత]]గానూ గా, రెండు సార్లు [[రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ]] అధ్యక్షుడిగానూ పనిచేశాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. తెలుగు దేశం నేత [[నారా చంద్రబాబు నాయుడు]] మొదటగా కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇరువురూ మంచి మిత్రులు.
1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. [[మర్రి చెన్నారెడ్డి]], [[నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి]], [[కోట్ల విజయ భాస్కర్ రెడ్డి]] వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపాడు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్ధన్‌రెడ్డిని పదవినుండి తొలగించడానికి ప్రధాన కారణమైన [[హైదరాబాదు]] నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు.<ref>[http://books.google.com/books?id=rm-9tnW3FTwC&pg=PA2638&dq=yeduguri#v=onepage&q=yeduguri&f=false Encyclopaedia of India, Pakistan and Bangladesh] By Om Gupta పేజీ.2638</ref>