లూయీ పాశ్చర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
== జీవితచరిత్ర ==
పాశ్చర్ [[1822]] సంవత్సరం [[డిసెంబరు 27]]న [[ఫ్రాన్స్]] లోని [[డోల్]] గ్రామంలో జన్మించాడు. [[నెపోలియన్]] సైన్యంలో పనిచేసిన తండ్రి [[జీన్ పాశ్చర్]] తోలు వ్యాపారం చేసి జీవించేవారు. పాశ్చర్ పాఠశాలకు వెళ్ళకుండా కొంతవరకు విద్యావంతుడయ్యాడు. [[చిత్రలేఖనం]]లో మంచి ప్రతిభ కనపరిచేవాడు. తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారివి, స్నేహితులవి బొమ్మలు పెయింట్ చేశాడు. చాలా చిత్రాలు ఇప్పటికీ [[పాశ్చర్ మ్యూజియం]]లో భద్రపరచబడ్డాయి. గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రాలంటే ఇష్టమున్న పాశ్చర్ ఉపాధ్యాయ జీవితాన్ని గడపాలనుకొనేవాడు. పదహారేళ్ల వయసులో కాలేజీ చదువు కోసం పారిస్ లో అడుగుపెట్టాడు. డాక్టరేట్ పూర్తిచేసి 1848లో స్ట్రాస్ బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ఛాన్స్లర్ కు వారి అమ్మాయి మేరీ లారెంట్ ను పెళ్ళిచేసుకుంటానని అనుమతికోసం లేఖ రాశాడు. 1849 మే 29న వీరిద్దరు పెళ్ళిచేసుకున్నారు. ఆదర్శదంపతుల్లాగా జీవించారు. వీరికి అయిదుగురు పిల్లలు పుట్టినా ముగ్గురు మరణించారు; [[టైఫాయిడ్]] వల్ల ఇద్దరు, [[మశూచి]] వల్ల ఒకరు పిల్లల్ని పోగొట్టుకొన్నాడు.
 
== శాస్త్ర పరిశోధన ==
"https://te.wikipedia.org/wiki/లూయీ_పాశ్చర్" నుండి వెలికితీశారు