తుంగభద్ర (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== కథా నేపథ్యం ==
తాడికొండ – కర్లపూడి గ్రామాలలోని ఎమ్మెల్యే అభ్యర్థులు పైడితల్లి (కోట శ్రీనివాసరావు) – శివరామకృష్ణ (శివరామకృష్ణ). శివరామకృష్ణ అనుచరుడైన రామరాజు (సత్యరాజ్) కోట అనుచరుడైన త్రిమూర్తులు (చలపతిరావు)ను చంపేయడంతో శివరామకృష్ణ ఎమ్మెల్యే అవుతాడు. పవర్ లేకపోవడంతో కోట మరియ్యు త్రిమూర్తుల ముగ్గురు వారసులు రామరాజుపై పగ తీర్చుకోవడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తుంటారు.
 
ఇలా కొద్ది సంవత్సరాలు గడిచాక.. రామరాజు అందరికన్నా ఎక్కువగా నమ్మే శ్రీను (అదిత్ అరుణ్)కి తన కూతురు గౌరీ (డింపుల్ చోపడే) వెంట ఎవరో పడుతున్నాడని, వాడి గురించి తెలుసుకొని అవసరమైతే ఫినిష్ చెయ్యమని చెప్తాడు. ఇదే టైంలో శ్రీను – గౌరీల మధ్య ప్రేమ మొదలవుతుంది. ఈ ప్రేమ వల్ల రామరాజు ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయి. అదే టైంలో రామరాజు పార్టీ ఎలక్షన్స్ లో ఓడిపోతుంది. మళ్ళీ పవర్ లోకి వచ్చిన కోట మరియు త్రిమూర్తుల వారసులు రామరాజుని ఏం చేసారు, శ్రీను – గౌరీల ప్రేమకథలో ఏం జరిగిందనేది మిగతా కథ.
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర_(2015_సినిమా)" నుండి వెలికితీశారు