జగదేకవీరుడు అతిలోకసుందరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 34:
సినిమా హిట్‌ కావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.... ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా చూడాల్సిందే.
ముఖ్యంగా సోషియో ఫాంటసీలకి రాఘవేంద్రరావు మార్కు సినిమా ఇది. చిత్రం ప్రారంభంలోనే ముద్దులొలికే బేబీ షామిలిని చిరంజీవి భుజాలపైకి ఎత్తుకొన్నప్పుడే ఈ సినిమా పిల్లలకు నచ్చే విధంగా రూపొందించినట్లు అర్థమైపోతుంది. కామెడీ ట్రాక్‌ని కథలో భాగంగా చేయడం, చిన్న విలన్ల గుంపుని ఒకేసారి కాకుండా నెమ్మదిగా ఒక్కొక్కరినీ కలుపుతూ అమ్రిష్‌ పురి లాంటి మాంత్రికుడు, మెయిన్‌ విలన్‌కి కలపడం, సీన్‌కి సీన్‌కీ లింక్‌ వేయడంలో....స్కీన్ర్‌ ప్లేకి ఒక మంచి అవగాహన వర్ధమాన దర్శకులకి కలిగించే పాఠం ఈ సినిమా. ఇక జగదేకవీరుడు అంటే చిరంజీవి చేసే సాహసాలు, ఆయన అల్లు రామలింగయ్యతో చేసే చమత్కారాలు ఇందులో చూడాల్సిందే. ఇక శ్రీదేవి నిజంగా దేవలోకం నుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది. ఆమె అచ్చమైన సంస్కృత భాషలో ‘మానవ..ఓ మానవా..’’అంటూ పిలిచే మాటలు చాలా చక్కగా ఉంటాయి. చక్కటి పాటలు, జంధ్యాల మార్కు మాటలు, ఇళయరాజా నేపధ్య సంగీతం, ఇలా అన్నీ ఏంటో అలా కుదిరిపోతాయంతే మరి! ఇప్పటి తరం పిల్లలకు వేసవి సెలవుల్లో లేదా మరో ఆదివారం ఈ సినిమా చూపండి.
 
 
ఇందులో చిరంజీవి హీరో అయినా కథ శ్రీదేవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె పడే కష్టాల్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండడమే చిరు పని!
 
సీన్ కి సీన్ కీ లింకింగ్ చాలా చక్కగా ఉంటుంది!
పాప కాలు ప్రమాదవశాత్తు విరిగితే,అవసరం అయితే ఆ దేవ లోకాన్ని కిందకి దించయినా సరే
పాపకి నయం చేయిస్తానని అనడం తోటే ,ఇంద్రలోకం చూపడం,కాలు విరిగితే,మూలికా వైద్యం తో అది నయం చేయవచ్చని ఓ ఋషి సూచించడం,అక్కడికి దేవకన్యలు రావడం,ఉంగరం పడిపోయి, హీరో కి చిక్కడం... ఇవన్నీ...చాలా వేగంగా స్క్రీన్ ప్లే లో ఫ్లో లో వెళ్తుంటే ఒక్కొక్క విలన్ నీ వేర్వేరు సందర్భాల్లో ఎదిరించి, వాళ్లందరికీ లింక్ వేయడం బాగుంటుంది.
 
==సంభాషణలు==