మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
→‎రచనలు:: ఇప్పటివరకు కొత్తగా రచయిత రాసిన రచనలు చేర్చడం .. బయటి లింకులను.. వికీ లో ఉన్న పేజీ లింకు బాలీవుడ్ క్లాసిక్స్ అనుసంధానం
పంక్తి 46:
 
==రచనలు:==
[[File:Phuppujaan kathalu.jpg|thumb|ఖదీర్ బాబు సంకలనం చేసిన పిల్లల కథల పుస్తకం-ఫుప్పుజాన్ కతలు|link=Special:FilePath/Phuppujaan_kathalu.jpg]]
*మొదటి కథ ' పుష్పగుచ్ఛం' ను 1995 లో వ్రాసారు.
*దర్గామిట్ట కతలు (1 edition - first published in 1999 )
*నూరేళ్ల తెలుగు కథ (1 edition - first published in 2001)
*పోలేరమ్మబండ కతలు (1 edition - first published in 2004)
*పప్పుజాన్ కథలు (1 edition - first published in 2004)
*[[బాలీవుడ్ క్లాసిక్స్]] (1 edition - first published in 2010)
*మన్ చాహే గీత్- పాటలు ప్రసిద్దుల పరిచయాలు,
*నూరేళ్ల తెలుగు కథ (1 edition - first published in 2001sep 20011)
*న్యూ బాంబే టైలర్స్ (కథల సంపుటి) (1 edition -published 2012 ఫిబ్రవరి 15)
*బియాండ్ కాఫీ (కథల సంపుటి) (1 edition -published August 2013)
*కథలు ఇలా కూడా వ్రాస్తారు (1 edition -published March 20, 2016)
*[https://www.kahaniya.com/s/zero-bloodమెట్రో కథలు జీరోబ్లడ్] (1 edition - published November 16,ఏప్రిల్ 2016)2018}
 
===దర్గామిట్ట కతలు===
 
Line 70 ⟶ 71:
ఈ పుస్తకం సమీక్షకై ప్రధాన వ్యాసం:''' [[దర్గామిట్ట కతలు]]''' చూడండి.
 
===నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ===
 
ముందొక పిట్ట కథ.
పూర్ణయ్యని బావగాఢంటారు అందరు.
బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరమూ లేదు. పెళ్ళిగాని, పేరంటంగాని వంట హంగంతా బావగాడే. వంటవాళ్లని కూర్చోనిచ్చేవాడు కాదు. నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్లకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడితోపులో చేరారు. [[చాపలు]] పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. [[పేకాట]]<nowiki/>లో మునిగినవారు మరికొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. ‘అందరూ వినండర్రా’ అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. పేకాట మూయించాడు. ‘వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను’ అంటూ లిస్టు చదివాడు. ‘వంకాయ మెంతికారం పెట్టిన [[కూర]], [[అరటికాయ వేపుడు|అరటికాయ]] నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగుపచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడికోరుతో పులిహోర, గుమ్మడి [[వడియాలు]], వూర మిరపకాయలు. అందరికీ సమ్మతమేనా?’ అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం – అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే [[భోజనం]] మీద అందరికీ [[మమకారం]] పెంచాడు. [[జిహ్వ గ్రసని నాడి|జిహ్వ]] గిలగిల్లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అక్కడితో ఆగాడా? ఊహూ. లేత వంకాయలు కోయించుకు తెచ్చి ప్రదర్శనకు పెట్టాడు. ‘[[చుక్క కూర|చుక్కకూర]] కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహ చక్కగా మేళవిస్తుంది’ అని జ్ఞాపకం చేశాడు. [[పులిహోర]] తిరగమోత వెయ్యగానే ఆ ఘుమఘుమలకే జనానికి శరీరమంతా ఆకలే అయ్యేలా చేశాడు. అందర్నీ బంతులుగా కూచోపెట్టి కొసరికొసరి వడ్డించి తినిపించాడు….
 
మహమ్మద్‌ ఖదీర్‌బాబున్నాడే, అచ్చం బావగాడే బావగాడు.ఒక [[కథ]]<nowiki/>ల సంతర్పణ మొదలుపెట్టాడు. రోజుకో కథ అన్నాడు. ‘ఓసంతేకదా, భారతి కాలం నుంచీ ఇలాంటివి ఎన్నో చూశాం’ అని జనాలు ఎవరి గోలలో వాళ్లు పడ్డారు. కొందరు పిచ్చాపాటీ కబుర్లు, కొందరు పేకాటలు, మరికొందరు రాష్ట్ర విభజన రాజకీయాలు. వారం రోజులు తిరిగేసరికల్లా కథల్ని కొత్తకొత్తగా ఖదీర్‌బాబు వండుతున్న కమ్మని వాసన అందరికీ చేరింది. ఇక వేరే చర్చలు ఆగిపోయాయి. సంతర్పణలో బావగాడు చూపెట్టిన వంకాయల మీదే మాటలు నడిచినట్టు ఎక్కడికక్కడ కథల మీదే మాటలు మొదలయ్యాలు.
‘అసలెలా ఎంచుకుంటున్నాడంటావ్‌?’
‘ఏది వరస?’
‘ఏమైనా ఖదీర్‌ [[కథలు]] చెప్పటంలో సిద్దహస్తుడు’
‘ఇంతకీ రేపెవరిదో? ఏ కథ వస్తుందో?’
జనంలో కథల పట్ల [[ఆకలి]] నిలువెత్తయి, తాడి ప్రమాణమయింది. నూరు రోజులు, నూరుగురు కథకులు, నూరు కథలు.
పీవీ నరసింహారావు రాసిన కథలో గొల్ల రామవ్వ ఏం చేసింది?
[[పూసపాటి కృష్ణంరాజు]] చెప్పిన ‘రెండు బంట్లు పోయాయ్‌’ కథెప్పుడైనా చదివారా?
పురాణం సుబ్రమణ్యంశర్మ ‘రాజనీతి’ ఏమిటో తెలుసునా?
గూడూరి సీతారాం ‘లచ్చి’ కాపరాన్ని ఎలా తీర్చిదిద్దారు?
2బీహెచ్‌కే పరుగుల్లో పడినవారికి దాదాహయత్‌ ‘మురళి ఊదే పాపడు’ ఏమయ్యాడో ఎలా తెలుస్తుంది?
‘ధనత్రయోదశి’ కథలో [[భండారు అచ్చమాంబ]] ఇచ్చిన సందేశం ఏదైనా ఉందా?
‘హోగినెకల్‌’ దగ్గర ఉగ్రకావేరి ఏం చేసిందో మహేంద్ర మాటల్లో చదివారా?
[[నెల్లూరి కేశవస్వామి]] ‘యుగాంతం’ అయిపోయిందా, ఇప్పటికీ జరుగుతున్న కథా?
 
ఒక్కమాటలో చెప్పాలంటే వందరోజుల పాటు రోజుకో జీవితపు రుచి. అందుకున్నవాళ్లకి అందుకున్నంత. తెలుగు ప్రజలకు ఖదీరు వడ్డించిన మృష్టాన్న భోజనం. టీవీ సీరియళ్లు తప్ప మరో లోకమెరుగని ఇల్లాళ్లెందరో ఈ కథలున్న పుస్తకాలెక్కడ దొరుకుతాయోనని ఆరా తీశారు. ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని [[హైదరాబాదు]]<nowiki/>లో ఉద్యోగమే పరమావధిగా బతుకుతున్న కుర్రకారంతా తెలుగు కథలింత బావుంటాయా – మరి మాకెవరూ చెప్పలేదేం అనుకున్నారు. సప్త సముద్రాలు దాటి అక్కడెక్కడో ప్రవాస జీవితం గడుపుతున్నవారంతా తెలుగు కథల [[పుస్తకాలు]] కావాలని ఇక్కడికి ఫోన్లూ మెయిళ్లూ కొట్టేరు. ‘రావిశాస్త్రి పోయాక తెలుగు కథలు చదవడం మానేశానండీ’ అని స్పష్టంగా చెప్పిన నడివయసు జనాలంతా మళ్లీ తెలుగు కథ మీద ఇష్టం పెంచుకున్నారు. ‘నా కథ ఎప్పుడు వస్తుందో’ అని రచయితలు ఎదురుచూశారు. తమ కథ వచ్చిన రోజు పాఠకుల ఫోన్లు వెల్లువైపోతుంటే తట్టుకోలేక సంతోషంతో మనసు నిండిపోయి అది కంట నీరుగా ఒలికిపోతుంటే [[చిరునవ్వు]]<nowiki/>తో స్వీకరించినవారున్నారు.
 
పోతే ఒకటే తేడా. బావగాడు వండించి వడ్డించిన తీరుకు జనాలంతే సుష్ఠుగా తిని ఆకుల ముందునుంచి లేవడం కూడా కష్టమైపోయింది, ఖదీరు కథలు చెప్పి ప్రచురించిన జోరు జనాల మీద ఎపిటైజర్లా పనిచేసింది. వాళ్ల ఆకలి సగం తీరి, మరి సగం తీరకుండా ఉండిపోయింది. వంద కథల తర్వాత దినపత్రికలో ఆ ఫీచర్‌ మరిక రాదంటే వాళ్లకి పిచ్చకోపమొచ్చింది. అలాగని కథల [[భోజనం]] ముందు నుంచి లేవలేరు. ‘‘ఏం తెలుగులో ఉన్నవి ఈ నూరు కథలేనా? ఈ నూరుగురు కథకులేనా? మరో వంద చెప్పలేవూ?’’ అని నిలదీశారు. రచయితలకూ కోపమొచ్చింది. ‘‘ఏం తెలుగులో కథలంటే అవేనా? మరో యాభయ్యో వందో వేస్తే నాదీ ఆ జాబితాలో నిలబడకపోదునా?’’ అని చాటుమాటుగా విసుక్కున్నారు. అమరావతి కథల్లో బావగాడి సంతర్పణకీ, ఖదీరుబాబు సంతర్పణకీ ఇదిగో ఇదొక్కటే తేడా.
 
దాన్ని ఖదీరుబాబు ఊహించాడు. అనుభవించాడు. అందుకే వినయంగా ‘‘కొండను అద్దంలో చూపిస్తున్నా’’నని చెప్పేశాడు. ‘‘వందేళ్లలో వచ్చిన వంద సుప్రసిద్ధ కథలను ఏరి, వాటిని క్లుప్తంగా తిప్పి చెప్పిన ప్రయత్నం ఇది. కథను చదివే, కథ మొతాన్ని చదివే, కథను వెతుక్కుని చదివే వీలు లేని అడావిడి రోజుల్లో నూరేళ్ల తెలుగు కథా సాహిత్యాన్ని అలుపు లేకుండా ముగించడానికి వీలుగా చేసిన ప్రయత్నం ఇది. తెలుగు కథకు ఒక కథకుడు ప్రకటించిన కృతజ్ఞత’’ అని చెప్పుకున్నాడు.ఈ వందమంది కథలను నేను ఎంతో సంతోషంగా రాశాను. ఎంతో పరవశిస్తూ రాశాను. ప్రతి కథలోని సంస్కారాన్ని ఎంతగానో స్వీకరిస్తూ రాశాను. ప్రతి రచయితా వదిలివెళ్లిన కథాస్థలిని ఎంతో కుతూహలంతో రీవిజిట్‌ చేశాను. ఇది నాకు పండగ. నిజంగా నేను అనుభవించిన పండగ’’ అని చెప్పిన ఖదీర్‌ మాటల్లో ప్రతి అక్షరమూ సత్యమేననిపిస్తుంది ఈ పుస్తకం చదివాక.
 
మా ఊరి అమ్మవారి గర్భగుడిలో నూనె దీపాల మసక వెలుతురే తప్ప కరెంటు దీపాలుండవు. అందుకని అమ్మ ముఖం స్పష్టంగా కనిపించడానికి పూజారి కర్పూర హారతినెత్తి అమ్మ విగ్రహం చుట్టూ తిప్పుతాడు. ఆ వెలుగులో జగద్ధాత్రి చిరునవ్వునూ, కరుణాదృష్టినీ, మెరిసే ముక్కెరనూ, కుంకుమబొట్టునూ, మంగళసూత్రాలనూ, తల్లిపాదాలనూ దర్శిస్తాం. మనసు నిండిపోతుంది. ఖదీరుబాబు మా ఊరి [[పూజారి]]<nowiki/>లాగా అనిపించాడు నాకు. ఆయన ఎత్తిన [[కర్పూర హారతి]]<nowiki/>లో తెలుగు కథా దేవత స్వరూపమంతా స్థూలంగా కనిపిస్తోంది. ఆమె పాదాల దగ్గర అతను పెట్టిన దేవగన్నేరు పువ్విది.
ఖదీరు నూరేళ్లుండాలి, [[తెలుగు కథ]] వెయ్యేళ్లకీ వెలగాలి.
 
===ఫుప్పుజాన్ కథలు (పిల్లల జానపద సంపద)===
Line 159 ⟶ 131:
- మహమ్మద్ ఖదీర్ బాబు
 
===[[బాలీవుడ్ క్లాసిక్స్]]===
 
1970-80 మధ్యకాలంలో [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో వచ్చిన సినిమాల కథనాలు, వాటి తెరవెనుక కథలు, నిర్మాణంలో ఎదురైన సాధక బాధకాలు, ఉత్తమ చిత్రాలుగా ప్రజల గుండెల్లో నిలవడానికి గల కారణాల విశ్లేషణలతో... 50 బాలీవుడ్ ఉత్తమ చిత్రాలను పరిచయం చేస్తూ సాక్షి ఫ్యామిలీలో మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన వ్యాసాల సంకలనం ‘బాలీవుడ్ క్లాసిక్స్’.
Line 198 ⟶ 170:
పాటల రికార్డింగు సందర్భాలలో తీసిన అలనాటి మేటి సంగీతకారుల ఫోటోలు గొప్ప అనుభూతినిస్తున్నాయి. అవే పాటలు ఈ పుస్తకం చదవకముండు ఒకరకమయిన ఆనందాన్ని ఇస్తే, చదివిన తరువాత ఆయా సంగితకారులతో, గాయని గాయకులతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్టు అవే పాటలు మనకు బాగా తెలిసున్న వాళ్ళు మనకోసమే కంపోజ్ చేసినట్టు పాడినట్టు అనిపిస్తాయి. పరిచయ వ్యాసాలు ఇంత బావుండడం వల్ల సమయం తీసుకొని మళ్ళి ఆ పాత పాటల కలెక్షను బయటకు తీసి వింటున్నానంటే పుస్తకం ఎంత ప్రభావవంతంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సంగీతప్రియులు తప్పక షెల్ఫులో ఉంచుకోవాల్సిన పుస్తకం.
 
<br />
 
=== '''నూరేళ్ళ తెలుగు కథ''' ===
నూరేళ్ళ తెలుగు కథ అనే సంకలనము రచయిత చెప్పిన నూరుగురు కథకుల నూరు ప్రసిద్ధ కథలు,పునఃకథనం /రీటెల్లింగ్ కథలు. ఈ కథలు సాక్షి దినపత్రిక ఫ్యామిలీ సెక్‌షన్లో రోజూ గొప్ప గొప్ప కథలు రాసిన ఒక తెలుగు కథలను పాఠకులకు పరిచయం చేసిన నూరు ప్రసిద్ద (పునఃకథనం /రీటెల్లింగ్) కథలు. పాత తరం గొప్ప కథకులను  కొత్తతరం పాఠకులకు పరిచయం చేయడానికి అతి కొద్ది జాగాలో కథ పరిచయము చేసిన రీటెల్లింగ్ కథా సంకలనము నూరేళ్ళ తెలుగు కథ.
 
పాఠకులకు పాతకథలని తిరిగిచెప్పటం మొదలుబెట్టి అక్టోబరు 2010 నుంచి ఫిబ్రవరి 2011 వరకూ వారానికి ఐదారు కథల చొప్పున 75గురు కథకులు వ్రాసిన 75 కథలను పరిచయం చేశాడు ఖదీర్‌బాబు. సాక్షిలో అక్కడికి ఆ శీర్షిక ఆపేసినా, ఇంకో 25 కథలను చేర్చి మొత్తం 100 మంది రచయితలు రాసిన 100 కథల పరిచయాల్ని ఇప్పుడు ఒక సంకలనంగా తీసుకువచ్చాడు. ఒకో పరిచయం మూడునుంచి ఐదు పేజీలవరకూ ఉంటుంది. ఎంచుకున్న ప్రతి కథనూ ఖదీర్‌బాబు సంక్షిప్తంగా పరిచయం చేసి, తర్వాత ఆ కథను విశ్లేషిస్తూ, కథకుణ్ణి కూడా పరిచయం చేస్తాడు. ప్రతి పరిచయం ముందూ రచయిత ఛాయాచిత్రం, పరిచయం తర్వాత క్లుప్తంగా రచయిత వివరాలు ఉంటాయి. ప్రతి కథకూ ఖదీర్‌బాబు పెట్టిన ఆసక్తికరమైన కొత్త శీర్షిక ఉంటుంది.
 
===న్యూ బాంబే టైలర్స్: ===
Line 219 ⟶ 198:
 
నయాబ్‌ [[కుటుంబము|కుటుంబం]] పడిన హింస. అనుభవించిన బాధ. జరిగిన హాని. ఎవరు బాధ్యుల? ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఇవీ షకీల్‌ అడగయే అడుగుతున్న ప్రశ్నలు. సభ్యసమాజం జవాబీయవలసిన ప్రశ్నలు. “ఈ దేశంలో కొందరు ఐడెంటీ చూపలేరు. అలాగని ఐడెంటిటీలేని వారుగా కూడా బతకలేరు. అందుకనే ఒక్కోసారి వాళ్ల ఐడెంటీయే వాళ్లకు ప్రమాదం తెచ్చిపెడుతూ వుంటుంది’! ఇదీ “గెట్‌ పబ్లిష్‌డ్‌’ కథానికకు ఇతివృత్త కేంద్రకం.
 
=== కథలు ఇలాకూడా రాస్తారు ===
కొత్తగా కథలు, నవలలు రాయాలనుకుంటున్న లేదా రాస్తున్న రచయితలకు ఎన్నో సందేహాలు వుంటాయి. ఎలా రాయాలి? లేదా మనం రాస్తుంది కరెక్టేనా ? ఇవన్ని ఎవర్ని అడగాలి ? అని. అలాంటి ప్రశ్నలకు ఈ బుక్ ఒక సమాధానంగా ఉపయోగ పడుతుంది. ఈ బుక్ చదివిన తరవాత ఒక రచయితగా మనం ఏ స్టేజిలో ఉన్నామో తెలుస్తుంది. ఈ బుక్ ఒక్క రొజులో చదివి పక్కన పెట్టే ఒక కథ కాదు. మనం చదివే కొద్దీ మనల్ని మోటివేట్ చేసే ఎన్నో అధ్బుతమైన కథలు, ఎంతోమంది ప్రముఖ రచయితలు గురించి ,వాళ్ళు రాసే విధానం గురించి ఇందులో ఉంటుంది.
 
=== మెట్రో కథలు ===
“[https://kolimi.org/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/ మెట్రో కథలు]” 25 కథల సంపుటి. “మెట్రో కథలు” నిజానికి ఒక దిన పత్రిక శీర్షిక కోసం రాసినవి. అప్పటికప్పుడు రాసినవే. అందుకేనేమో “ఇవి తెల్ల కాగితాల మీద పుట్టిన కథలు. తెల్ల కాగితాల పైనే తుదీ, మొదలును వెతుక్కున్న కథలు” అని ప్రకటించారు. అవి హైదరాబద్ గురించిన చారిత్రిక కతలు కాదు. ఈ మహానగరంలో జీవిస్తున్న వారి వర్తమాన చరిత్రకి సంబంధించిన కథలు.
 
‘సెల్ఫీ’, ‘రొటీన్’, ‘రూటర్’, ‘డిస్టేన్స్’, ‘నిద్రా సమయం’, ‘మెట్రో’, ‘టేస్ట్’ వంటి కథలన్నింటికీ దంపతీ సంబంధంలోని దూరమే ప్లాట్. సంఘటనలే వేరు. దాదాపు అన్ని కథలు స్త్రీ కోణం నుండి రాసినవే.
 
సంపుటిలోని కథల్లో నిజంగానే కొన్ని గొప్ప కథలున్నాయి. పితృస్వామ్యపు జెండర్ ఇన్సెన్సిటివిటీ కారణంగా స్త్రీల టాయిలెట్ సమస్యల పట్ల సామాజిక నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపే “షీ”, ఆర్ధిక దారిద్ర్యం ధ్వంసం చేసే మానవ సంబంధాల్ని కళ్ళకి కట్టినట్లు వివరించే “నల్ల కాలర్”, ఋతువుల ప్రతాపం నుండి తమని తాము రక్షించుకోలేని నిస్సహాయ నిరుపేద వర్గాల జీవితాల్లోని విషాదం, ఏదైనా విపత్తు జరిగాక అతిగా స్పందించే మీడియా, నాగరీకుల హిపోక్రాటిక్ మూక మనస్తత్వంని ఎత్తి పొడిచే “సలి కోటు”, నిత్య జీవన సమరంలో కిందా మీద పడుతూ అయినా సరే జీవితం మీద ఆశని కోల్పోని అల్పాదాయ వర్గాల వారి ధీరోదాత్త జీవన చిత్రణ చేసే “జీరో బ్లడ్”, మెజారిటేరియనిజం కలగచేసే హింసాత్మక భయభ్రాంతుల మీద రాసిన “వుడ్ వర్క్”…ఈ కథలు అద్భుతమైనవి.
 
== సూచికలు==
Line 232 ⟶ 221:
*ఈ లింకు [http://www.beditor.com/telugu-stories/411-khadir-babu-books] చూడండి
*ఈ లింకు [http://beditor.com/telugu-stories/421-khadeer-babu-beyond-coffee-reviews] చూడండి
*ఈ లింకు [http://pustakam.net/?p=8396 <nowiki>[4]</nowiki>]
*ఈ లింకు [[https://pustakam.net/?p=8391 <nowiki>5]</nowiki>]
*ఈ లింకు [https://vanajavanamali.blogspot.com/2016/05/blog-post.html <nowiki>[6]</nowiki>]
*ఈ లింకు [https://kolimi.org/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B7%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/ <nowiki>[7]</nowiki>]
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_ఖదీర్_బాబు" నుండి వెలికితీశారు