ఘట్టమనేని మహేశ్ ‌బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు, లో → లో (5), ను → ను , → (7), , → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 41:
[[2003]]లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. [[గుణశేఖర్]] దర్శకత్వంలో విడుదల అయిన [[ఒక్కడు]] చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. [[భూమిక]] కథానాయికగా, [[ప్రకాష్ రాజ్]] ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన [[నిజం]] చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు [[నంది పురస్కారం|నంది పురస్కారాన్ని]] అందుకున్నాడు. [[2004]]లో తమిళనాట విజయవంతమైన '''న్యూ''' చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో [[నాని]]గా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే యేడాది విడుదలైన [[అర్జున్]] పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది.[https://readme5minutes.com/2019/02/mahesh-babu-whatsapp-number-height-weight-bio/ మహేష్] తొలి నాళ్లలో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు.
 
పోకిరీ తరువాత నిర్మాణమయిన [[సైనికుడు (2006 సినిమా)|సైనికుడు]] చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన [అతిథి]చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కానీ, ఆ తర్వాత వచ్చిన '[[దూకుడు]]' చిత్రం మహేశ్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. 2013 లో దగ్గుబాటి వేంకటేష్ గారు, మహేష్ బాబు గారు కలిసి నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత ఆయన సుకుమార్ గారి దర్శకత్వంలో "1 నేనొక్కడినే" అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత 2014 సెప్టెంబరులో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది. ఆ తరువాత 2015 లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు. మహేష్ గారు మురుగదాస్ గారి దర్శకత్వంలో చేసిన "స్పైడర్" చిత్రం 2017 సెప్టెంబరు 27న విడుదలైంది. ఆ తరువాత 2018 లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన "భరత్ అనే నేను" చిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా నటించారు. ఆ తరువాత 2019 లో త వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటించారు. కథానాయకుడిగా మహేష్ బాబు గారికి ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాతి చిత్రం సరిలేరు11 నీకెవ్వరుజనవరి 2020 లో విడుదలవిడదల అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది కానుంది.<ref>[http://fans143.com/wiki/mahesh-babu]</ref>
 
2010 లోనే మహేష్ బాబు గారు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్ సైటు అయిన ట్విట్టర్ లో సభ్యులయ్యారు.<ref name="Telugu stars on Twitter">[https://www.twitter.com/urstrulymahesh Mahesh Babu] on Twitter.</ref>