వెన్నా వల్లభరావు: కూర్పుల మధ్య తేడాలు

రచయిత, అనువాదకుడు
Created page with ''''వెన్నా వల్లభరావు''' రచయిత, అనువాదకుడు. కేంద్ర సాహిత్య అకాడమీ...'
(తేడా లేదు)

06:31, 12 మే 2020 నాటి కూర్పు

వెన్నా వల్లభరావు రచయిత, అనువాదకుడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత.

జీవిత విశేషాలు

వెన్నా వల్లభరావు కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, బేతవోలు గ్రామంలో వెన్నా హనుమంతరావు, లక్ష్మీనాగేశ్వరమ్మ దంపతులకు 1956లో జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్య బేతవోలు గ్రామంలో, కాలేజీ విద్య గుడివాడలో పూర్తి అయ్యింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., "భగవతీ చరణ్ వర్మాకే ఉపన్యాసోమే వ్యక్తి ఔర్ సమాజ్" అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి పట్టాలను అందుకున్నాడు. ఇతడు తన ఉపాధ్యాయులు యార్లగడ్డ అంకినీడు, కొచ్చెర్లకోట వెంకట సుబ్బారావుల ప్రోత్సాహంతో హిందీ భాషపట్ల మక్కువ పెంచుకున్నాడు. కళాశాలలో చేరే సమయానికే హిందీ ప్రచారసభ వారి అన్ని పరీక్షలు పూర్తి చేశాడు.