91,634
దిద్దుబాట్లు
Arjunaraocbot (చర్చ | రచనలు) చి (replacing dead dlilinks to archive.org links) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
తెలుగు నాటకాన్ని ప్రయోగ ధోరణి వైపు వడిగా అడుగులేయించిన [[నాటకం]] '''మరో మొహెంజొదారో''' ('''Maro Mohenjo-daro'''). దీనిని [[ఎన్.ఆర్. నంది]] 1963 ప్రాంతంలో రచించారు. తొలి ప్రదర్శన అనంతపురంలో 1964లో జరిగింది. ఇది ప్రయోగాత్మకంతో పాటు ‘ప్రయోజనాత్మక’ నాటకం. ‘మరో మొహెంజొదారో’ను [[ఆచార్య ఆత్రేయ]] కు అంకితమిచ్చారు నంది. మరో మొహెంజొదారో అంటే మరో మట్టి దిబ్బ. గొప్ప నాగరికత అవశేషం. ఆ సమాజం వరదలతోనో, మరో ఉత్పాతంతోనో ధ్వంసమైంది. ఇప్పటి సమాజం కూడా అనేక తప్పిదాలతో మరో మొహెంజొదారోను పునరావృతం చేయడానికి తొందరపడుతోందంటూ రచయిత చేసిన హెచ్చరికే ఈ నాటకం.
1963 ప్రాంతంలో రాసిన నాటకం అయినాకానీ ఇప్పుడు చదువుకున్నా ఆ అనుభూతి తాజాగానే ఉంటుంది. నంది తీసుకున్న ఇతివృత్తం సార్వకాలికమైనది. మనుషులలోనే కనిపించే దోపిడీ తత్వం, అలాంటి వ్యవస్థను నిర్మూలించడానికి మళ్లీ మనిషి పడే తపన ఇందులో చిత్రించారాయన. చారిత్రక దృష్టి, తాత్విక చింతనలతో గాఢంగా ముడిపడి ఉన్న అంశమిది. వీటి వల్ల సాధారణంగా నాటక ప్రక్రియకు ఏ మాత్రం సరిపడని ఉపన్యాస ధోరణి చొరబడుతుంది.
|