పాగోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 150:
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ తోట నరసయ్య నాయుడు===
స్వాతంత్ర్యసమరంలో ప్రముఖ పాత్ర పోషించిన వీరు, పాగోలు గ్రామంలో 1899,అక్టోబరులో జన్మించారు. వీరు బందరులో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930,మే-6న స్వతహాగా మల్లయోధులైన వీరు, బందరులోని కోనేరు సెంటరులోని '''థోరన్ హిల్ స్మారక స్తంభం''' పైకి ఎక్కి, బ్రిటిష్ పోలీసుల అసంఖ్యకమైన లాఠీదెబ్బలకు ఏ మాత్రం వెరవకుండా జాతీయజండా ఎగురవేసినారు. ఈ సందర్భంగా వీరు కారాగార శిక్షనుగూడా అనుభవించారు. వీరి త్యాగానికి మురిసిన గాంధీజీ, మచిలీపట్నం వచ్చినప్పుడు వీరిని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. వీరి సేవలకు గుర్తించిన భారత ప్రభుత్వం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947,ఆగస్టు-15న బందరులోని కోనేరు సెంటరులోని థోరన్ హిల్ స్మారక భవనం మీదనే వీరిచేత జెండాను ఎగురవేయించడం పురజనులందరినీ ఆకట్టుకున్నది. అప్పటినుండి వీరు ఆ ప్రాంతంలో '''జెండా వీరుడు ''' గా వినుతికెక్కినారు. ఈ వీరుడు 1966,సెప్టెంబరు-12న దైవసన్నిధికి చేరుకున్నాడు. 2016,సెప్టెంబరు-12న, వీరి వర్ధంతి సందర్భంగా, విజయకృష్ణ జనజాగృతి సంస్థ అను పేరుతో అనేకమంది పురజనులు, సీనియర్ సిటిజన్లు, స్వాతంత్ర్స్వాతంత్య్ర సమరయోధులూ బందరులోని జిల్లా గ్రంథాలయం వద్ద సమావేశమై వీరికి శ్రద్ధాంజలి ఘటించారు. వీరి త్యాగాలను మరొకసారి గుర్తుచేసుకున్నారు. [5]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/పాగోలు" నుండి వెలికితీశారు