గుంటుపల్లి గోపాలకృష్ణకవి: కూర్పుల మధ్య తేడాలు

తెలుగు కవి
added a new page of Poet Guntupalli Gopalakrishna
(తేడా లేదు)

10:22, 14 మే 2020 నాటి కూర్పు


గుంటుపల్లి గోపాలకృష్ణకవి వర్తమాన శతాబ్దపు ప్రబంధకవులలో నొక్కఁడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. నివాసస్థలము గుంటూరు మండలమునందలి నర్సారావుపేట తాలూకాలోని చెన్నుపల్లి గ్రామము. ఇప్పుడీ గ్రామము ప్రకాశము జిల్లాలో ఉన్నది. వీరిది వసిష్ఠ గోత్రము. తండ్రి కోటిలింగము. తల్లి అనంతలక్ష్మమ్మ. సోమ మంత్రికిని వేంకమాంబకును పౌత్రుడు. వీరిది వసిష్ఠ గోత్రము. తండ్రి కోటిలింగము. తల్లి అనంతలక్ష్మమ్మ.

ఈకవి రచించిన గ్రంథములు (1) బుధజనహృదయాహ్లాదము.(ప్రబంధము) (2) చమత్కార నిదానము. (ఏకాశ్వాసము) (3)పార్వతీ పరిణయము. (నాటకము) (4) వై శాఖమహాత్మ్యము, ( భాషాంతరీకరణము) (5) శివరామశతకము. (6) మరకతలింగశతకము.

ఈతఁడు దాదాపుగ నఱువదేండ్లకాలము జీవించి క్రీ. శ.1917 సంవత్సర ప్రారంభమునఁ వీరు దివంగతులైనట్లు తెలియుచున్నది https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika-Padunokandava.pdf/117