డబ్బు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చి జీడీపీ
ట్యాగు: 2017 source edit
పంక్తి 70:
==వివిధ కరెన్సీల నోట్లు==
1900 నాటికి, పారిశ్రామికీకరణ దేశాలలో చాలావరకు ఏదో ఒక రకమైన బంగారు ప్రమాణంలో ఉన్నాయి, కాగితపు నోట్లు, వెండి నాణేలు ప్రసరించే మాధ్యమంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వాలు గ్రెషమ్ చట్టాన్ని అనుసరించాయి: బంగారం, వెండిని చెల్లించడం, కాని నోట్లలో చెల్లించడం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో జరగలేదు, కానీ అరుదుగా సంభవించింది, సాధారణంగా యుద్ధం లేదా ఆర్థిక సంక్షోభ సమయాల్లో, 20 వ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమై 20 వ శతాబ్దం చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది, పాలనలో ఫ్లోటింగ్ ఫియట్ కరెన్సీలు అమల్లోకి వచ్చాయి. బంగారు ప్రమాణం నుండి వైదొలిగిన చివరి దేశాలలో ఒకటి 1971 లో యునైటెడ్ స్టేట్స్. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలోనూ అమలు చేయదగిన బంగారు ప్రమాణం లేదా వెండి ప్రామాణిక కరెన్సీ వ్యవస్థ లేదు.
 
===జీడీపీ అంటే===
తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అని అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం finished products(అంతిమ వస్తువులు) మరియు సేవల మొత్తం విలువ ఎంత ఉంటుందో అది జీడీపీ అవుతుంది.
 
ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ ఉంది అనుకోండి. అది ఒక రోజు 20 రూపాయల విలువ చేసే ఒక సబ్బు, 10 విలువ చేసే చాకొలేట్, 50 విలువ చేసే పుస్తకం వీటిని అమ్మింది అనుకుందాం. అప్పుడు దాని ఒక రోజు జీడీపీ 80రూపాయలు అవుతుంది. అదే విధంగా దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడీపీ అవుతుంది.
 
అయితే అన్ని ప్రోడక్ట్ ఈ జీడీపీ లోకి చేరవు. ఉదాహారానికి జపాన్ కి చెందిన ఒక కంపెనీ ఏదైనా మెషిన్ ని మన ఇండియాలో అమ్మితే అది మన జీడీపీలో చేరదు. జపాన్ దేశపు జీడీపీలో కలుస్తుంది. అలాగే ఈ జీడీపీ లో మాధ్యమిక వస్తువులను లెక్కించకూడదు. కేవలం అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. అంటే ఉదాహారానికి కారులో వాడే టైర్, సీట్ వంటివి ఉన్నాయి అనుకుందాం. మనం వాటిని నేరుగా ఉపయోగించలేము. కానీ వాటితో కారును తయారుచేస్తే దానిని ఉపయోగించగలం. ఇక్కడ టైర్ , సీట్ వంటివి మాధ్యమిక వస్తువులు, కార్ అనేది అంతిమ వస్తువు. జీడీపీ లో ఈ అంతిమ వస్తువుల విలువను మాత్రమే లెక్కిస్తారు. మరొక ఉదాహరణ తీసుకుందాం. కాఫీ పొడి ఉంది అనుకుందాం దానిని మనం నేరుగా తినలేము. కానీ దానితో కాఫీ చేసుకుని తాగవచ్చు. కాబట్టి ఇక్కడ కాఫీ పొడి మాధ్యమిక వస్తువు అవుతుంది. కాఫీ అంతిమ వస్తువులోకి వస్తుంది. మరి మన జీడీపీ పడిపోయింది అని వింటూ ఉంటాం దాని అర్ధం ఏమిటంటే మన దేశంలో తయారైన వస్తువులను మన దేశంలో ఎక్కువుగా అమ్ముడవడం లేదు. అంటే పక్క దేశాలకు చెందిన వస్తువులనే ఎక్కువగా కొంటున్నాం అని. ఇలా జరిగితే మన దేశంలో తయారైన వస్తువులను కొనడంలేదు కాబట్టి మన దేశంలోని కంపెనీలు కూడా ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చెయ్యవు. ఉత్పత్తి లేకపోతె కంపెనీ కి లాభాలు ఉండవు. దానితో కొత్త ఉద్యోగాలు ఉండవు, లేదా ఉన్న ఉద్యోగులను తీసివేయడం జరుగుతుంది. మళ్ళీ మన దేశ జీడీపీ పెరగాలంటే మన దేశంలో తయారైన వస్తువులను మనం ఎక్కువగా కొనాలి. అప్పుడే మన దేశంలో కంపెనీలు ఎక్కువగా వస్తువులను తయారుచేస్తాయి. దాని వాళ్ళ ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఈ జీడీపీ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవ్యస్థ ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. ఒక క్రమ పద్దతిలో ఒక దేశం యొక్క జీడీపీ అనేది పెరుగుతూ ఉంటె ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని అర్ధం.
 
ఇప్పటికైనా ప్రతి వస్తువు మన భారత దేశంలో తాయారు చెయ్యబడిన (మేక్ ఇన్ ఇండియా) వస్తువులను కొని మన భారత దేశాన్ని అభివృధి చేసుకొందాం
 
వాణిజ్య బ్యాంకు
Line 114 ⟶ 123:
 
===హెలీకాప్టర్ మ‌నీ===
{{Main|హెలికాప్టర్ మనీ}}
హెలీకాప్టర్ మ‌నీ అనేది క్వాంటిటేటివ్ ఈజింగ్‌తో పోల‌స్తే భిన్నమైన‌దీ, అరుదైన‌ది కూడా. ఆర్థిక ప‌రిస్థితులు పూర్తిగా దిగ‌జారిపోయి, ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి శూన్యమ‌యిన‌ప్పుడు ఈ ప‌ద్ధతి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక్కడ కేంద్ర బ్యాంకు ప్రజ‌ల‌కు (వినియోగ‌దారుల‌కు) నేరుగా డ‌బ్బు పంపిణీ చేస్తుంది. అంటే, మ‌న బ్యాంకు అకౌంట్‌లో ల‌క్షలకుల‌క్షలు వ‌చ్చి ప‌డ‌టం కాదు కానీ, ఇంచుమించు అలాంటిదే. ప్రజ‌ల ఆదాయం, ఖ‌ర్చుల కంటే త‌గ్గిపోయిన‌ప్పుడు వారేది కొన‌డానికి ఆస‌క్తి చూప‌రు. అలా ప్రజ‌ల కొనుగోలు శ‌క్తి త‌గ్గిపోయిన‌ప్పుడు ఉత్పత్తుల ధ‌ర‌లు ప‌డిపోతాయి. దీన్నే ప్రతిద్రవ్యోల్బణం లేదా డిఫ్లేష‌న్ అంటారు. దీన్ని నివారించాలంటే, ప్రజ‌ల‌కు అయాచితంగా డ‌బ్బు అందాలి. దాంతో వారు మార్కెట్ల మీద ప‌డి, విప‌రీతంగా కొనుగోలు చేస్తారు. త‌ద్వారా ఆర్థిక వ్యవ‌స్థలోకి న‌గ‌దు భారీగా ప్రవేశించి సంక్షోభం నుంచి గ‌ట్టెక్కుతుంది. హెలీకాప్టర్ ద్వరా డ‌బ్బు వెద‌జ‌ల్లితే ఎలా ఉంటుందో అలా అన్నమాట‌. అందుకే ఈ ద్రవ్య విధానానికి ఈ పేరు పెట్టారు. మ‌రి అలా నేరుగా డ‌బ్బును ప్రజ‌ల‌కే పంపాలంటే ఎలా? ఏదైనా త‌ప్పనిసరి చెల్లింపును ర‌ద్దు చేయ‌డం. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న ఆదాయ‌పు ప‌న్నును కొంత కాలం పాటు ర‌ద్దు చేయ‌డం. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌న ప్రతీ ఏడాది చెల్లిస్తున్న ప‌న్ను ఇక ఆపేయ‌వ‌చ్చు. దాంతో మ‌న‌కు చాలా మొత్తం మిగులుతుంది. దాన్ని ఖ‌ర్చు చేయ‌డం కోసం కొనుగోళ్లు చేస్తాం.అద‌నంగా డ‌బ్బు మార్కెట్లోకి రావ‌డం వ‌ల్ల ద్రవ్యల‌భ్యత ఎక్కువ‌వుతుంది. రుణాల ల‌భ్యత చాలా సుల‌భంగా ఉంటుంది. దాంతో ప్రజ‌లు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని, కొనుగోలు శ‌క్తిని పెంచుకుంటారు. త‌ద్వారా ఆర్థిక వ్యవ‌స్థ మ‌ళ్లీ కుదురుకుంటుంది. బ్యాంక్ ఆఫ్ జ‌పాన్ ముందుగా అమ‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికీ ఈ ప‌ద్ధతిని [[అమెరికా]], యూర‌ప్‌ల‌లో అవ‌లంబిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/డబ్బు" నుండి వెలికితీశారు