వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది.
ట్యాగు: 2017 source edit
పంక్తి 251:
==తొలగించబడిన వ్యాసాలలో మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలి==
:: [[User:Pranayraj1985|Pranayraj Vangari]] గారూ,[[User:K.Venkataramana|కె.వెంకటరమణ]] గారు, నమస్కారం, ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, కావున ఏదైనా వ్యాసం తొలగిస్తే మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలనేది నాకు తెలియదు కావున వివరిస్తే వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. తొలగించబడిన వ్యాసాలను ఎలా ప్రారంభించాలో తెలిపే తెలుగు సమాచారం ఉన్న లింకు ఇస్తే అక్కడి నియమాల ప్రకారం మాత్రమే తొలగించబడిన వ్యాసాలను ప్రారంభిస్తాను. ఎవరికైనా వికీ నియమాలు తెలియకపోతే, ముఖ్యంగా నాకు వికీ నియమాలు తెలియనందున (నాకు నిజంగా తెలియదు) వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది. [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]])
:::[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] గారూ, మీకు నియమాలు తెలియక పోవడం ఏమిటి? మీరు తెలుగు వికీపీడియాలో 2011 అక్టోబరు 30 నుండి వ్యాసాలు రాయడం మొదలుపెట్టి 2314 వ్యాసాలను రాసారు. అన్ని వ్యాసాల సరాసరి పేజీ సైజు 1.32 కె.బి మాత్రమే. దీనిని బట్టి మీరు ఎన్ని వేల మొలక వ్యాసాలు సృష్టించారో తెలుస్తుంది. ఈ మొలక వ్యాసాల గూర్చి నియంత్రణ విధానం ఈ మొలక వ్యాసాలపైనే చర్చలో భాగంగా జరిగిందని మీకు తెలియదా? [[వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 18]] , [[వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 17]] లలో మీ వ్యాసాల గురించి విపరీతమైన చర్చ జరిగిందని మీకు తెలియదా? సీనియర్ వాడుకరులందరూ మీకు సలహాలు ఇవ్వలేదా? అన్నీ తెలిసి నియమాలు గురించి తెలియదంటున్నారు. ఏమనుకోవాలండీ. ఆ రచ్చబండ చర్చల మూలంగానే కదా ఈ మొలకల నియంత్రణ విధానం ప్రారంభమైంది. ఈ నియంత్రణ విధాన ఏర్పాటుకు మూలమైనది మీ వ్యాసాలపై చర్చ కాదా? మీకు వ్యాసాలు ఎలా రాయాలో తెలియదంటే నమ్మమంటారా? అనేక మంది నిర్వాహకులు నిర్వాహణ మూసలు ఉంచినపుడు మీరేమి స్పందించడం లేదు. తొలగింపు చర్చలలో పాల్గొనాలని తెలియదా? నిర్వాహకుల కంటే ఎక్కువ నియమాలు తెలిసినవారు మీరు. మీరు రాసిన వ్యాసాలను మొలక స్థాయి దాటించడమే కాకుండా అందులో మూలాలను చేర్చడం, వ్యాసంలోని వివిధ పదాలకు ఇతర వ్యాసాలకు లింకులు ఇవ్వడం. మీరు రాస్తున్న వ్యాసానికి ఇతర వ్యాసాలనుండి లింకు లుండాలని తెలియదా? పై రచ్చబండ లింకులలోని అంశాలను ఎవరైనా చదివితే వికీపీడియాలో మీకున్న పరిజ్ఞానం అర్థమవుతుంది. కనుక మీరు సృష్టించిన వ్యాసాల అభివృద్ధికి కృషి చేయగలరు. ఒక వ్యాసాన్ని మొలకలనియంత్రణ విధానాన్ని అడ్డు పెట్టుకొని విస్తరించడానికి సమాచారం ఉన్నా 2000 బైట్లకు చేర్చి వదిలేస్తున్నారు. వికీలో క్రియాశీలక సభ్యులు తక్కువగా ఉన్నందున మీ వ్యాసాలను ఎవరూ అభివృద్ధి చేయరు. మీరు రాసిన ఏకవాక్య మొలక వ్యాసాలు తొలగిస్తే మంచి వ్యాసాలుగా తీర్చిదిద్దడానికి ఎవరైనా ముందుకు వస్తారు. మీకు వ్యాసకర్తగా ఉండాలనే కోరిక ఎలా ఉంటుందో నూతన సభ్యులకు కూడా అలానే ఉంటుంది. కనుక మీరు అభివృద్ధి చేయనిచో ఏక వాక్యాల వ్యాసాలు తొలగించబడతాయి. మీరు తొలగించకూడదని భావిస్తే మీరు ఆ వ్యాసాల చర్చా పేజీలో చర్చించండి.[[User:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">''' కె.వెంకటరమణ '''</span>]][[User talk:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">(చర్చ)</span>]] 07:15, 15 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు