రతన్ టాటా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
2012 డిసెంబర్ లో యుగాంతం కాలేదు కానీ, భారతదేశపు పారిశ్రామిక రంగంలో మాత్రం ఒక శకం ముగుస్తోంది. 1991 నుంచి అంటే 21 సంవత్సరాల పాటు టాటా గ్రూప్ ని విజయపథంలో నడిపిన రతన్ నావల్ టాటా (రతన్ టాటా) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో, ఈరోజు (28/12/2012) ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. వంటింట్లో ఉండే ఉప్పు, పంచదారల నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల తయారీలో వాడే స్టీల్ వరకు, ప్రధానమైన ఏడు బిజినెస్ సెక్టార్స్ లో (Communications & Information Technology, Engineering, Materials, Services, Energy, Consumer products and Chemicals) దరిదాపు 85 దేశాలలో, 100 కు పైగా కంపెనీలతో, సుమారు 100 బిలియన్ US డాలర్ల పైగా బిజినెస్ చేసే ఈ పారిశ్రామిక దిగ్గజం గురించి నేను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. కానీ అత్యంత successful గా తన tenure ని పూర్తి చేసుకున్న ఈ iconic man deserves resepect, love, affection and recognition from every individual Indian అని నా అభిప్రాయం, అందుకే కొండని అద్దంలో చూపించే ఈ చిన్న ప్రయత్నం.
 
రతన్ టాటా JRD టాటా<ref>{{Cite web|url=https://www.tata.com/about-us/tata-group-our-heritage/tata-titans/jrd-tata|title=JRD Tata {{!}} Tata group|website=www.tata.com|language=en|access-date=2020-05-15}}</ref> మునిమనవడు. రతన్ టాటా వ్యక్తిగతజీవితం గురించి పబ్లిక్ డొమైన్ లో తెలిసింది చాలా తక్కువ. ఆ కొద్దిపాటి వివరాల ప్రకారం బోంబే ప్రెసిడెన్సీకి చెందిన ఒక పార్సీ కుటుంబంలో 1937 డిసెంబర్ 28 న జన్మించిన రతన్ టాటా బాల్యం అంత సాఫీగా గడవలేదు. రతన్ నావెల్ టాటా తల్లిదండ్రులు నావెల్ H టాటా & సూనూ. నావెల్ H టాటాని JRD టాటా చిన్నకొడుకు వారికి పిల్లలు లేకపోవటంతో దత్తత తీసుకున్నారు . రతన్ టాటా వయస్సు 7 ఏళ్ళు, ఆయన తమ్ముడు జిమ్మీ వయస్సు 5 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు, అప్పటి నుంచి నాయనమ్మ నవాజ్ భాయ్ పెంచి పెద్ద చేసారు. ఆ తరువాతి కాలంలో నావెల్ H టాటా వేరే వివాహం చేసుకున్నారు ఆ వివాహం ద్వారా కలిగిన సంతానం నోయెల్ టాటా (ప్రస్తుత Trent Ltd వైస్ ఛైర్మన్ & టాటా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ).
 
Campion స్కూల్ (అప్పటి బొంబాయి ఇప్పటి ముంబై ), బిషప్ కాటన్ స్కూల్ సిమ్లా, Cathedral & Jhon Connon స్కూల్ ముంబై లలో తన స్కూలింగ్ పూర్తిచేసిన రతన్ టాటా, 1962 లో Cornell University నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు. గ్రాడ్యుయేట్ అయిన వెంటనే JRD టాటా సలహా మేరకు జెంషెడ్ పూర్ లో టాటా స్టీల్ లో ఒక సాధారణ బ్లూ కాలర్ ఉద్యోగిగా చేరారు . ఆ తరువాత 1971 లో అప్పట్లో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కుంటున్న NELCo (National Radio & Electronics Company) లో Director in-charge గా బాధ్యతలు తీసుకున్నారు. 40% లాభాలు, 2% మార్కెట్ వాటాతో కష్టాలలో ఉన్న NELCo ని మూడు సంవత్సరాలలో అంటే 1975 నాటికి, 2% నష్టాలు, 25% శాతం మార్కెట్ వాటా ఉన్న కంపెనీగా మార్చగలిగారు. కానీ తరువాతి కాలంలో దేశం లోని [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] మూలంగా వచ్చిన ఎకనామిక్ రిసెషన్, యూనియన్ బందులు వీటి ప్రభావంతో లాకౌట్ ప్రకటించారు. 1981 లో డైరెక్టర్, టాటా ఇండస్ట్రీస్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా మరోసారి 1986 లో Empress మిల్స్ విషయంలో ఇటువంటి చేదు అనుభవాన్ని చూసారు. ఈ చేదు అనుభవాలతో 1991 లో, లెజెండరీ పారిశ్రామికవేత్త అయిన JRD టాటా వారసుడిగా టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే సమయంలో కొద్దిపాటి విమర్శల్ని ఎదుర్కొవాల్సి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/రతన్_టాటా" నుండి వెలికితీశారు