అనంత వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
==జీవిత విశేషాలు==
వెంకటరెడ్డి 1921 జూలై 1వ తేదీన అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఇతని తండ్రి ఎ.కృష్ణారెడ్డి. ఇతడు గుంటూరు లోని హిందూ కళాశాలలో చదివి బి.ఎ., కర్ణాటక రాష్ట్రం బెల్గాంలోని ఆర్.ఎల్.లా కాలేజీలో చదివి న్యాయవిద్య పట్టా బి.ఎల్.లను పుచ్చుకున్నాడు. ఇతడు విద్యార్థి దశలో "క్విట్ ఇండియా ఉద్యమం"లో పాల్గొన్నాడు. అనంతపురం పట్టణంలో న్యాయవృత్తిని ప్రారంభించి సుమారు 35 సంవత్సరాలు న్యాయవాదిగా సేవలను అందించాడు. 1967-68లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. ఇతనికి క్రీడలలో ప్రవేశం ఉంది. విద్యార్థి దశలో క్రీడలలో పాల్గొని అనేక పతకాలను గెలుచుకున్నాడు. 1946వ సంవత్సరంలో హిందూ కాలేజీ హాకీ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. ఇతనికి 1952లో వెంకటసుబ్బమ్మతో వివాహం జరిగింది. వీరికి 3 కుమారులు, 1 కుమార్తె జన్మించారు.
==రాజకీయ రంగం==
ఇతడు [[భారత జాతీయ కాంగ్రెస్]] క్రియాశీలకంగా పనిచేశాడు. ఇతడు 1964-67, 1969-72 సంవత్సరాలలో జిల్లా కాంగ్రెస్ కమిటీకి ప్రధానకార్యదర్శిగా, 1978-79లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. 1969లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, 1981లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైనాడు. ఇతడు అనంతపురం లోకసభ నియోజకవర్గం నుండి తొమ్మిదవ, 10వ లోక్‌సభలకు ఎన్నికై సభ్యుడిగా కొనసాగాడు. ఇతడు రాష్ట్ర విధాన సభలలోను, పార్లమెంటులోను వివిధ కమిటీలలో సభ్యుడిగా నియమించబడ్డాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అనంత_వెంకటరెడ్డి" నుండి వెలికితీశారు