మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 39:
 
== బాల్యం , నేపథ్యం==
బాలమురళీకృష్ణ 1930, జూలై 6న మద్రాసు రాష్ట్రం లోని, [[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజోలు]] తాలూకా [[శంకరగుప్తం]]లో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు.<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> అతను కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం [[సఖినేటిపల్లి]] మండలం [[అంతర్వేదిపాలెం]]. కొచ్చర్లకోట రామరాజు అతను మొదటి గురువు. తరువాత తమిళనాడులో పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేశాడు. ఉన్నట్టుండి అతను కనపడకుండా పోవడంతో మళ్ళీ పెద్దకల్లేపల్లికి వచ్చి [[సుసర్ల దక్షిణామూర్తి]] శాస్త్రి దగ్గర చేరాడు. అతను తదనంతరం అతను శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డాడు.<ref name="బి. ఎం. సుందరం వ్యాసం">{{cite web|last1=బి. ఎం.|first1=సుందరం|title=A prodigy and a genius|url=https://www.dhvaniohio.org/wp-content/uploads/2011/12/1-BMK-cover-story.pdf|website=dhvaniohio.org|publisher=dhvaniohio.org|accessdate=23 November 2016|archive-url=https://web.archive.org/web/20150724161740/https://www.dhvaniohio.org/wp-content/uploads/2011/12/1-BMK-cover-story.pdf|archive-date=24 జూలై 2015|url-status=dead}}</ref> అతను ప్రముఖ సంగీతకారుడు, [[వేణువు]], [[వయోలిన్]], [[వీణ]] విద్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవాడు. పుట్టిన 15వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> అమ్మమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి [[పారుపల్లి రామకృష్ణయ్య]] పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు. పట్టాభిరామయ్య కూడా అతను దగ్గరే సంగీతం నేర్చుకోవడం విశేషం.<ref name="బి. ఎం. సుందరం వ్యాసం"/>
 
1938 జూలైలో ఎనిమిదేళ్ళ ప్రాయంలో [[విజయవాడ]]<nowiki/>లో తన గురువు [[పారుపల్లి రామకృష్ణయ్య]], అతను గురువు [[సుసర్ల దక్షిణామూర్తి]] పేరున ఏర్పాటు చేసిన ''సద్గురు ఆరాధనోత్సవాలు'' సందర్భంగా మొట్టమొదటి సారిగా కచేరి చేశాడు.<ref name="సాక్షి పత్రికలో రెంటాల జయదేవ ఇంటర్వ్యూ">{{cite web|last1=రెంటాల|first1=జయదేవ|title=పలుకే బంగారమాయెనా!|url=http://www.sakshi.com/news/family/the-last-interview-given-by-balamuralikrishna-424940?pfrom=home-top-story|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=23 November 2016}}</ref><ref name="ది హిందూ దినపత్రికలో కడివెళ్ళ రాం వ్యాసం">{{cite web|last1=కడివెళ్ళ|first1=రామ్|title=Torchbearer of innovation|url=http://www.thehindu.com/features/friday-review/music/on-mangalampalli-balamuralikrishna/article7481511.ece|website=thehindu.com|publisher=ది హిందూ|accessdate=23 November 2016}}</ref> ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధుడైన ప్రముఖ [[హరికథ]] విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ అతని పేరు మురళీకృష్ణకు ముందు ''బాల'' అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు.<ref name="సాక్షి పత్రికలో రెంటాల జయదేవ ఇంటర్వ్యూ"/>
 
== వృత్తి జీవితం ==
బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసులో ప్రారంభించాడు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25,000 కచేరీలు చేశాడు. సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. [[హిందుస్తానీ సంగీతం]]<nowiki/>లోని ప్రముఖ సంగీతకారులతో కలిసి పనిచేశాడు. జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ [[భీమ్‌సేన్ జోషి|భీమ్ సేన్ జోషి]]<nowiki/>తో కలిసి ముంబయిలో నిర్వహించారు. పండిట్ [[హరిప్రసాద్ చౌరాసియా]], కిషోరీ అమోన్కర్, మొదలగు వారితో కూడా జుగల్ బందీ కచేరీలు చేసాడు. ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. బాలమురళీకృష్ణ [[వయోలిన్]], వయోలా, [[వీణ]], [[మృదంగం]] మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్నో [[జాతీయ]], అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నాడు. ఇతను [[తిరుపతి తిరుమల దేవస్థానము]], [[శృంగేరీ]] పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు <ref name=oneindia>వన్ ఇండియా వెబ్‌సైటులో [http://living.oneindia.in/celebrity/music/bala-muralikrishna.html బాల మురళీ కృష్ణపై వ్యాసం] {{Webarchive|url=https://web.archive.org/web/20070630132520/http://living.oneindia.in/celebrity/music/bala-muralikrishna.html |date=2007-06-30 }}, జులై 1, 2007న సేకరించారు.</ref>.
 
=== కచేరీలు ===
పంక్తి 130:
 
==బయటి లింకులు==
* https://web.archive.org/web/20070529010221/http://www.musicindiaonline.com/music/carnatic_vocal/s/artist.1408/
* http://www.musicalnirvana.com/carnatic/bmk_articles.html
{{తెలుగు సంకీర్తన సాహిత్యం}}