బయ్యా సూర్యనారాయణ మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Bayya_Suryanarayana_Murthy.gifను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:1989. కారణం: (Copyright violation; see Commons:Licensing (F1)).
పంక్తి 1:
'''బి. ఎస్. మూర్తి''' గా ప్రసిద్ధులైన '''బయ్యా సూర్యనారాయణ మూర్తి''' ([[1909]] - [[1979]]) స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, హరిజన నాయకులు, కేంద్ర మంత్రి.
 
[[File:Bayya Suryanarayana Murthy.gif|right|thumb|150px|బయ్యా సూర్యనారాయణమూర్తి]]
వీరు [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[రాజోలు]] తాలూకా [[నగరం]] గ్రామంలో నాగయ్య దంపతులకు [[1909]]లో జన్మించారు. [[రాజమహేంద్రవరం]], [[చెన్నై]]లో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎం.ఏ., బి.ఇడి., పట్టభద్రులయ్యారు. తొమ్మిదవ ఆంధ్ర విద్యార్థి కన్వెన్షన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర దళిత వర్గాల ఫెడరేషన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1937-1939 మరళ 1946-1947 మధ్యకాలంలో మద్రాసు మంత్రివర్గంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. దేశ స్వాతంత్ర్యయ సమరంలో వ్యక్తి సత్యాగ్రహం, [[క్విట్ ఇండియా]] ఉద్యమాలలో రెండు సార్లు కారాగార శిక్ష అనుభవించారు. వీరు 'నవజీవన' పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆంధ్ర హరిజన సేవక సంఘం అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు. ఆంధ్ర వ్యవసాయ కూలీ కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్నారు.