"అద్వైతం" కూర్పుల మధ్య తేడాలు

215 bytes added ,  1 సంవత్సరం క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
(→‎ఇవి కూడా చూడండి: సభ్యుని స్వంత అభిప్రాయాలు తొలగింపు)
ట్యాగు: 2017 source edit
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
= చరిత్ర =
 
ఉపనిషత్తులలో జీవుడు, బ్రహ్మం, జగత్తును గురించి గురుశిష్యుల నడుమ చర్చలుగా వ్రాసి ఉన్నాయి<ref>[http://www.britannica.com/EBchecked/topic/618602/Upanishad "britannica.com లో ఉపనిషత్"]</ref>. ఈ ఉపనిషత్తులలో అనేక చోట్ల సాక్షాత్తు అద్వైతం అన్న పదం వాడకపోయినా జీవుడు బ్రహ్మ ఒకటే అన్న విషయాన్ని ప్రస్తావించబడింది. సుమారు క్రీ. శ. 600 లో రచించిన బృహదరణ్యకోపనిషత్ లో అద్వైతసూత్రాలు చాలా కనబడతాయి. క్రీ. శ 6 వ శతాబ్దంలో జీవించిన [[గౌడపాదులు]] ఈ ఉపనిషత్తుల సారం అద్వైతం అని వారు రచించిన [[మాండూక్య కారిక]]లో చెప్పారు<ref>[http://books.google.com/books?id=FitzCp2CkoAC&lpg=PP1&ots=cFKiaeBV8F&dq=mandukya%20karika&pg=PA183#v=onepage&q=advaita&f=false "గూగుల్ books లో మాండూక్య కారిక గురించి స్వామీ చిన్మయానంద పుస్తకం"]</ref>. అద్వైతం అంటే "రెండవది-లేని" అని అర్థం. బ్రహ్మం, జీవుడు, జగత్ అని మూడు విషయాలు లేవు. ఉన్నదంతా ఒకటే, అది బ్రహ్మమే అని అర్థం. ఆయన శిష్యుడు [[గోవింద భగవత్పాదులు]]. వారి శిష్యుడు [[శంకరాచార్యులు]]<ref>[{{Cite web |url=http://www.advaita-vedanta.org/avhp/advaita-parampara.html |title="అద్వైత పరంపరాశ్లోకం"] |website= |access-date=2012-09-30 |archive-url=https://web.archive.org/web/20120729062751/http://www.advaita-vedanta.org/avhp/advaita-parampara.html |archive-date=2012-07-29 |url-status=dead }}</ref>.
 
ముందు గురువులు అద్వైతం గురించి చెప్పినా, [[శంకరాచార్యులు]] అద్వైతాన్ని క్రమబద్ధీకరించి, తర్కంతో ఋజువు చేసారు. [[ఉపనిషత్తులు]], [[బ్రహ్మసూత్రాలు]], [[భగవద్గీత]]—ఈ మూడింటినీ కలిపి [[ప్రస్థానత్రయం|ప్రస్థానత్రయి]] అన్నారు. వీటికి అన్నిటికీ సమన్వయం చేకూర్చి, వాటి భావం అద్వైతం అని చాటారు. అప్పటి నుండి అద్వైతం బాగా ప్రచారంలోకి వచ్చింది. కేరళ నుండి ఉత్తరభారతదేశం వరకూ ప్రయాణించి చాలా మంది వేదాంతులతో వాదించి అద్వైతాన్ని నిలబెట్టారు<ref>[http://books.google.com/books?id=Xd_rc7vWaEQC&lpg=PA61&ots=J-xIZYynSR&dq=adi%20sankara%20spread%20hinduism&pg=PA61#v=onepage&q&f=false "గూగుల్ books లో తిరుమంగళకుడి వెంకటరామన్ రచించిన "Discovery of Spiritual India"]</ref>. దేశం నలుమూలలా మఠాలను స్థాపించి ఆయన శిష్యులైన [[పద్మపాదులు]] (తూర్పున పూరి లో), [[హస్తామలకులు]] (పడమరన ద్వారకలో), [[తోటకాచార్యులు]] (ఉత్తరాన జ్యోతిర్మఠంలో), [[సురేశ్వరాచార్యులు]] (దక్షిణంలో శృంగేరి లో) దేశం నలువైపులా మఠాలను ఏర్పరిచారు. ఆ తఱువాత ఆ మఠాలలో ప్రతీ గురువు ఒక శిష్యుడికి ఉపదేశం చేసి గురుపరంపర కొనసాగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2937289" నుండి వెలికితీశారు