ఆప్టికల్ మౌస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}} {{orphan}}
 
[[File:Microsoft-wireless-mouse.jpg|thumb|300px|మైక్రోసాఫ్ట్ వైర్లెస్ ఆప్టికల్ మౌస్]]
[[కంప్యూటర్]] కు సంబంధించిన ఒక పరికరం [[ఆప్టికల్ మౌస్]]. గతంలో ఉపయోగించిన రోలర్ మౌస్ స్థానాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా ఆప్టికల్ మౌస్ భర్తీ చేస్తుంది. ఆప్టికల్ అనే పేరుకు తగ్గట్టు ఆప్టికల్ మౌస్‌లో ముఖ్యంగా ఒక బుల్లి కెమెరా ఉంటుంది. ఈ బుల్లి కెమెరా సెకనుకు 1500 ఫ్రేముల్ని ఫొటో తీయగలదు. ఈ బుల్లి కెమెరా ఫొటోలు తీయడానికి మనం కెమెరాలో ఫ్లాష్ వాడినట్టు ఆప్టికల్ మౌస్ తన ఫొటోల్ని తీయడానికి వీలుగా దాదాపు ఆవిచ్ఛిన్నంగా వెలిగే ఓ ఎర్రని లేజర్ లైట్ ఉంటుంది. ఈ కెమెరా సాధనాల్ని మౌస్ అడుగు భాగంలో అమర్చుతారు. కంప్యూటర్ ను ఉపయోగించే వారు [[మౌస్]] ని కదలించినప్పుడు అడుగు భాగమున ఉన్న లైట్ మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది. వెనువెంటనే అక్కడున్న బుల్లి కెమెరా ఉపరితలం ఫొటోలను వందలాదిగా తీసి కంప్యూటర్‌కు చేరవేస్తుంది. కంప్యూటరులో ఉన్న ఓ ప్రత్యేక దృశ్య గణన విభాగం బొమ్మల్లో కలిగిన మార్పుని గుర్తించటం ద్వారా మౌస్ ఎటువైపు కదిలిందో గుర్తిస్తుంది. దీని కనుగుణంగా కంప్యూటరు తెరమీద [[కర్సర్]] కదులుతుంది. అవసరమైన ఫైలు మీదకు కర్సర్ వచ్చినపుడు నొక్కవలసిన బటన్లు నొక్కి ఆ ఫైలును ఉపయోగించుకోవచ్చు. మౌస్ పైభాగాన ఉన్న పల్లచక్రాన్ని తిప్పినప్పుడు అది ఓ [[పరారుణ కాంతి]] పుంజాన్ని పదేపదే అడ్డుకునేలా చేసి స్క్రోలింగ్ చేసేందుకు వీలుకల్పిస్తుంది, తద్వారా [[మానిటర్]] లోని దృశ్యం స్క్రోల్ అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఆప్టికల్_మౌస్" నుండి వెలికితీశారు