"అంబ (మహాభారతం)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
హోత్రవాహనుడు అనే కాశీరాజు పెద్ద కూతురు '''అంబ'''. ఈమెకు [[అంబిక]], [[అంబాలిక]] అని ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అంబ సాళ్వుడిని ప్రేమించి అతనినే పెళ్ళి చేసుకోవాలనుకుంది. కానీ, [[భీష్ముడు]] తన తమ్ములకు పెళ్ళి చేయడానికి ఈ సోదరీమణులు ముగ్గురినీ స్వయంవరం వేళ తీసుకెళ్ళిపోయాడు. అప్పుడూ భీష్ముడితో అంబ తన కథ చెప్పి తనని సాళ్వుడి వద్దకు పంపమని కోరింది. భీష్ముడు ఒప్పుకుని ఆమెని పంపేశాడు. కానీ, అక్కడ సాళ్వుడు భీష్ముడు వదిలేసిన అంబని స్వీకరించడానికి ఇష్టపడకపోవడం తో ఆమె తన కష్టాలకి భీష్ముడే కారణమని అతన్ని యుద్ధంలో ఓడించడానికి తపస్సు చేసింది. [[శివుడు]] ప్రత్యక్షమై ఆమెకి రాబోయే జన్మ లో [[దృపదరాజు]] కు [[శిఖండి]] అను కుమారుడిగా పుట్టి భీష్మునికి మరణం కలిగిస్తావని వరమిచ్చాడు. దానితో అంబ వెంటనే చితిపేర్చి శరీరము దహించుకొనింది.
 
[[వర్గం:పురాణమహాభారతంలోని పాత్రలు]]
[[వర్గం:మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/293760" నుండి వెలికితీశారు