గోసంగి కులం: కూర్పుల మధ్య తేడాలు

చి వీరి కుల దేవుడు శివుడు
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు, typos fixed: తో → తో ,
పంక్తి 7:
[[File:Street tiger dance-andhrq.jpg|thumb|right|200px|పులివేషం]]
 
'''గోసంగి కులం''' గోసంగి కులం వారు జన్మతాహ పూర్వం [[ జానపద కళలు|జానపద కళాకారులు]]...
 
=== జానపద కళా రక్షకులు ===
ఈ [[కులం]] వారు తమ జీవనోపాధికి [[రామాయణం]], [[మహాభారతం]], [[బొబ్బిలి యుద్ధం]], [[జగదేక వీరుని కథ]], [[కాంభోజరాజు కథ|కాంభోజ రాజు కథ]], [[బాలనాగమ్మ]], ఆధునికంలో [[అల్లూరి సీతారామ రాజు]], [[బి.ఆర్‌. అంబేడ్కర్‌|అంబేడ్కర్‌]], [[గాంధీ]]. [[నెహ్రూ]]ల [[బుర్ర కథ]]లను చెప్పుకుంటూ తమ జీవితాన్ని గడుపుతున్నారు. [[ఆంధ్ర రాష్ట్రం]]లోనే కాక [[దేశం]]లోనే ఈ సాంస్కృతిక పరమైన వ్యవస్థ కొనసాగుతోంది. ఇలాంటి ఆశ్రీత కులాలు- మరుగున పడిన మానవ విలువలు కలిగిన గొప్ప సంస్కృతిని కాపాడుతున్నాయి అనడంలో సందేహం లేదు. వీరిలో వివిధ రకాల జానపద కళలను ఆశ్రయించి బతికే కులం కాని కులం గోసంగి కులం. వీరు [[తెలంగాణ]] ప్రాంతంలో ఎక్కువగానూ, [[రాయలసీమ]]లో మధ్యమంగానూ, ఆంధ్రా ప్రాంతంలో తక్కువగానూ ఉన్నారు. తెలంగాణలో గోసంగి కులం పేరు తోపేరుతో ఒక్క [[నిజామాబాద్]]‌ [[జిల్లా]]లోనే ఇంచుమించు లక్ష కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. రాయలసీమ, ఆంధ్రాలో వివిధరకాల ఆశ్రీత కులాలకు చెందిన పేర్లతో వీరు జీవనం కొనసాగిస్తున్నారు.
 
===వీరికి వందల ఏండ్ల చరిత్ర===
పంక్తి 16:
{{main|తెలుగునాట జానపద కళలు}}
 
జానపద కళల సంరక్షకులుగా ఈ కులం వీరికి వందల ఏండ్ల చరిత్ర ఉన్నా ఇప్పటి వరకూ వీరికి విద్యలేదు. స్థిర నివాసం లేదు. ఒక గ్రామానికి పరిమిమైన వారు కాదు. ఆదిమానవుని బాటలో నేటికీ పయనిస్తున్నారు. జీవనోపాధికి అనేక మార్గాలను ఏర్పాటుచేసుకోటం వీరి విద్య. వీరు నలుగురు ఒకచోట ఉండలే రు. గ్రూపులుగా విడిపోవటం వల్ల వీరి ఐక్యతకు విఘాతం కలుగుతోంది.ఏండ్ల తరబడి వివిధ రకాల జానపద కళలను అవలంబించే కులం గోసంగి కులం. వీరు బిచ్చమెత్తుకుని, పొట్ట పోసుకుంటూ అంటరానివారుగా పల్లెల్లో, పట్టణాల్లో కూడా బానిసలుగా బతుకుతున్నారు. వీరికి ప్రధానమైన [[వృత్తి]] లేదు. ఏ వృత్తిని అవలంబించినా భిక్షాటనం చేయడం పరిపాటి. అయితే ఏ వృత్తిని చేపట్టినా తమకుకూడా గ్రామాల్లో సుస్థిర నివాసం ఒకటి ఉండాలనే అవసరాన్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. సుస్థిర పడటానికి శతవిధాల తిప్పలు పడుతున్నారు. వీరి నివాసం అది కూడా చెట్లకింద నివాసం. దేశదిమ్మరులుగా తిరుగుతారు. సమాజంలోని వ్యక్తులకు ఉన్న విలువలు వీరికి తెలియవు. జీవిత పయనాన్ని కొనసాగిస్తున్న వారి చరిత్ర చాలా దుర్భరంగా ఉంది. వీరి పరిస్థితులు అతి హీనమైనవిగా గోచరిస్తు న్నాయి. ఈనాటికి కూడా వీరు భిక్షాటన చేయక తప్పడం లేదు. తినటా నికి తిండిలేక, ఉండటానికి గూడు లేక, కట్టుకోటానికి బట్టలేక- అనగా కనీస అవసరాలు ఏ మాత్రం లేకుండా అతి దయనీయ మైన స్థితిలో ఉన్నారు. విశేషమేమంటే గోసంగిలు వివిధ రకాల జానపద కళల ద్వారద్వారా బిచ్చమెత్తుతూ… ఎత్తుతూ… చివరకు తాము ఏ కులానికి చెందిన వారమో తమకే తెలియని స్థితిలో దయనీయమైన జీవనాన్నికొనసాగిస్తున్నారు. గోసంగి కళాకారులను ‘గోసం వారని, గాసం వా రని, గోసికె వారని, గుడిసెల వారు అని, శారద కాండ్లు, కాటి పాపల వారని, బహురూపుల వారని, బాలసంతుల వారని, బుడిగె జంగాలని, బవనీల, బైండ్లవారని- ఇలా అనేక పేర్లతో వీరిని పిలువడం వ్యవహారం లో ఉంది. తాము ఏదైతే వృత్తిని స్వీక రించి జీవన ప్రధాన మార్గంగా చేసు కొని అడుక్కుంటారో వారిని అదే కుల స్థులుగా వ్యవహరించటం రివాజు. తాము జీవనం కొనసాగించే వృత్తినే కులంగా చెప్పుకుని జీవించడం వల న ఇప్పుడు ‘గోసంగి’ కులం వారు ఇబ్బందులు పడుతున్నారు.
 
'''ప్రభుత్వానికే అంతుపట్టని స్థితి'''
 
ఏ కులమో సొంత అస్తిత్వం లేక, తాము ఏ కులం చెప్పుకోవాలో తెలియక ఈ కులాన్ని చెప్పుకోవటానికి కష్టాలు పడుతున్నారు. ఉత్పత్తి కులాల వారి ఆశీస్సులతో బతికే వీరిని ఏ ఉత్పత్తి కుల ఆశ్రీత కులంగా వ్యవహారించాలో ప్రభుత్వానికే అంతుపట్టని స్థితి. గత ప్రభుత్వం వీరిని ఎస్సీలుగా ప్రకటించింది. ఎస్సీలలో మాదిగలను ఆశ్రయించే పెద్దకులం వీరిది. కానీ వీరు మాలలను ఆశ్రయించటానికి ఇష్టపడకున్నా వీరిని మాలలు తమ ఆశ్రీత కులమని అక్కునచేర్చుకుంటున్నారు. మిగతా జానపదకళలను ఆశ్రయించి విడిపోయిన గోసంగి కులాలు ఏయే ఉత్పత్తి కులాన్ని ఆశ్రయించి బిచ్చమెత్తుకుంటున్నాయో… ఆయా కులాల ఆశ్రీత కులంగా చెప్పుకొని జీవనం కొనసాగిస్తున్నారు. గోసం గిలది హీనస్థితి, వెలివేతకు గురైన జీవితం. అంటరాని జాతి. వీరు అంటరాని వారుగా గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో మూడు కట్టెల ఎలవారం గుడారాలను లేదా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని తాత్కాలికంగా మకాం పెట్టే వారు. ఇక గ్రామంలోకి బిచ్చం కోసం వెళ్తారు. కింది కులాల నుండి పై కులాల వరకు అనగా ఉత్పత్తి కులాలకు చెందిన వారందరి వద్ద బిచ్చం ఎత్తు కుంటారు. ఆ గ్రామాన్ని పూర్తిగా జానపద కళలతో ముంచేస్తూ పొట్ట పోసుకుంటారు. తమకు కలిగిన సంతానాన్ని కూడా తమతోనే తీసుకవెళ్లి, తాము అవలంబించే పాటలను, కథలను నేర్పించి తమ దృష్టిని వంశ పారంపర్యంగా కొనసాగేటట్లు చేయటమే వీరికి వెన్నతో పెట్టిన విద్య.తాము బిచ్చమెత్తుకొని సంపాదించినదంతా తినడానికి, తాగడానికి, ఇంకా ఇతర వృధా ఖర్చులకు వినియోగించుకుంటారు.
 
=== ఇతర కులాలను సంతోషపెట్టే కళల్లో ===
పంక్తి 26:
{{main|కళాకారుల జాబితా}}
 
ఇతర కులాలను సంతోషపెట్టే కళల్లో జానపద కళలు ప్రధానమైనవి. బహుజన కులాలను ఆశ్రయించి అనేక ఆశ్రీత కులాలు వాటిలో కొన్నింటి పరిశీలిస్తే… కొన్ని పాటలను తమ సొంతం చేసుకొని, చౌరస్తాలలో నలుగురు కూడిన చోట[[వీధి భాగోతం]], పండుగలు పబ్బాలు జరిగేచోట, పెళ్లిళ్లుపెళ్ళిళ్లు, పేరంటాలు జరిగేచోట పాడుకుంటూ, నలుగురిని మెప్పించి, వారు తమ సంతోషంతో ఇచ్చిన కట్న కానుకలను, ఇనాములను తీసుకొని పబ్బం గడుపుతున్నారు. అందువల్ల వీరి కుల [[దేవుడు]] [[శివుడు]] అయ్యాడు. పగటి వేషాలు వేసుకుని శవాల దగ్గర అడుక్కుంటున్నారు. మరికొందరు[[కాటిపాపల]] బహురూపుల వేషాలు వేసుకొని, తుపాకీ రాముని వేషం వేసు కొని, నవ్వు పుట్టించే డంబాచారంతో యాచన కొనసాగిస్తున్నారు. ఇంకా కొందరు [[బాల సంతు వారు|బాలసంతుల]] వేషం వేస్తారు. ఇది వీరి జీవితంలో భిక్షాటన చేసుకోటానికి అపూర్వమైన జానపద కళ. వీరు పోతురాజు లాగా వేషం వేసుకొంటారు. ఈ కళను ప్రదర్శించేవారు గోసంగి కులంలో కొంత గొప్ప వారుగా, ఆధునిక దృక్పథం ఉన్నవారుగా, లేదా కొంత ముందంజలో ఉన్నవారిగా గుర్తిస్తారు. కొందరు కాటికాపరులుగా కొందరు బుర్ర మీసాలు, భుజాల వరకు పెంచిన రింగు రింగుల జుట్టు, రంగు రంగుల దుస్తులు, ముఖానికి రాసుకున్న పసుపు, నిలువు నామాల మధ్యలో రూపాయి బిళ్లంత బొట్టు, మెడకు, మోచేతులకు, కాళ్లకు రవుతెండి కడియాలు, నడుం చుట్టూ, కాళ్లకు ఘల్లు ఘల్లున మోగే గజ్జెలు. భుజాన కావడిని వేసుకొని, చేతిలో దివిటీ లాంటి కందిలీ దీపాన్ని వెలిగించుకొని ఎడమ చేత గంట ఊపుతూ… తెల్లవారు జామున వాడ వాడ తిరుగుతూ… బిచ్చమెత్తుతారు. ప్రతీ ఇంటినుండి- బిచ్చం వేసిన తర్వాతనే ఇంకొక ఇంటికి కదులుతారు. బిచ్చం వేసిన ఇల్లు సిరిసంపదలతో తుల తూగాలని ఆశీర్వదిస్తూ… తమ జోలెలో ఉన్న పెద్ద శంఖాన్ని తీసి, దానిని ఊదుతూ విజయభేరిని తలపింప చేస్తారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి, ఇంటిల్లి పాదిని నిద్ర నుండి లేపుతారు. పాటలు పాడుతూ, తంబూరను వాడుతారు. హార్మోన్యం, తాళాలు, మద్దెల, ఇంకా పౌరాణిక నాటకాలకు కావలసిన సామాగ్రిని వాడుతారు. బిచ్చం అడుక్కొని జీవితం కొనసాగిస్తున్నారు.
 
ఇంకొందరు [[బుర్రకథ]] గొంగడి, డప్పు కట్టె ద్వారా [[ఒగ్గు కథ]]ను చెప్పే బీరన్నల వారి మాదిరిగా గొల్లలను అడుక్కొని జీవిస్తున్నారు. ఒగ్గు కథలను చెప్పుకుని [[గొల్ల]] కుర్మ ఉత్పత్తి కులాలను అడుక్కోటం సహజ క్రియగా వీరికి అబ్బింది. అందు వల్ల వీరి కుల దేవుడు దుబ్బ మల్లన్న అయ్యాడు. రాత్రంతా కథలు చెపుతూ ఇంటికో గొర్రెను, ఇంటికింత డబ్బును, ఇంటికింత ధాన్యాన్ని అడుక్కుంటారు. ఇంకొందరు తోలు బొమ్మలను ఆడిస్తూ ధాన్యాన్ని, అన్నాన్ని, బట్టలను అడుక్కొని జీవన యాత్రను సాగించేవారు నేటికీ ఉన్నారు’. గోసంగి కులంవారు తమ జీవనోపాధికి తంబూరను వాడుతారు. హార్మో న్యం, తాళాలు, మద్దెల, ఇంకా పౌరాణిక నాటకాలకు కావలసిన సామా గ్రిని వాడుతారు. రామాయణం, మహాభారతం, ఈ విధంగా జానపద కళల సంరక్షకులుగా గోసంగి కులంవారు సమాజానికి హితోధికంగా దోహదపడుతున్నారు.
 
===జానపద కళలకు ప్రాధాన్యత తగ్గడం వల్ల===
పంక్తి 36:
 
==='''ఏ చిన్న గొడవ వచ్చినా'''===
వీరు ఏ చిన్న గొడవ వచ్చినా వాటిని పెద్దవి చేసుకొని పంచాయితీలు పెట్టుకుంటారు. తీర్మానం చేసిన పెద్ద మనుషులకు కొంత డబ్బు ఇవ్వడమే కాక, ఆ రోజు పంచాయితికీ వచ్చిన వారందరికీ తినటానికి, తాగడానికి ఖర్చు చేసే పద్దతిపద్ధతి ఉంది. ఈ ఖర్చుఅంతా తప్పు చేసిన వారిపై పడుతుంది. విశేషం ఏమిటంటే వీరి పంచాయితీ ఒక్క పైసా లేకుండా జమానతు రూపంలో (అడ్వాన్సుగా) చీపురు పుల్లల లాంటివి పెడతారు. అగ్గిపు ల్లలను, తుమ్మముండ్లను ఇంకా ఇతరత్రా అక్కడ ఆ సమయంలో ఏ వస్తువు దొరికితే ఆ వస్తువును తమ వైపున నిలబడిన పెద్ద మనిషి చేతిలో పెడతారు. ఒక పుల్ల ఖరీదు వంద రూపాయలు, పది చీపురు పుల్లల ఖరీదు 1000 రూపాయలుగా చెలామణి అవుతాయి. ఒక్కొ క్కరు వేయి రూపాయల జమానతు ఇవ్వాలంటే పది పుల్లలను బయానా పెడతారు. మాట మీద నిలబడతారు. పదిమంది ఎట్లా నిర్ణయం చేస్తే ఆ విధంగా మసులు కుంటారు. తప్పు చేసిన వ్యక్తి ఈ వేయి రూపాయలు సమర్పించుకోవాలి. ఈ వేయి రూపాయలు ఇవ్వటానికి వాయిదాల పద్ధతి కూడా ఉంటుంది. దీనిని దండుగ అంటారు.
 
ఈ దండుగ వేయించిన అవతలి వ్యక్తి హీరోగా చెలామణి అవుతాడు. సంతోష పడతాడు. ఈ దండుగ పెట్టించటం వల్ల హీరోకు వ్యక్తిగతంగా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అవతల వ్యక్తి చేత దండుగ పెట్టించాను అనే డాంబికం తప్ప. ఈ దండుగ రూపాయలు పంచాయితీ పెద్దమనుషులకు చేరతా యి. వాటిని దాదాపు సగం వరకు తినడానికి తాగడానికి మాత్రమే ఖర్చు చేస్తారు. ఇంకా సగం మరోసారి అవసరానికి వాడుకుంటారు. ఈ దండుగ రూపాయలు ఖర్చు చేయించటానికి ఆడవాళ్లుకూడా ఉత్సుకతను కనపరుస్తా రు. ఆడ మగ తారతమ్యం లేకుండా తెల్లకల్లు, నల్లకల్లు, సారాయి, గుడుంబా లను తనివితీరా సేవించటం వీరికి వారసత్వంగా వస్తున్న సంస్కృతిలో భాగం.
 
తెలంగాణలో [[గనిశెట్టి రాములు]], మిర్యాల సాయిలు, విభూతి శంకర్‌, ఇ.ఎం. గంగాధర్‌, గంగమల్లు, బాలయ్య, పోశెట్టి, సాయన్న, గంగయ్య అబ్బయ్య, మల్లయ్య, సదుల కిష్టయ్య రాములమ్మ, లక్ష్మి మొదలగు వారు గోసంగిల అభివృద్ధికి కృషి చేస్తున్నవారిలో ముఖ్యులు. రాయలసీమలో మారయ్య, పెంటయ్య, రాసారి ఇస్తారె, ఆంధ్రాలో భూమయ్య, దశరథ్‌, కిషన్‌, రాజలింగం, పరశురాం, బుద్దిబుద్ధి రాజు, పంతుకుమార్‌ తదితరులు కూడా వీరి అభివృద్ధిలో కొనసాగుతున్నారు. ఒకపక్క ప్రపంచంలోనే పేరెన్నిక గన్న హైటెక్‌ సిటీ అని ఆంధ్రప్రదేశ్‌లో పేరుగాంచిన పెద్ద పెద్ద టెక్నాలజీ వ్యవస్థలు పెరుగుతున్నా… ఇంకొక పక్క గోసంగి కులంలో పుట్టిన ఏ ఒక్క వ్యక్తికి కూడా చదువు రాకుండా ఉండే స్థితి. గోసంగివారు వారి పిల్లలకు విద్యాభ్యాసాలు నేర్పించటానికి ముందుకు రారు. ఒక అక్షర జ్ఞానిగా బతకమని తమ పిల్లలకు చెప్పుకోరు. ఇలాంటి ఆలోచనలే గోసంగులకు రాదు.
 
ఈ జాతిలోని వారు ఎప్పటికీ బానిసలుగానే ఉండాలనే ఆలోచన పుట్టుకతోనే వచ్చింది. అతి పెద్దదైన భారత రాజ్యాంగ వ్యవస్థ వీరికి చాలా బహుదూరం. వీరికి ఏ రంగంలోనూ ప్రామాణికమైన ఆలోచనలు రావు. సమాజంలో ఏవిధంగాబతకాలి? రాజ్యాంగం తమకు ఒనగూర్చిన హక్కులే మిటి? ఏ ప్రభుత్వం కింద, ఎందుకు, ఎవరికోసం బతుకుతున్నాం!, పోనీ మా సంతతినన్నా ఉన్నత విద్యావంతులుగా తయారు చేయాలి, ఉద్యోగస్తులుగా ఎదిగేటట్లు చేయాలి, లేదా అన్నింటికంటే ముఖ్యమైన రాజకీయ వ్యవస్థలో వీరిని రాణించే విధంగా తయారు చేయాలనే ఆలోచనలు గోసంగి కుల వారసులకు ఎదిగేటట్లు చేయాలి.
 
 
==వర్గీకరణ==
Line 118 ⟶ 117:
 
==మూలాలు==
*[https://www.telugubooks.in/products/gosangilu-evaru తెలంగాణలో [[గనిశెట్టి రాములు]], ‘చీకటి బ్రతుకుల్లో గోసంగిలు’ (2004) అనే ఒక పుస్తకం ]
 
*[http://www.archive.org/details/TeluguVariJanapadaKalarupalu తెలుగువారి జానపద కళారూపాలు - కళప్రపూర్ణ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ]
 
Line 131 ⟶ 129:
[[వర్గం:కళలు]]
[[వర్గం:కళాకారులు]]
[[వర్గం:జాబితాలు]]
[[వర్గం:జనజీవనం]]
[[వర్గం:తెలంగాణ]]
Line 138 ⟶ 135:
[[వర్గం:జానపద కళారూపాలు]]
[[వర్గం:వినోద కార్యక్రమాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు]]
[[వర్గం:జానపద కళారూపాలు]]
"https://te.wikipedia.org/wiki/గోసంగి_కులం" నుండి వెలికితీశారు