"ధర్మరాజు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
మరళ రెండవసారి జూదమాడడానికి హస్తినాపురికి పిలుస్తాడు. ఓడినవాల్లు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే, ఆనాటి నుంచి మళ్ళీ అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో విధిపైపరీత్యం వల్ల మళ్ళా ఓడిపోతాడు. ధర్మప్రభువు ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో వుండడానికి ఇష్టంలేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం లల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు.
 
 
అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు వేటాకువెళ్ళిన భీమున్ని కొండచిలువ గట్టిగా చుట్టేసింది. ధర్మరాజు తమ్మున్ని వెదుకుతూ అక్కడకు వెళ్ళి ఆ మహాసర్పం అడిగిన ప్రశ్నలకు ధర్మబలంతో తగిన సమాధానాలిచ్చి, తమ్మున్ని విడిపించుకొని వచ్చాడు. ఆ పాము శాపం తొలగి [[నహుషుడు]] అనే మహారాజయ్యాడు.
 
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/293806" నుండి వెలికితీశారు