నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వ్యక్తిగత జీవితం: AWB తో "మరియు" ల తొలగింపు
సామాజిక సంస్కరణలు
పంక్తి 42:
లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థను 1996లో ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాను సవరించే చట్టాన్ని, నేరచరిత్రను తిరగేసి సరైన వారికే అధికారం కట్టబెట్టే చట్టాన్ని, పార్టీనిధులను సమీకరించే చట్టాన్ని, మంత్రి వర్గాల సవరణ చట్టాన్ని, పార్టీ ఫిరాయింపులను నిషేధించే చట్టం, గ్రామీణ న్యాయవాదం, జాతీయ ఆరోగ్య మిషన్‌, సమాచార హక్కు, సహకార సంఘాలకు స్వయంప్రతిపత్తి ఇలా అనేక చట్టాలను లోక్‌సత్తా సేవా సంస్థ ద్వారాప్రజల్లోకి తీసుకురాగలిగారు.1996 లో ఐఎఎస్‌ పదవిని వదలి లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా మార్చారు. బుద్ధుడన్నా, బుద్ధుని బోధలన్నా చాల ప్రియం. 2009 లో [[కూకట్ పల్లి]] నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలుపొందారు. 2014 లో మల్కజ్ గిరి నుంచి లోకసభకు పోటిచేసి ఓడిపోయారు.
 
== వ్యక్తిగత జీవితం ==
ఒక [[తెలుగు]] మాట్లాడే కుటుంబంలో [[మహారాష్ట్ర|మహారాష్ట్రలోని]] నాగభిర్‌లో 14 జనవరి 1956 న జన్మించారు. మూడవ యేట నుండి 7 సంవత్సరాల వయస్సు వరకు [[విజయవాడ]] సమీపం లోని [[గొడవర్రు]] అనే గ్రామంలో పెరిగారు. ఇక్కడే తెలుగు మీడియంలో చదువు కొనసాగింది. 7 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులతో [[కృష్ణా జిల్లా]] [[ఇందుపల్లి]] సమీపంలోని [[వేమండ]] గ్రామానికి మారారు. 1969 లో [[ఆంధ్ర లయోలా కళాశాల]]<nowiki/>లో ఇంటర్మీడియట్ కోసం చేరారు. తదనంతరం వైద్యపట్టా పొందారు. భార్య రాధ, అమ్మాయి స్నిగ్ధ, అబ్బాయి సిద్ధార్ధ.
 
== సామాజిక సంస్కరణలు ==
 
* నారాయణ ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎఫ్‌డిఆర్) వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుతం దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజకీయ, ఎన్నికల మరియు పాలన రంగాలలో మరియు రాష్ట్ర విధానం యొక్క క్లిష్టమైన రంగాలలో ప్రాథమిక సంస్కరణలను రూపొందించడానికి మరియు ప్రోత్సహించడానికి భారతదేశంలోని ప్రముఖ థింక్-ట్యాంకులు మరియు పరిశోధన-వనరుల కేంద్రాలలో FDR ఒకటి.
 
* నారాయణ [[యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం]] (వైపిపి) యొక్క సలహాదారు, సామాజిక స్పృహ ఉన్న యువతకు వారి అభిప్రాయాలు, ఆలోచనలను వ్యక్తీకరించడానికి మరియు జాతీయ భవన ప్రక్రియలో మార్పు ఏజెంట్‌గా పనిచేయడానికి యూత్ పార్లమెంట్ ఒక అనువైన వేదిక.
 
[[దస్త్రం:Jayaprakash Narayan & Spouse.jpg|thumbnail|డా. జయప్రకాష్ నారాయణ్, ఆయన సతీమణి రాధ, హైదరాబాదులోని శంశాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో]]